ఎవరీ సిసి రెడ్డి?
హైదరాబాద్: గత ఎన్నికల సమయంలోకాంగ్రెస్ పార్టీ ప్రచార బాధ్యతలు స్వీకరించి నిత్యం టీవీలలో కన్పించినసిసిరెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం విదేశీపెట్టుబడుల సలహాదారుగానియమించింది. తన విసు కన్సల్టెన్సీ ద్వారా వేలాది మందివిద్యార్ధులకు విదేశాల్లో విద్యావకాశాలు చూపిన సిసి రెడ్డిప్రవాసాంధ్రులకు చిరపరిచితులు.
ముఖ్యమంత్రి వైఎస్‌రాజశేఖరరెడ్డికి సమీప బంధువైన సిసి రెడ్డి ఎన్నికలముందు కాంగ్రెస్ పార్టీలో లాంఛనంగా చేరారు. కడప జిల్లాలోఒక రైతు కుటుంబంలో పుట్టిన చవ్వా చంద్రశేఖరరెడ్డిన్యాయవాదిగా జీవితం ప్రారంభించారు. కొంతకాలం అమెరికాలోషేరెక్స్ ఇంటర్నేషనల్, జెస్టర్ ఇంపోర్ట్స్ వంటి సంస్ధలకుసిఇవోగా పనిచేశారు.
ఆ తర్వాత భారతదేశం తిరిగి వచ్చివిసు కన్సల్టెన్సీ సంస్ధను స్ధాపించారు. అనతి కాలంలోనే దీనిశాఖలను అమెరికా, బ్రిటన్, ఆ్రస్టేలియా,కెనడా, న్యూజిలాండ్,ఉగాండా, నేపాల్‌లకు విస్తరింపజేశారు. త్వరలో ప్రపంచంలోనిఅన్నిదేశాల్లో విసు శాఖలు పెట్టాలనుకుంటున్న తరుణంలో సిసిరెడ్డిరాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నియమితులయ్యారు. విదేశీపెట్టుబడులనుఆకర్షించడంలో ఆయనకు వినూత్న ఆలోచనలు ఉన్నట్టు చెబుతారు.
ఇటీవలికథనాలు
- అక్రమాల ల్యాండ్‌మార్క్
- రియల్(ఎస్టేట్) రిపోర్ట్
- వెలుగు వెనుక చీకటి
- ఈ సినిమా పేరు ఎత్తుకు పైఎత్తు
- చుట్టాలు-చట్టాలు
- ఈయన సినిమా పోలీసు కాదు
- ప్రత్యూష కేసు మరో మలుపు
- ప్రజల దేవుడు
- విశ్లేషణ..సగటు ఓటరు విజయం
- రేపటి సంగతి
- ఎక్కడైనా హీరోలు కానీ...
- బాబుచేయనిది, కృష్ణ చేసింది...
- వ్యతిరేక గాలి
- ఎక్కడైనా హీరోలు కానీ...
- బాబుచేయనిది, కృష్ణ చేసింది...
- చంద్రబాబుతురుపుముక్క
- ఎన్టీఆర్ గుర్తున్నాడా?
- సైకిల్‌కుఅసమ్మతి బ్రేక్‌లు
- చిరంజీవిరహస్య ఎజెండా?
- అస్పష్ట రాజకీయ చిత్రం












Click it and Unblock the Notifications