చింత చచ్చినా పులుపు చావలేదు..
హోంపేజి
టాక్ ఆఫ్ టుడే;/SPAN>
చంద్రబాబు Friday, September 17 2004
హైదరాబాద్: ముఖ్యమంత్రి పదవి పోయి మూడు నెలలు దాటినా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు వ్యవహార శైలి సిఎం అన్నట్టుగానే సాగుతోంది. ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి కంటే బాబుకు సెక్యూరిటీ అధికంగా ఉండడంతో రోడ్ల మీద చంద్రబాబు వెళ్ళ్తున్నప్పుడు ఒక ముఖ్యమంత్రి వెళ్తున్నట్టుగా జనానికి అన్పిస్తున్నది. తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కూడా ఆయన ముఖ్యమంత్రే అన్నంత హడావుడిని భద్రతా సిబ్బంది చేస్తున్నారు. అంతే కాదు ఆయనను కలవడం అంత తేలిక కాదు.
పార్టీకి చెందని ఇతరులు ఆయనను కలవాలంటే క నీసం రెండు మూడు రోజుల ముందు అపాయింట్‌మెంట్ తీసుకోవాలి. ఆయన చుట్టూ ఇప్పటికీ అదే దేవేందర్‌గౌడ్, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, నాగం జనార్ధనరెడ్డి వంటి వారి కోటరీ కొనసగుతోంది.
రాజశేఖరరెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై అప్పుడే ప్రజలకు మొహం మొత్తిందని వీరు రోజూ చంద్రబాబు ముఖస్తుతి కోసం చెబుతున్నారు. ఏ విషయాన్నైనా సిద్ధాంతీకరించినట్టు మాట్లాడితే నమ్మేయడం చంద్రబాబు నాయుడుకున్న పెద్ద బలహీనత. ఆ బలహీనతను ఆయన కోటరీ ఇప్పటికీ సొమ్ము చేసుకుంటున్నది.
రాజశేఖరరెడ్డి ఇందుకు పూర్తి భిన్నం. పొగడ్తలంటే ఆయనకూ ఇష్టమే కానీ పొగ డ్త ఎక్కువైతే ఆయన సిగ్గుపడిపోతారు. తాను సామాన్య నాయకుడినన్న సత్యాన్ని గ్రహించి నడుచుకోవడం ఆయన ప్లస్ పాయింట్.
ఆయనకు నిశ్చితాభిప్రాయాలుంటాయి. ఎన్నికల్లో కట్టకట్టుకుని చంద్రబాబు నాయుడికి మద్దతు ఇచ్చిన సినిమా పరిశ్రమలను, నటులను ఆయన దూరంగా ఉంచుతున్నారు. మహేష్‌బాబుపై కేసులు ఇందుకు చిన్న ఉదాహరణ. గతంలో సినిమా వాళ్ళ మీద ఇటువంటి కేసులను చంద్రబాబు నాయుడు పెట్టనిచ్చేవారు కాదు.
చంద్రబాబు యూరప్ యాత్ర
తెలంగాణకు ఎర్ర జెండా
ఆరుదేశాల్లో ఎన్నారై శాఖ ఆఫీసులు
మొగిలిచెర్లలో వార్
సిద్దిపేట సీను
ఆంధ్రపై జయ చిందులు
మణికుమారికి సవతిపోరు!
కొడుకు రాజకీయంపై వైయస్
సైకిల్ దిగిన బాబూఖాన్
సమైక్య నినాదం ఊపు
తిరగబడిన రాత
బాబుపై బాలయ్య అసంతృప్తి!
సచిన్ టెండూల్కర్ - ఇంటర్వ్యూ హోంపేజి












Click it and Unblock the Notifications
