కాంగ్రెస్ హవాకు బ్రేక్
హోంపేజి
టాక్ ఆఫ్ టుడే
కాంగ్రెస్ Friday, May 14 2004
హైదరాబాద్:రాష్ట్ర సాంస్కృతిక మండలి అధ్యక్షపదవికి డాక్టర్‌సి.నారాయణ రెడ్డి రాజీనామా చేశారు. చంద్రబాబు నాయుడుహయాంలో ముఖ్యమైన పదవులు పొందిన ఆయన సన్నిహితులుఒకొక్కరు రాజీనామాలు చేస్తున్నారు. ఎల్రక్టానిక్ మీడియాసలహాదారుగా కేబినెట్ హోదా అనుభవించిన సినిమా దర్శకుడురాఘవేంద్రరావు ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనేరాజీనామా చేశారు.
నిమ్స్ డైరెక్టర్ కాకర్ల సుబ్బారావు,రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు అక్కినేని నాగేశ్వరరావు కూడారాజీనామాలు సమర్పించాలనుకుంటున్నట్టు తెలిసింది. నామినేటెడ్‌పోస్టుల్లో ఉన్న మరికొందరు, అలేక్ పదంసీ వంటి కన్సల్టెంట్లకుచెల్లుచీటీ ఇవ్వాలని రాజశేఖరరెడ్డి ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రప్రభుత్వ ఐటి సలహాదారు హనుమాన్ చౌదరి కూడా ఆ పోస్టులోకొనసాగే అవకాశం లేదు.
అవినీతిఆరోపణలున్న పాతిక మంది ఐఎఎస్, ఐపిఎస్, ఐఎఫ్‌ఎస్ అధికారులపైచంద్రబాబు నాయుడు ఎందుకు విచారణకు అనుమతించడంలేదని గతంలో రాజశేఖరరెడ్డి ప్రతిపక్ష నాయకుడి హోదాలోఅసెంబ్లీలో నిలదీశారు. ఈ విషయాన్ని నేడు విలేకరులు గుర్తుచేయగా ఆ అధికారులపై విచారణకు ఆదేశిస్తాననిరాజశేఖరరెడ్డి అన్నారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంచేసిన దుబారా ఖర్చును ఆదా చేయాలన్న తాపత్రయంరాజశేఖరరెడ్డిలో కన్పిస్తోంది. హోంపేజి












Click it and Unblock the Notifications