వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అజర్‌ న్యాయపోరాటం!

By Staff
|
Google Oneindia TeluguNews

రాహు కేతువులు సంచరిస్తున్న రాశుల మధ్య గ్రహసంయోగం జరగడాన్ని కాలసర్ప యోగం అంటారనితెలుగువిశ్వవిద్యాలయంలో జ్యోతిష శాస్త్ర విభాగం అధిపతి డాక్టర్‌ చిర్రావూరి సుబ్రహ్మణ్యంఅన్నారు. 2000 సంవత్సరం ఏప్రిల్‌ చివరి నుంచి మే రెండవవారం వరకు అయిదు నుంచి ఆరు గ్రహాలు మేషరాశిలో సంయోగం చెందుతు న్నాయని ఇందువల్లఉద్యమాలు, సమ్మెలు అధికం అవుతాయని ఆయన తెలిపారు. ఇంతకు మించి గణనీయమైన దుష్పరిణామాలువుండవన్నారు. అయితే నవంబర్‌ లో రవి వృశ్చికంలోసంచరిస్తూ, శనితో సమసప్తకం అయనప్పుడు యుద్ధ వాతావరణంనెలకొంటుందని చెప్పారు. యుద్ధ పరిస్థితులే తప్ప ఎటువంటి ప్రాణనష్టం మాత్రం వుండదని తెలిపారు.

మానసిక సంఘర్షణలు అధికం...

గ్రహాలు మానసిక అంశాలపై ప్రభావం చూపిస్తాయని ముఖ్యంగా ఇప్పడు జరుగుతున్న గ్రహ సంయోగం వల్ల కార్మికులు, టీచర్లలో ఉద్రిక్తతలు పెరిగే సూచనలున్నాయే తప్ప ఎటువంటి ప్రకృతి వైపరీత్యాలకు తావు లేదన్నారు. గ్రహసంయోగంలో విశేషం ఏమిటంటే గురువు మేషంలో, ఉచ్ఛ స్థానంలో వుండగా మిగిలిన గ్రహాలు వచ్చి గురువుతో సంయోగం చెందుతున్నాయి. గురువు అభివృద్ధి కారకుడు కావడం, ఉచ్ఛ స్థానంలో కూడా వుండడం వల్ల శనితో సంయోగ దుష్ప్రభావం తగ్గుతుంది వివరించారు.

ఆమావాస్య నాడు నేరాలు అధికంగా జరుగుతున్నాయని గతంలో కొన్ని రిపోర్టులు వెల్లడించాయని, అమావాస్య రోజున రవి, చంద్రుల సంయోగం వల్లనే ఇది జరుగుతున్నదని గ్రహించాలని సుబ్రహ్మణ్యం అన్నారు. 1962 ప్రాంతోలో అష్టగ్రహ కూటమి ఏర్పడిందని, అప్పుడు పెద్దగా దుష్ఫలితాలు రాని విషయాని మనం గ్రహించాలన్నారు. గురువు ఉచ్ఛ స్థానంలో వున్నందున ఆర్థిక పరంగా పెద్దగా ఒడిదుడుకులు వుండకపోవచ్చునని ఆయన జోస్యం చెప్పారు. శాస్త్రం ప్రజలకు వికాసం కలిగించేదిగా వుండాలని భయపెట్టేదిగా వుండకూడదని ఆయన అభిప్రాయ పడ్డారు. ఈ గ్రహకూటమి గురించి కొన్ని ఆపోహలు, భయాలు ఉన్నాయని, అయితే ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

డాక్టర్‌ చిర్రావూరిసుబ్రహ్మణ్యం
జ్యోతిష విభాగం శాఖాధిపతి,
తెలుగు విశ్వవిద్యాలయం
హైదరాబాద్‌.

ఆర్థిక సంక్షోభం...యుద్ధ భయం
శ్రీ. వి.ఆర్‌.కె. మూర్తి.

హోమ్‌పేజి

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X