వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తారల ప్రభావం నిల్‌!

By Staff
|
Google Oneindia TeluguNews

హోంపేజి టాక్‌ ఆఫ్‌ టుడే రాజకీయాలు Friday, April 23 2004

Ravaliవివిధ పార్టీల తరఫున సినిమా తారలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నప్పటికీ, ఓటర్ల నుంచి పెద్దగా స్పందన రావడం లేదు. మన రాష్ట్రంలో పెద్ద ఎత్తున తారలు తెలుగుదేశం తరఫున ప్రచారం చేస్తున్నారు. రోజాలాంటి వారు కొద్దిమంది బరిలోనూ దిగారు. రోజా నగరి నియోజకవర్గంలో కాంగ్రెస్‌ అభ్యర్థి నుంచి పెద్ద ఎత్తున పోటీని ఎదుర్కొంటున్నారు. తమిళులు అధికంగా ఉండే ఈ నియోజకవర్గంలో ఆమెను చూసేందుకు ఓటర్లు ఆసక్తిగా వస్తోన్న ఆమె చేసే ప్రసంగాలు, హామీలు, మాటల్లో పస ఉండడం లేదు.

ఎన్డీఏ కూటమి తరఫున రాష్ట్రంలో రవళి, సుమన్‌, రంభ, శరత్‌బాబు తదితరులు ప్రచారం చేస్తున్నారు. టీవీ తారలు అనేకం కోస్తా నియోజకవర్గాల్లో ప్రచారం సాగిస్తున్నారు. తారల ప్రసంగాల కన్నా నిజమైన రాజకీయ నాయకుల ప్రసంగాలకే అధికంగా స్పందన వస్తోంది.

Rojaతెలుగుదేశం పార్టీలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధాన ఆకర్షణ కాగా, సీనియర్‌ మంత్రులు, ఎమ్మేల్యేలు చేస్తోన్న ప్రచారం ఫలితాలను ఇస్తోండగా, రవళి వంటి తారలకు జనాలు కనీసం చప్పట్లు కూడా కొట్టడం లేదు. రవళి తిరుపతిలో చేసిన ప్రచార పర్యటన పేలవంగా ముగిసింది. మాట్లాడే తీరు తెలియకపోవడం, ఇక్కడ టేక్‌లు తీసుకునే అవకాశం లేకపోవడంతో తారలు సరిగా డైలాగ్‌లు (అనగా ప్రసంగాలు) చెప్పలేకపోతున్నారు. విజయశాంతి మాత్రం కాస్తా పుంజుకున్నారు. "మిగతా తారలతో నన్ను పోల్చడం సబబు కాదు. నా స్టైల్‌, స్టేచర్‌ వేరు అని విజయశాంతి తారల ప్రభావం పెద్దగా లేకపోవడంపై స్పందించారు.

కాంగ్రెస్‌ తరఫున దాసరి నారయణరావు ప్రచారం చేస్తున్నారు. ముందుగా అలక వహించి, అనంతరం ఆయన ప్రచారం సాగిస్తున్నారు. దాసరి సహజంగా మంచి వక్త కాబట్టి ఆయన ప్రసంగాల్లో కాస్తా పదును ఉంది. ఐతే, ఆయన ప్రభావం కూడా పెద్దగా లేదు. కాంగ్రెస్‌కు ఇప్పటికీ అతిపెద్ద ప్రచారకర్త వైఎస్‌నే.

సినిమా గ్లామర్‌ అత్యంత ప్రభావం చూపిన హీరో తెలుగునాట ఎన్టీఆర్‌ ఒక్కరే. మరణించిన అనంతరం కూడా ఆయన ఛరిష్మా తగ్గలేదు. ఆయన కుమార్తె ఫురందరేశ్వరి ఎన్టీఆర్‌ పెట్టుకొని ప్రచారం సాగిస్తున్నారు. ఆమెకు రోడ్‌షోలకు విపరీతమైన స్పందన కన్పిస్తోంది.

మరోవైపు, తెలుగుదేశం తారలకు ప్రచారానికిగాను పెద్ద మొత్తంలో డబ్బు ముట్టచెప్పిందనే వార్తలు వినవస్తున్నాయి. అందులో నిజానిజాలెలా ఉన్నా, సినిమా తారలు మాత్రం పార్టీ సిద్దాంతాలకు ఆకర్షణకు గురై వచ్చారంటే చెవిలో పువ్వు పెట్టుకోవడమే అన్న మాటా వాస్తవమే.

  • కెసిఆరే పెద్ద ఫ్యాక్టర్‌
  • పార్టీ టికెట్ల మార్కెటింగు
  • చిరంజీవిరహస్య ఎజెండా?

  • అస్పష్ట రాజకీయ చిత్రం
  • హోంపేజి
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X