వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నెలకు రూపాయి జీతం రహస్యం

By Staff
|
Google Oneindia TeluguNews

హోంపేజి టాక్‌ ఆఫ్‌ టుడే కాంగ్రెస్‌ Thursday, Aug 12 2004

Y S Rajashaker Reddyహౖౖెదరాబాద్‌: ముఖ్యమంత్రిరాజశేఖరరెడ్డి రూపాయి జీతం మాత్రమే తీసుకుంటాననిప్రకటించిన సంగతి తెలిసిందే. కొన్ని విషయాల్లో ఆయన దివంగతఎన్టీఆర్‌ను అనుకరిస్తున్నారు. అందులో రూపాయి జీతం ఒకటి.ఎన్నికల ముందు చేసిన యాత్రలలో రోడ్డు పక్కన స్నానంచేయడం, భోజనం చేయడం ఎన్టీఆర్‌ నుంచి తీసుకున్నవే.

రాష్ట్ర ముఖ్యమంత్రికి నెలకునలభైవేల రూపాయల వరకు జీతభత్యాలు లభిస్తాయి.అంతమొత్తం వదులుకుని ఆయన ప్రజాసేవ చేయాలనుకోవడంనిజంగా త్యాగమే. జీవన వ్యయం విపరీతంగా పెరిగిన రోజుల్లో నెలకురూపాయి జీతంతో జీవితం నెట్టుకు రావడం నిజంగా కష్టమే.నిజాయితీకి మారుపేరైన దివంగత ప్రధాని లాల్‌ బహదూర్‌ శాస్త్రికూడా రూపాయి జీతమనే సాహస నిర్ణయం తీసుకోలేకపోయారు.ఈ విషయాన్ని పైపైన చూస్తే శాస్త్రిగారి కంటే ఎన్టీఆర్‌, వైఎస్సార్‌త్యాగజీవులు. లోపలికి వెళ్ళి చూస్తే విషయం మరోలా ఉంటుంది.

నెలకు రూపాయి జీతంతోనేవిలాసవంతంగా బతకవచ్చని స్వర్గీయ ఎన్టీఆర్‌ నిరూపించారు.హీరోగా ఆయన అప్పటికే కోట్లు గడించారు కాబట్టి ఆయన జీతంతోనిమిత్తం లేకుండా విలాసంగా బతికారనుకుందాం.రాజశేఖరరెడ్డి డాక్టరుగా ప్రాక్టీసు చేసింది లేదు,యాక్టరుగా నటించింది లేదు. ఆయన పేరు మీద వ్యాపారాలుఏమీలేవు. కొంత పొలం ఉంది. ముఖ్యమంత్రి రూపాయి జీతమే తీసుకోవడం పెద్ద జిమ్మిక్కనివిమర్శించే వారు లేకపోలేదు. వాళ్ళు నెలకు నలభై వేలు త్యాగంచేసినంత మాత్రాన రాష్ట్ర ఖజానాకు ఒరిగేదేమీ ఉండదు.ఎందుకంటే ముఖ్యమంత్రి వాహనాలకు, భద్రతకు, ఇతరఅత్యాధునిక సదుపాయాలకు ఎంత డబ్బు ఖర్చవుతుందోశ్వేతపత్రం ప్రకటిస్తే గుండె ఆగినంత పనవుతుంది. కాబట్టిఇప్పుడు మనకు కావలసింది ఇటువంటి జిమ్మిక్కులు కాదుదీర్ఘకాలంలో ప్రజాబాహుళ్యానికి మేలు చేసే నిర్మాణాత్మక కృషికావాలి.

  • డిఎస్‌ ఎదురుచూపు దేనికి సంకేతం?
  • వైఎస్‌ వారసత్వం
  • ఇద్దరూఇద్దరే!
  • సీమటపాకాయ

  • మన్మోహనం

  • మీనాఎందుకు?
  • రాష్ట్రం నుంచి మూడో ప్రధాని
  • గులాబీపోరు!
  • నెలరాజు వైఎస్‌
  • మారువేషంలోవెళ్ళొచ్చు కదా?
  • ఎవరు గొప్ప?
  • ఆచితూచి అడుగులు
  • సవాళ్ళు ఎన్నో...
  • హోంపేజి
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X