వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

న్యూ మిలీనియంమెయిల్‌

By Staff
|
Google Oneindia TeluguNews

పార్లమెంట్‌లో లేదా అసెంబ్లీలో వైరి పక్షాల మధ్య ఎంత భీకరంగా గొడవ జరిగినా తెల్లవారి పత్రికల్లో మాత్రం పూర్తి వివరాలు రావు. సభ్యులు పరస్పరం దుమ్మెత్తి పోసుకున్నారనో, వాగ్బాణాలు సంధించుకున్నారనో మాత్రమే వుంటుంది. నోటికొచ్చినట్టుగా మాట్లాడే వెసులుబాటు సభలో లేకపోవడం వల్లా, మాట్లాడినా సదరు భాషను రికార్డుల్లోంచి సభాపతి తొలిగించడం వల్ల సభ్యులు యధేచ్చగా ఉపయోగించే భాష వెలుగుచూడదు. అయితే అలాంటి భాషను గురించి తెలుసుకునే అవకాశం ఇప్పుడు వచ్చింది.

ఈ మధ్య లోక్‌ సభ బుల్లెటిన్‌లో ఒక వార్తవచ్చింది. అన్‌పార్లమెంటరీ ఎక్స్‌ప్రెషన్స్‌ ( పార్లమెంట్‌లో ఉపయోగించకూడని భాష) పై వెలువరించిన గ్రంధం తాజా ఎడిషన్‌ అమ్మకానికి సిద్ధంగా వున్నదని ఆ వార్త సారాంశం. సవరణలతో, విస్తరణలతో వెలువరించి 500 పేజీల పుస్తకాన్ని 25 శాతం డిస్కౌంట్‌తో లోక్‌ సభ సెక్రటేరియట్‌ సభ్యులకు ఆఫర్‌ చేసింది. గత కొన్ని దశాబ్దాల కాలంలో పార్లమెంట్‌లో, రాష్ట్రాల అసెంబ్లీల్లో నిషిద్ధంగా నిర్ణయించిన పదాలు, వ్యాఖ్యల సంకలనంగా ఈ పుస్తకాన్ని చెప్పవచ్చు. 1160 రూపాయల ధరతో వెలువడిన ఈ పుస్తకం పై డిస్కౌంట్‌ కేవలం పార్లమెంట్‌ సభ్యులకు మాత్రమే ఇచ్చారు.

లయ్‌, లయ్యర్‌ వంటి పదాలపైనే ఈ పుస్తకంలో అయిదుపేజీల సుదీర్ఘ వివరణ వుంది. పార్లమెంట్‌ సభ్యులకు, ఎలా మాట్లాడాలో నేరుగా చెప్పకుండా లౌక్యంగా ఎలా మాట్లాడకూడదో చెప్పడానికి ఈ పుస్తకం బాగానే వున్నా మరి సామాన్యుల మాటేమిటి? అన్‌పార్లమెంటరీ భాషను రికార్డుల్లోంచి తొలిగిస్తారు కనుక సగటు పౌరునికి అసలా అన్‌పార్లమెంటరీ భాష ఏమిటో తెలిసే అవకాశం లేదు. అందువల్ల పార్లమెంట్‌ నిషిద్ధ భాష ఏమిటో తెలుసుకోవడానికి, ఈ పుస్తకం బాగానే ఉపయోగపడుతుంది. ఏ పదాలు, వాఖ్యలు, పదబంధాలను నిషేధించారో మాత్రమే కాకుండా, ఏయే సందర్భాల్లో ఏ సభలో వాటిని నిషేధించారో వివరణాత్మకంగా కూడా ఈ పుస్తకంలో వుంది.

ఈడియట్‌, బఫూన్‌, ఫూల్‌, కవర్డ్‌, గూన్‌, బాస్టర్డ్‌, మర్డరర్‌, వార్మ్‌, సిఐఎ ఎజెంట్‌ వంటి పదాలు అనేకం ఈ పుస్తకంలో వున్నాయి. ఏ సందర్భంలో ఏ పదం వాడినప్పుడు దాని అన్‌పార్లమెంటరీగా ఎక్కడి అసెంబ్లీలో లేదా పార్లమెంట్‌లో ప్రకటించారనే వివరణలు కూడా ఈ పుస్తకంలో వున్నాయి. తిట్లూ, దూషణలు మాత్రమే కాకుండా సభ్యులు మరో సభ్యుని మేధాశక్తిని తన సొంత భాషలో బేరీజు వేసే పద్దతి కూడా నిషిద్ధమే. అలాంటిదానికి ఉదాహరణగా 1949లో కామన్వెల్త్‌ లెజిస్లేచర్‌లో ఒక సభ్యుడు మరో సభ్యున్ని ఉద్దేశించి చేసిన వాఖ్యను చెప్పుకోవచ్చు. ఆయన మెదడు వేరుశెనక్కాయలోపలి భాగంలో ఏ భాగాన్ని తాకకుండా వేల సంవత్సరాలపాటు పరిభ్రమించగలదు. అంటూ ఒక సభ్యుడు చేసిన వేళాకోళం అప్పట్లో ఆ సభను అట్టుడికించింది. కోడి మెదడు అని ఆడిపోసుకోవడం, లేదా కుక్కకు కూడా అర్థం అవుతుంది ఆమాత్రం తెలియదా అని ఎత్తిపొడవటం వంటి వాక్యాలతో మరో సభ్యుని మేధాశక్తిని బేరీజు వేసే ధోరణి కూడా పార్లమెంట్‌లో నిషేధమే. పోనీ కాస్తా లౌక్యాన్ని ప్రదర్శించి, ఆ మాత్రం అర్థం చేసుకునే తెలివి మీకు వుందనుకుంటా, మీ మానసిక స్థితి సరిగ్గానే వుందని భావిస్తున్నాను, బుద్ధిహీనత ఈ సభలో అనర్హత కాదని ఎట్టకేలకు నేను నిర్థారణకు వచ్చాను, వంటి వాక్యాలను ప్రయోగించే ప్రయత్నం చేసినా వాటిపై నిషేధాస్త్రమే వుంది.

తెలియకపోతే చదువుకుని రండి అని వెటకారం చేయదల్చుకున్నా, బుద్దిని ఉపయోగించండి అసలదంటూ వుంటే అని ఎద్దేవ చేయదల్చినా సెన్సార్‌ కత్తెర పడుతుంది. కండబలం వున్న వారు సభలో ఎందుకులే అనుకుని, బయటకురా చూసుకుందామని తొడచరిచినా, చెప్పుతీసుకు కొడుతానని రంకెవేసినా, గొంతుపిసికేస్తానని వార్నింగ్‌ ఇచ్చినా అది తప్పే. సభాధ్యక్షునితో మాట్లాడేవిషయంలో కూడా జాగ్రత్తలు చాలా అవసరం. మీరూలింగ్‌ రాజ్యాంగ విరుద్దం అని లేదా మీరు నిష్పాక్షికంగా వ్యవహారించడంలేదు అని స్పీకర్‌ను ఆక్షేపించడానికి లేదు. అదే విధంగా రాష్ట్రముఖ్యమంత్రిని డ్రామారావు అని జర్నలిస్టును ఎల్లో అని ముద్దుగా పిలిచినా నిషిద్ధ భాష పరిధిలోకే వస్తుంది.

గత సంచికలో

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X