లక్షలు ఖర్చయ్యే క్యాన్సర్ రేడియేషన్ థెరపీ ఇప్పుడు నిమ్స్ లో ఉచితం.. శుభవార్త!
తెలంగాణ ప్రభుత్వం వైద్య ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేయడానికి కట్టుబడి పని చేస్తుంది. ఈ క్రమంలో రాష్ట్రంలో ప్రతి జిల్లాకు మెడికల్ కళాశాలను ఏర్పాటు చేయడంతో పాటు కొత్త ప్రభుత్వ ఆసుపత్రులను నిర్మాణం చేస్తుంది. మరోవైపు వైద్య సిబ్బంది నియామకాలకు కూడా పెద్ద పీట వేస్తోంది. అంతేకాదు పెద్ద ఆసుపత్రుల్లో అధునాతన వైద్య సేవల్ని పేదలకు అందిస్తోంది.
నిమ్స్ ఆసుపత్రిలో అత్యాధునిక రేడియేషన్ థెరపీ సేవలు
ఈ క్రమంలో హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో అత్యాధునిక రేడియేషన్ థెరపీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటళ్లకే పరిమితమైన రూ.30 కోట్ల విలువైన 'ట్రూబీమ్ లీనియర్ యాక్సిలరేటర్' యంత్రాన్ని నిమ్స్ లో అందుబాటులోకి తెచ్చింది. దీని ధర సుమారు రూ.30 కోట్ల వరకు ఉంటుందని నిమ్స్ డైరెక్టర్ బీరప్ప తెలిపారు.

నిమ్స్ లో క్యాన్సర్ రోగుల పాలిట వరం.. ట్రూబీమ్ యంత్రం
సాధారణ రేడియేషన్ చికిత్సల్లో క్యాన్సర్ కణాలతో పాటు ఆరోగ్యకరమైన కణాలు కూడా దెబ్బతిని సమస్యలు తలెత్తుతుంటాయి. ఫలితంగా పేషెంట్ ఆరోగ్యం దెబ్బ తింటుంది. ఈ ఇబ్బందులకు చెక్ పెట్టే ట్రూబీమ్ యంత్రం, హై-రెజల్యూషన్ ఇమేజింగ్‌తో ట్యూమర్ కదలికలను ట్రాక్ చేస్తుంది. క్యాన్సర్ కణాలకు మాత్రమే రేడియేషన్ అందిస్తూ, ఆరోగ్యకరమైన కణజాలానికి హాని కలగకుండా, లోతైన ట్యూమర్లను సైతం ఇది నాశనం చేస్తుంది.
సర్జరీ లేకుండా క్యాన్సర్ తగ్గించేలా పని చేసే యంత్రం
ఈ టెక్నాలజీతో వీర్యగ్రంథి, క్లోమగ్రంథి, కాలేయం, మెదడు, ఊపిరితిత్తులు, వెన్నెముక వంటి సున్నిత భాగాలలోని క్యాన్సర్‌లకు సర్జరీ లేకుండానే, తక్కువ సెషన్లలో చికిత్స చేయవచ్చు. ఈ సెషన్ లు ఒక్కో సెషన్ కేవలం కొన్ని నిమిషాల్లోనే పూర్తవుతుందని నిమ్స్ డైరెక్టర్ బీరప్ప వెల్లడించారు.
లక్షలు ఖర్చయ్యే చికిత్సలు పేదలకు ఉచితంగా
ప్రైవేట్ ఆసుపత్రులలో లక్షల రూపాయలు ఖర్చయ్యే ఈ అత్యాధునిక చికిత్సలను, నిమ్స్‌లో పేదలకు ఉచితంగా అందిస్తున్నారు. మిగతా వారికి కూడా అత్యంత తక్కువ ఖర్చుతో వైద్యం అందించనున్నట్లు డాక్టర్ బీరప్ప స్పష్టం చేశారు. మొత్తానికి తెలంగాణా రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖా మంత్రి దామోదర రాజనర్సింహ ఆధ్వర్యంలో వైద్య ఆరోగ్య శాఖలో విప్లవాత్మకమైన మార్పులు జరుగుతున్నాయి. ఈ మార్పులు నిరుపేదలకు వైద్య సేవలను వారి చెంతకు చేర్చే వరంగా మారనున్నాయి.
-
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
Revanth Reddy:కేరళం గడ్డపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..ఇద్దరి మధ్య సీక్రెట్ డీల్..!! -
2027 మార్చి తర్వాతే జిల్లాల మార్పులు : సీఎం రేవంత్ రెడ్డి -
మహిళలకు తులం బంగారం హామీ.. మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రకటన! -
హైదరాబాద్ లో 100 కు పైగా ఎకరాల్లో.. -
బాసరలో వీఐపీ వాహనాలకు సైతం నో ఎంట్రీ -
గోల్కొండ తారామతి రిసార్ట్ లో డ్రగ్స్ పార్టీ, బాలీవుడ్ నటులు, ఈగల్ టీమ్ షాకింగ్ రైడ్! -
అదే జరిగితే.. హన్మకొండ చౌరస్తాలో ఉరి వేసుకుంటానన్న మాజీ అసెంబ్లీ స్పీకర్ -
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
పాకిస్థాన్ లో బర్రెలకు డైపర్లు.. లేదంటే రోజుకు రూ.30 పన్ను కట్టాల్సిందే.. -
పెట్రోల్ కష్టాలు.. వారానికి 2 రోజులు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
సింహరాశి, కన్యారాశి మే నెల జాతక ఫలం -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
ప్రేమ పేరుతో గొడ్డు మాంసం తినిపిస్తూ.. మతం మార్చి నరకయాతన!













Click it and Unblock the Notifications