సిద్దిపేట సీను

హోంపేజి టాక్‌ ఆఫ్‌ టుడే జనరల్‌ Monday, July 26 2004

హైదరాబాద్‌: ఇప్పుడు రాజకీయవర్గాల కళ్ళన్నీ సిద్ధిపేట నియోజకవర్గం మీద ఉన్నాయి. తెలంగాణరాష్ట్ర సమితి అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావురాజీనామాతో ఈ స్ధానం ఖాళీ అయింది. ఎమ్మెల్యేగా గెల్వకుండా మంత్రిఅయిపోయిన కెసిఆర్‌ మేనల్లుడు హరీష్‌రావు ఇక్కడి నుంచిపోటీ చేస్తున్నారు. టిఆర్‌ఎస్‌కు కంచుకోట వంటి ఈనియోజకవర్గంలో హరీష్‌రావు ఎన్నిక నల్లేరు మీద నడకఅవుతుంది.

ఈ నియోజకవర్గంలో గెలవకపోయినాసాధ్యమైనన్ని ఎక్కువ ఓట్లు తెచ్చుకుని గౌరవంగాబయటపడాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడువ్యూహరచన చేస్తున్నారు. తెలంగాణ జనతా పార్టీ తరఫునఅభ్యర్ధిని నిలబెట్టి అతనికి ఆర్ధిక సాయం చేసి తెలంగాణ వాదుల ఓట్లుచీలిపోయేలా చేయాలన్నది ఒక వ్యూహం. రంగారెడ్డి జిల్లా పరిషత్‌చైర్మన్‌ (టిడిపి) కాసాని జానేశ్వర్‌ ముదిరాజ్‌ను సిద్ధిపేటబరిలో దించాలని చంద్రబాబు నాయుడు అనుకుంటున్నారు.

స్ధానికంగాబలమైన టిడిపి అభ్యర్ధి లేకపోవడం వల్లఆర్ధిక స్ధోమత, కులబలం ఉన్న కాసానినిరంగంలోకి దించితే హరీష్‌కు గట్టి పోటీ ఇస్తారని చంద్రబాబుఆలోచన. సిద్ధిపేటలో పోటీ చేసి బలిపశువు కావద్దని కాసానికిఆయన శ్రేయోభిలాషులు సలహా ఇచ్చారు. సిద్ధిపేట టిడిపి అభ్యర్ధికి అన్నిరకాల సాయం అందిస్తాను కానీ తాను స్వయంగా అక్కడి నుంచి పోటీచేసే ప్రసక్తి లేదని చంద్రబాబు నాయుడికి కాసాని స్పష్టంచేసినట్టు తెలుస్తోంది. సిద్ధిపేటలో అధిక సంఖ్యలో ఉన్న ముదిరాజ్‌కులం ఓట్లు తెలుగుదేశం పార్టీకి పడేలా చేయగలనని ఆయనచంద్రబాబు నాయుడికి హామీ ఇచ్చారు.

ఇలా ఉండగా కాసానిని కాంగ్రెస్‌లోకిలాగడానికి ఒక వైపు ప్రయత్నాలు జరుగుతున్నాయి. భూమిలావాదేవీల్లో ఉండే కాసాని అధికార కాంగ్రెస్‌లో చేరడం వల్లఉపయోగాలు ఉంటాయన్న ఊగిసలాటలో ఉన్నట్టు తెలిసింది. అయితేఇటీవలే జెడ్పీ అవిశ్వాస తీర్మానంలో నెగ్గిన ఆయన కాంగ్రెస్‌కుఫిరాయించడం అంత తేలిక కాదు.

Recent Stories
ఆంధ్రపైజయ చిందులు
మణికుమారికిసవతిపోరు!
కొడుకు రాజకీయంపై వైయస్‌
సైకిల్‌దిగిన బాబూఖాన్‌
సమైక్యనినాదం ఊపు
తిరగబడినరాత
బాబుపైబాలయ్య అసంతృప్తి!
సచిన్‌టెండూల్కర్‌ - ఇంటర్వ్యూ హోంపేజి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+