చీము నెత్తురు ఉంటే - హరీష్ సంచలనం..!!
తెలంగాణ రాజకీయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. కాంగ్రెస్- బీఆర్ఎస్ మధ్య రాజకీయ పోరు పతాక స్థాయికి చేరింది. అసెంబ్లీ సమావేశాల వేళ హోరా హోరీగా తల పడుతున్న రెండు పార్టీలు ఇప్పుడు 22 ఏ భూముల వ్యవహారంలో విమర్శలు చేసుకుంటున్నాయి. రెవిన్యూ మంత్రి పొంగులేటి లక్ష్యంగా బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేసారు. ప్రభుత్వం పైన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పొంగులేటికి సవాల్ చేసారు.
మాజీ మంత్రి హరీష్ రావు 22ఏ భూముల వివాదం పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సమయంలో కీలక అంశాలను ప్రస్తావించారు. రేవంత్ ప్రభుత్వం పైన ఆరోపణలు కొనసాగించారు. కలెక్టర్ల మెడపై క త్తిపెట్టి 22ఏ లిస్టులో భూములను పెట్టించారని, కేసీఆర్ సమస్యలను పరిష్కరిస్తే రేవంత్ సమస్యలు సృష్టించారని మండిపడ్డారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఒక్క సెంట్ భూమి కూడా మా ప్రభుత్వం నిషేధిత జాబితాలో చేర్చలేదన్న వ్యాఖ్యలపై ఆధారాలతో సహా కౌంటర్ ఇచ్చారు. నవంబర్ 20న జనగామ కలెక్టర్ నిషేధిత జాబితా లిస్ట్ తయారు చేసి ఐజీ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్‌కు పంపారని తెలిపారు. ఐజీ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కలెక్టర్ పంపిన భూముల జాబితాను 22-A నిషేధిత జాబితాలో పెడుతూ నోటిఫికేషన్ ఇచ్చింది. ఇలా అన్ని జిల్లాల్లో పెట్టారన్నారు. సిర్పూర్ - కాగజ్ నగర్ ప్రాంతంలో 30 వేల ఎకరాలు అక్టోబర్ 2025లో నిషేధిత జాబితాలో పెట్టిన విషయాన్ని గుర్తు చేశారు. అలాగే మంచిర్యాల నియోజకవర్గంలో 11 వేల ఇండ్లు నిషేధిత జాబితాలో పెట్టారని హరీష్ చెప్పుకొచ్చారు.

ప్రభుత్వం పై విమర్శలు
అదే విధంగా 33 జిల్లాల కలెక్టర్లు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే భూములను నిషేధిత జాబితాలో పెట్టాలని లిస్ట్ తయారు చేసి ప్రభుత్వానికి పంపింది నిజం కాదా అని ప్రశ్నించారు. అన్ని జిల్లాల కలెక్టర్ల జీవోల ఆధారాలతో చూపించాం.. చీము నెత్తురు ఉంటే పొంగులేటి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఒక్క కలం పోటుతో ఊళ్లకు ఊళ్లను 22ఏలో పెట్టిస్తున్నారు. గ్రామాలకు గ్రామా లను 22ఏలో పెట్టడమేంటని ప్రశ్నించారు. భూమి ప్రజల ఆస్తి, వారి హక్కు అనే విషయాన్ని మర్చిపోవదన్నారు. ఈ ప్రభుత్వం భూమిని మార్కెట్ వస్తువులా చూస్తున్నదని... నిన్నటి వరకు హైడ్రా, నేడు 22ఏ పేరుతో ప్రజలతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వమే ప్రజలకు భరోసా లేకుండా చేస్తే ఎలా అని ప్రశ్నించారు. ఇక ప్రజలు తమ సమస్యలను ఎవరికి చెప్పుకోవాలని నిలదీశారు. కాంగ్రెస్ ప్రభుత్వం హెచ్‌సీయూ భూములను బాంబే స్టాక్‌ఎక్సేంజ్‌లో కుదువపెట్టి 10 వేలే కోట్ల అప్పు తీసుకొచ్చారు. రేవంత్ ఏం చేసినా దానికి వెనుక భూములను కాజేసే కుట్ర ఉంటుందని ఆరోపించారు. ఈ ప్రభుత్వాన్ని ప్రజలే 30 పర్సంటేజ్ ప్రభుత్వం అంటున్నారని గుర్తు చేశారు.













Click it and Unblock the Notifications
