పాదయాత్ర ఫలం?

Posted By:
Subscribe to Oneindia Telugu
హైదరాబాద్‌ః వచ్చేఅసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ టికెట్‌ రాదనిఅర్ధమైన సిటింగ్‌ టిడిపి ఎమ్మెల్యేలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. దింపుడు కళ్ళం ఆశ ఉన్న వారు మాత్రం అధినేతను ఎలాగైనా మెప్పించుకునే ప్రయత్నంలో ఉన్నారు. టికెట్‌ రాదని అనుమానం ఉన్న తెలంగాణ టిడిపి ఎమ్మెల్యేలు మాత్రం చివరి నిముషంలో టిఆర్‌ ఎస్‌ టికెట్‌ దొరకకపోతుందా అన్న ధీమాతో ఉన్నారు.

తెలుగుదేశం పార్టీ వర్గాల నుంచిఅందుతున్న ప్రాధమిక సమాచారం ప్రకారం యాభై మంది సిటింగ్‌ ఎమ్మెల్యేలకు టిడిపి టికెట్లు రావు. నగరానికి చెందిన కృష్ణాయాదవ్‌ టికెట్లు రాని నాయకుల జాబితాలో ప్రధమ స్ధానంలో ఉన్నారు. గుంటూరు టూ టిడిపి టికెట్‌ శనక్కాయలఅరుణకు దక్కే అవకాశం లేనే లేదు. ప్రకాశం జిల్లాలో డాక్టర్‌ పాలేటిరామారావు, మచిలీపట్నంలో మంత్రి నరసింహారావు కూడా పార్టీ హిట్‌ లిస్టులో ఉన్నట్టు చెబుతున్నారు.

తెలంగాణలో రెండు మూడు స్ధానాల్లో సిటింగ్‌ ఎమ్మెల్యేలకు బదులు ఎన్నారైలకు అవకాశం కల్పిస్తారని తెలుస్తోంది. సామాజికసేవ చేస్తూ క్లీన్‌ ఇమేజి తెచ్చుకున్న వారికోసం అన్వేషణ సాగుతోంది.ఈసారి తమకు టికెట్‌ దక్కదని తేలిపోయిన నాయకులు వచ్చినంత కట్నం అన్న చందంగా అధినేతపీకల మీద కూర్చుని పనులు చేయించుకుంటున్నట్టు తెలిసింది.

పార్టీ టికెట్లకు సంబంధించిన ప్రాధమిక కసరత్తు ఎప్పుడో పూర్తయిపోయింది. ఎన్నికల తేదీ ప్రకటించిన తర్వాత కొన్ని సర్దుబాట్లు ఉంటాయి అని తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి రోజూ వచ్చేసీనియర్‌ నాయకుడొకరు చెప్పారు.

మంత్రి పదవులు ఆశించి భంగపడిన ఎమ్మెల్యేలందరినీ ముఖ్యమంత్రి బాగా చూసుకున్నారు. ఎన్టీఆర్‌ హయాంలో చాలా మంది ఎమ్మెల్యేలకు కార్లు కూడా ఉండేవి కావు.అసెంబ్లీకి సచివాలయానికి ఆటోల్లో చాలా మంది ఎమ్మెల్యేలు వచ్చేవారు.

ఆర్ధికంగా స్ధిరపడడానికి అప్పుడు ఇన్ని అవకాశాలు లేవు. ఎమ్మెల్యేలసిఫార్సులను సీనియర్‌ అధికారులు మన్నించేవాళ్ళు కాదు. ఇప్పుడు ఎమ్మెల్యేలసిఫార్సు లేఖలపై సత్వరం చర్యలు తీసుకోవలసిందిగాసీనియర్‌ అధికారులందరికీ ఆదేశాలున్నాయి. మంత్రి పదవికి ఉన్న గ్లామర్‌ వేరైనప్పటికీ అది దక్కనందుకుసీనియర్‌ ఎమ్మెల్యేలు పెద్ద బాధపడవలసిన అవసరం లేకుండా ముఖ్యమంత్రి చూడగలిగారు.

నియోజకవర్గంలో ఆయా ఎమెల్యేలు చేసిన పనిని, తెచ్చుకున్న మంచిపేరును ఇండికేటర్లుగా తీసుకుంటున్నారు. గతంలో పార్టీ టికెట్లు పొంది కాంగ్రెస్‌ అభ్యర్ధుల చేతుల్లోస్వల్ప మెజారిటీతో ఓడిపోయిన నాయకులకు వారు యాక్టివ్‌ గా ఉంటే మళ్లీ అవకాశం లభించవచ్చని పార్టీ వర్గాలు తెలిపాయి.

 Recent Stories

  • ఇక కండ్ల కలక
  • ఆస్పత్రిలోలియాండర్‌
  • మార్స్‌ఫాస్ట్‌
  • పెద్దల సభకుపెద్దాయన
  • సమైక్యాంధ్ర కోసం
  • టిడిపిబాటలో...
  • పల్స్‌ పోలింగ్‌!
  • వైఎస్‌ కు సమాంతరం?
  • టిడిపి ఆశాభావం

Archives

హోమ్‌ పేజి

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి