హ్యాంగోవర్
హౖెెదరాబాద్:అధికార కాంగ్రెస్ పార్టీకి ఆరు నెలలుగడిచినా గెలుపు తగ్గలేదు. మరోవైపు ప్రతిపక్షతెలుగుదేశం పార్టీకి పవర్‌పోలేదు. ఒక్కసారి టిడిపిప్రధాన కార్యాలయానికి వెళ్ళి చూస్తేచంద్రబాబు నాయుడు ఇప్పటికీముఖ్యమంత్రే అన్న రీతిలో హంగామాకన్పిస్తుంది. మాజీ ఎమ్మెల్యేలకు ఆయననుకలవడం అంత తేలిక కాదు. అంతేకాదు, తెలుగుదేశం పార్టీ ఇప్పుడుషాడో కేబినెట్‌ను ఏర్పాటు చేసుకుంది.తాను ఇంకా ముఖ్యమంత్రినేనన్న ఫీల్‌కోసం ఆయన తనకుసన్నిహితులైన టిడిపి నాయకులకువివిధ శాఖలను కేటాయించారు. ఈ షాడోమంత్రులు ప్రతి రోజూ ఉదయం చంద్రబాబునాయుడికి ఆయా శాఖల పనితీరు మీదవిశ్లేషణ ఇవ్వవలసి ఉంటుంది.
చంద్రబాబునాయుడు షాడో కేబినెట్‌లో మాజీ ఐపిఎస్‌అధికారి, టిడిపి నాయకుడు రావులపాటిసీతారామారావు హోంమంత్రి!. కేంద్రమాజీ మంత్రి ఉమ్మారెడ్డివెంకటేశ్వర్లు వ్యవసాయమంత్రి. ఆయనకు అడిషనల్ చార్జిగామునిసిపల్ శాఖను కూడా కేటాయించారు.జెఆర్ పుష్పరాజ్ సాంఘిక సంక్షేమశాఖను చూస్తున్నారు. ఈ షాడో మంత్రులుఆయా శాఖల పనితీరు మీద ప్రతిరోజూ చంద్రబాబునాయుడికి ఫీడ్‌బ్యాక్ ఇస్తారు. దానిఆధారంగా చంద్రబాబు కాంగ్రెస్‌ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తారు.
ఈమంత్రులకు మాజీ జర్నలిస్టులు, ఇతరరిసోర్స్ పర్సన్స్ జీవోలు, పేపర్ క్లిప్స్,టీవీ క్లిప్స్, డేటా అందజేస్తారు. వీరికి పార్టీప్రధాన కార్యాలయంలోని లైబ్రరీ,ఇంటర్నెట్ సదుపాయాలు అందుబాటులో ఉంటాయి.ఎవరి పిచ్చి వారికి ఆనందం అనుకోవాల్సినపనిలేదు. ప్రజాస్వామ్యం వర్ధిల్లడానికిఇటువంటివి అవసరమే.
ఇటీవలికథనాలు
- పరిటాల రాజకీయ వైరాగ్యం
- మా తెలుగు బాబుకు చాడీల దండ!
- ఇక బాబు రోడ్‌షోలు
- టిడిపి గుండెల్లో ఏలేరురైళ్ళు
- చంద్రబాబుతురుపుముక్క
- ఎన్టీఆర్ గుర్తున్నాడా?
- సైకిల్‌కుఅసమ్మతి బ్రేక్‌లు
- చిరంజీవిరహస్య ఎజెండా?
- అస్పష్ట రాజకీయ చిత్రం












Click it and Unblock the Notifications
