• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

బరిలో ధర్మపురి!

By Staff
|
హోంపేజి టాక్‌ ఆఫ్‌ టుడే కాంగ్రెస్‌ Wednesday, May 05 2004

హైదరాబాద్‌: రాష్ట్రంలో కాంగ్రెస్‌గెలిస్తే ముఖ్యమంత్రి ఎవరన్న ప్రశ్న రోజురోజుకూసంక్లిష్టమవుతోంది. తాను ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్నట్టుపిసిసి అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌ బుధవారం విలేకరులసమావేశంలో చెప్పకనే చెప్పారు. ఆయన పరోక్షంగా వైఎస్‌ రాజశేఖరరెడ్డిమీద అనేక విమర్శలు చేశారు. తాను పిసిసి అధ్యక్షుడిగాఉండగా జరిగిన ఎన్నికలు కాబట్టి నిబంధనల ప్రకారం తనకే ఈపదవి దక్కాలన్న భావం ఆయన మాటల్లో వ్యక్తమయింది.

మొదట్లో వైఎస్‌ మనిషిగా ఉన్న శ్రీనివాస్‌పిసిసి అధ్యక్షుడయ్యాక స్వతంత్రంగా పనిచేసుకోడానికిప్రయత్నించారు. అభ్యర్ధుల ఎంపిక విషయంలో కూడా ఆయనకురాజశేఖరరెడ్డికి అనేకసార్లు గొడవలు జరిగాయి. గతంలోముగ్గురు కాంగ్రెస్‌ ముఖ్యమంత్రుల వద్ద విధేయంగాపనిచేసిన శ్రీనివాస్‌ వైఎస్‌ పిసిసి అధ్యక్షుడుగా ఉన్నప్పుడుఆయన మనిషిగా మసలుకున్నారు. అయితే పిసిసిఅధ్యక్షుడయ్యాక ఆయన వైఎస్‌ను లైట్‌గా తీసుకున్నారు.పరిస్ధితి తన చేయిదాటిపోతోందని అర్ధమయ్యాకనే వైఎస్‌పాదయాత్రలు ఆ తర్వాత జైత్రయాత్రలు మొదలుపెట్టారు.ఆయన యాత్రలను మీడియా బాగా కవర్‌ చేయడంతోక్రమంగా ఆయన సభలకు పెద్ద సంఖ్యలో జనం హాజరుకాసాగారు.

ఎవరు యాత్రలు చేసినా చేయకపోయినాకాంగ్రె స్‌ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చితీరుతుందని ఆ పార్టీరాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి గులాం నబీ ఆజాద్‌ చాలాకాలం క్రితమేసోనియాగాంధీని నివేదిక సమర్పించినట్టు తెలుస్తోంది. గత అసెంబ్లీఎన్నికల సమయంలో పిసిసి అధ్యక్షుడిగా ఉన్న వైఎస్‌చేతులారా పార్టీని ఓటమి బాటలో నడిపారని అప్పటి ఇంచార్జులు ఇచ్చిననివేదికలు కూడా ఎఐసిసిలో పదిలంగా ఉన్నాయని డిఎస్‌ అనుచరులుచెప్పారు. వైఎస్‌ను ముఖ్యమంత్రిని చేస్తే పార్టీ ఏడాది తిరగకుండానేభ్రష్టు పడుతుందని డి. శ్రీనివాస్‌ రహస్య నివేదికను ఆజాద్‌కుసమర్పించినట్టు తెలుస్తోంది. రాజశేఖరరెడ్డి సిఎం అయితేతనను ఖాతరు చేయరన్న అభిప్రాయం ఆజాద్‌కు ఉంది. శ్రీనివాస్‌కు ఏహామీ లభించిందో కానీ ఆయన ఢిల్లీ నుంచి పరమానందంగాహైదరాబాద్‌ చేరుకున్నారు. ఢిల్లీలో ప్రచారం చేయమనిడిఎస్‌ను అధిష్టానవర్గం కోరింది కానీ వైఎస్‌ను కోరలేదనిశ్రీనివాస్‌ సన్నిహితులు అంటున్నారు. వైఎస్‌ పిలవని పేరంటానికి ఢిల్లీవెళ్ళారని వారు తెలిపారు.

డిశ్రీనివాస్‌ పత్రిఅకలు రాస్తున్నట్టుగా వైఎస్‌ మనిషిగాకొనసాగరని తొమ్మిది నెలల క్రితం దట్స్‌ తెలుగు డాట్‌ కాంప్రచురించిన ప్రత్యేక కథనం ఇక్కడ చదవండి.

వైఎస్‌కుసమాంతరం హోంపేజి

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X