వ్యతిరేక గాలి
హోంపేజి
టాక్ ఆఫ్ టుడే
రాజకీయాలు Monday, April 26 2004
హైదరాబాద్: సోమవారం రెండోవిడతపోలింగ్‌లో తెలుగుదేశం ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగాకన్పించినట్టు కోస్తా ఆంధ్ర, రాయలసీమ జిల్లాల నుంచి వచ్చిన వార్తలుసూచిస్తున్నాయి. మునుపెన్నడూ లేనన్ని ఘర్షణలు రెండోవిడతపోలింగ్‌లో చోటు చేసుకున్నాయి. అక్రమాలకు పాల్పడ్డారనితెలుగుదేశం, కాంగ్రెస్ నాయకులు పరస్పరంఆరోపించుకున్నారు. కోస్తా ఆంధ్ర రాయలసీమ ప్రాంతాల్లో కొన్ని లక్షలపేర్లు ఓటర్ల జాబితాల నుంచి గల్లంతు కావడంతో ఫలితాలు ఎలాఉంటాయోనని అన్ని పార్టీల అభ్యర్ధులు భయపడుతున్నారు.
కాంగ్రెస్‌గెలిస్తే వైఎస్ రాజశేఖరరెడ్డే ముఖ్యమంత్రి అవుతారని ఎఐసిసిసభ్యుడు జయరాం రమేష్ చెప్పి కొన్ని గంటలు కాకముందే పిసిసిఅధ్యక్షుడు డి.శ్రీనివాస్ సోమవారం దీనికి విరుద్ధంగామాట్లాడారు. ముఖమంత్రి అభ్యర్ధిగా రకరకాల పేర్లనుప్రచారంలోకి తేవద్దని ఆయన తన పార్టీ వారిని కోరారు.ముఖ్యమంత్రి అభ్యర్ధిని ఇంకా నిర్ణయించలేదని ఆయన అన్నారు.
ముఖ్యమంత్రి ఎవరో ఎమ్మెల్యేలు, ఎఐసిసి అధ్యక్షురాలునిర్ణయిస్తారని శ్రీనివాస్ అన్నారు. దీనితో ముఖ్యమంత్రి అభ్యర్ధిపైకాంగ్రెస్‌లో ఇంకా అనిశ్చితి కొనసాగుతోంది. కాంగ్రెస్ ముఖ్యమంత్రిఅభ్యర్ధిని స్పష్టం చేయడం వల్ల ఓటర్లలో అనిశ్చితి తొలగిపోయి కాంగ్రెస్‌విజయావకాశాలు పెరుగుతాయని రాష్ట్రానికి చెందిన ఒకవర్గం కాంగ్రెస్ నాయకులు పోలింగ్‌కు కొన్ని గంటల ముందుజయరాం రమేష్ వంటి ఒక చిన్న నాయకుడి చేత ప్రకటనచేయించారు.
కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్ధి ఎవరో ఫలితాలతర్వాతే నిర్ణయిస్తారని, ఇది కాంగ్రెస్ సంప్రదాయమని వైఎస్‌స్వయంగా నిన్న మీట్ ది ప్రెస్‌లో ప్రకటించిన కొన్ని గంటలకుజయరాం రమేష్ ఈ ప్రకటన చేయడం గమనార్హం. ఢిల్లీలో వివిధతెలుగుపత్రికల వారికి జయరాం రమేష్‌తో ఇంటర్వ్యూలు ఏర్పాటుచేయించి, ఆయనతో రాజశేఖరరెడ్డే ముఖ్యమంత్రి అభ్యర్ధి అనిచెప్పించినట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రి అభ్యర్ధిపై రాష్ట్ర కాంగ్రెస్‌వ్యవహారాల ఇంచార్జి గులాంనబీ ఆజాద్ మొదటినుంచీ చెబుతున్న దానికి భిన్నంగా జయరాంరమేష్ మాట్లాడం చర్చనీయాంశమైంది. జయరాం కాంగ్రెస్ పార్టీపెట్టుకున్న ఒక విధానాన్ని పక్కన బెట్టి మాట్లాడినట్టయింది.
విద్యుత్ చార్జీల పెంపు, కరువు పరిస్ధితులుటిడిపి ప్రభుత్వ వ్యతిరేకతకు కారణమని స్పష్టంగాతెలుస్తున్నది. విపరీతమైన డబ్బు, ప్రచారం తెలుగుదేశం పార్టీనిగట్టెక్కించే సూచనలు కన్పించడం లేదు.
- తారల ప్రభావం నిల్!
- ఉద్వేగఅంశాలు
- తారల ప్రభావం నిల్!
- ఇప్పటికిప్పుడుచెరిసగం
- పార్టీ టికెట్ల మార్కెటింగు
- చిరంజీవిరహస్య ఎజెండా?
- అస్పష్ట రాజకీయ చిత్రం
- కెసిఆరే పెద్ద ఫ్యాక్టర్
- పార్టీ టికెట్ల మార్కెటింగు
- చిరంజీవిరహస్య ఎజెండా?
- అస్పష్ట రాజకీయ చిత్రం హోంపేజి












Click it and Unblock the Notifications