బెంగాల్ పై తృణమూల్ మాజీ నేత తాజా అంచనాలు
ఇంకొన్ని గంటల్లో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో పాటు ఆమె పార్టీ తృణమూల్ కాంగ్రెస్ భవిష్యత్తును ఈ ఫలితాలు నిర్ణయించనున్నాయి. ఎన్నికలకు ముందు వచ్చిన ఎగ్జిట్ పోల్స్ మమతకు అనుకూలంగా లేనప్పటికీ, నాలుగోసారి విజయం సాధిస్తానని ఆమె ధీమా వ్యక్తం చేస్తున్నారు. తృణమూల్ కాంగ్రెస్ ను అధికార పీఠం నుంచి దించడానికి గట్టి ప్రయత్నాలే చేసింది.
ఈ నేపథ్యంలో ఆమ్ జనతా ఉన్నయన్ పార్టీ (AJUP) కీలక వ్యాఖ్యలు చేసింది. హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందని అంచనా వేసింది. పోలింగ్ సరళిని బట్టి చూస్తే హంగ్ ఖాయమని పేర్కొంది. ఏ పార్టీకీ సంపూర్ణ మెజారిటీ లభించబోదని ఏజేయూపీ వ్యవస్థాపకుడు, రేజినగర్ నియోజకవర్గ అభ్యర్థి హుమాయున్ కబీర్ ధీమా వ్యక్తం చేశారు. ఫలితాలు వెలువడిన అనంతరం ప్రభుత్వ ఏర్పాటులో తమ పార్టీ కీలకంగా వ్యవహరిస్తుందని స్పష్టం చేశారు.

పోటీలో తమ స్థానం ఏదైనప్పటికీ.. ఏజేయూపీ ఓ ముఖ్య శక్తిగా నిలుస్తుందని, కింగ్‌మేకర్ పాత్ర పోషిస్తుందని కబీర్ ధీమా వ్యక్తం చేశారు. తృణమూల్ కాంగ్రెస్ లేదా బీజేపీ మొదటి లేదా రెండవ స్థానంలో ఉండవచ్చని, తాము మూడో నిలిచి ప్రభుత్వ ఏర్పాటులో ఈ రెండు పార్టీలకూ సవాల్ విసురుతామని అన్నారు. తమ సహకారం లేదని ప్రభుత్వం ఏర్పాటు కాబోదని తేల్చి చెప్పారు. తమ పార్టీ అభ్యర్థులలో మెజారిటీ అభ్యర్థులు గెలుస్తారని విశ్వసిస్తున్నట్లు కబీర్ చెప్పారు.
గెలిచిన అభ్యర్థులందరినీ బెర్హంపూర్ లోని ఓ హోటల్‌లో తీసుకెళ్తానని, దీనికి అవసరమైన అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశానని అన్నారాయన. హుమాయున్ కబీర్.. సుదీర్ఘకాలం పాటు తృణమూల్ కాంగ్రెస్ లో పని చేశారు. గత ఏడాది డిసెంబర్ లో పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. ముర్షిదాబాద్‌లో బాబ్రీ మసీదును నిర్మిస్తానని ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యల ఆధారంగా ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది తృణమూల్. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలను పార్టీ వ్యతిరేక కార్యకలాపాలుగా పరిగణిస్తూ ఈ చర్యలు తీసుకుంది.












Click it and Unblock the Notifications