• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పాపం! బాజీ బజాజ్‌!

By Staff
|

హోంపేజి టాక్‌ ఆఫ్‌ టుడే;/SPAN> జనరల్‌ Monday, December 20, 2004

హైదరాబాద్‌:ఒక సెక్స్‌ క్లిప్పింగ్‌ వెబ్‌సైట్‌లోఉందన్న కారణంగా ప్రపంచ ప్రఖ్యాతఆక్షన్‌ సైట్‌ బాజీ డాట్‌కాం సిఇవో అవినాష్‌ బజాజ్‌ను అరెస్టుచేయడం పట్ల ఐటివర్గాలలో ఆందోళన, ఆగ్రహం వ్యక్తమవుతున్నాయి. ఎవరైనాతమ వస్తువుల గురించి పోస్ట్‌ చేసుకునే వీలున్న ఆక్షన్‌ సైట్‌లో ఏదోవచ్చిందన్న కారణంగా అవినాష్‌ బజాజ్‌ నుభారతీయ ఇన్ఫర్మేషన్‌ చట్టంలోని 67 వసెక్షన్‌ కింద అరెస్టు చేశారు.అమెరికన్‌ పౌరసత్వం గల అవినాష్‌ బజాజ్‌బాజీడాట్‌కాం ఇండియన్‌ ఆపరేషన్స్‌సిఇవోగా ఉన్నారు. బజాజ్‌ కేసును ప్రవాస భారతీయులుఆసక్తిగా గమనిస్తున్నారు.

ఇ-బేడాట్‌కాం గ్రూపునకు చెందిన బాజీడాట్‌కాం భారతీయ ఐటీ చట్టానికి, ఇతర దేశాలచట్టాలకు అనుగుణంగా తనవ్యాపార నిబంధనలను రూపొందించుకుంది. ఇంత పెద్ద ఆక్షన్‌సైట్‌ అంత నిర్లక్ష్యంగా, తెలివితక్కువగా వ్యవహరిస్తుందని ఎవరూఅనుకోరు. బాజీ వంటి ఆక్షన్‌ సైట్లుపోర్నోగ్రఫీని అంగీకరించవని, ఈ ఆక్షన్‌లోవస్తువులను అమ్ముకోవాలనుకుంటున్నవారు తమ వస్తువుల్లో పోర్నో ఎలిమెంట్‌లేదని ఎల్రక్టానిక్‌ సైన్‌ యాన్‌ అగ్రిమెంట్‌ను అంగీకరించవలసిఉంటుంది. ప్రతిరోజూ కొన్ని వేల, లక్షల మంది పోస్ట్‌చేసుకునే బాజీ వంటి సైట్‌లోకంటెంట్‌ను ఎప్పటికప్పుడు సమీక్షించేయంత్రాంగం ఉండకపోదు.అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్టువ్యవహరించే భారతీయ పోలీసులకుఇటువంటి కేసులు కోతికి కొబ్బరికాయ దొరికినట్టుకన్పిస్తాయి. ఆ సెక్స్‌ క్లిప్‌నుఒక ఐఐటి విద్యార్ధి ఎప్పుడు బాజీడాట్‌కాంలో పోస్ట్‌ చేశాడు?బాజీ సైట్‌ ఆ క్లిప్‌ను ఎప్పుడుతొలగించింది అన్న వివరాలను పోలీసులువెల్లడించవలసి ఉంది. ఢి ల్లీ పాలికా బజార్‌లోఈ క్లిప్‌ విసిడిలను నూట ఇరవై రూపాయలకువిచ్చలవిడిగా అమ్ముతున్నట్టుఎన్‌డిటివీ చూపించింది. ఆ షాపు యజమానులపై ఢిలీపోలీసులు చర్యలు తీసుకోలేదు. భారతదేశంలోపోర్టల్స్‌, వెబ్‌సైట్లపై మొదటి నుంచిరాజకీయ నాయకులకు, అధికారులకువ్యతిరేక భావం ఉంది. 2000సంవత్సరంలో తెహల్కా డాట్‌కాంరక్షణ శాఖ అవినీతిని, బిజెపి అధ్యక్షుడిలంచ గొండి తనాన్ని బట్టబయలు చేసినప్పటినుండి అంతటి ట్రాన్స్‌పరెన్సీని మన అవినీతివ్యవస్ధ జీర్ణించుకోలేకపోతోంది.ప్రింట్‌ మీడియా కూడా పోర్టల్‌ మీడియామీద ద్వేషం పెంచుకున్నట్టు ఐదేళ్ళుగాడాట్‌కాం పరిశ్రమ మీద అవి ప్రచురిస్తున్నకథనాలను బట్టి చూస్తే అర్ధమవుతుంది.

మన భారతీయ సంప్రదాయం ప్రకారంశృంగారం అనేది అతి గోప్యంగా ఉండాలి.మన సంప్రదాయాలను మనంగౌరవించుకోవాలి. ఇండియన్‌ సైబర్‌మీడియా ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూనే ఉంది. ఇంకా అప్రమత్తంగాఉండాల్సిన అవసరం ఉంది. జీవితంలోఅంచెలంచెలుగా విజయాలు సాధిస్తూ ఇప్పుడుఉన్నత స్ధాయిలో ఉన్న అవినాష్‌ బజాజ్‌నుఇప్పుడు తిహార్‌ జైలులో ఉన్నారు. నేరంరుజువైతే ఆయన ఏడేళ్ళ పాటు జైలు శిక్షఅనుభవించవలసి ఉంటుంది. అవినాష్‌ బజాజ్‌అరెస్టును నాస్కామ్‌ ఖండించింది.

ఈ కేసుకుసంబంధించిన మరిన్ని ఆసక్తికర అంశాలుఇండియాఇన్ఫోడాట్‌కాం సిఇవో బిజి మహేష్‌కాలమ్‌ చదవండి.

తల్లీకొడుకులఅపూర్వ గాధ

శత్రువుశత్రువు మిత్రుడవుతాడా?

ఆచెట్టు వేళ్ళు పుట్టిన గడ్డలోనే

అన్నీ మంచిశకునములే

చిన్నస్వామిస్వర్ణాభిషేకం

త్వరలోదాసరి ఛానల్‌!

మాటలమరాఠీ!

ప్రెస్‌అకాడమీ చైర్మన్‌గా అమర్‌

కంచిపైఇంటిలిజెన్స్‌ కన్ను

బాలకృష్ణపైచార్జిషీట్‌

చిరుకథలోపెను మార్పులు!

సినిమా వాళ్ళెక్కడ? మీడియా ఎక్కడ?

జయేంద్ర విశేషాలు
ఒక టిడిపి నేత విజయ గాధ
రాంగోపాల్‌వర్మ నాచ్‌ వివాదం
హెల్మెట్‌లో దాగిన అవినీతి పురుగు
మన్మోహన్‌హంగ్‌!
రాజేంద్రప్రసాద్‌కు రఘుపతి వెంకయ్య అవార్డు
షిండే సక్సెస్‌ స్టోరీ
ఆది మానవుడికీ హనుమంతుడికీ లింకు!
ఉదయభాను విషాద గాధ
ఉత్తమ కంపెనీల్లో సత్యం
హిందీలో వీరప్పన్‌ సినిమా

హోంపేజి

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X