వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్‌లో ఇది మామూలే!

By Staff
|
Google Oneindia TeluguNews

హోంపేజి టాక్‌ ఆఫ్‌ టుడే కాంగ్రెస్‌ Monday, May 24 2004

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీలో అసమ్మతిఅతి మామూలు విషయం. ఇప్పుడు రాష్ట్ర కాంగ్రెస్‌లో అది చిలికి చిలికిగాలివానగా మారే అవకాశముంది. సీనియర్‌ కాంగ్రెస్‌నాయకులు నేదురుమల్లి జనార్ధనరెడ్డి, జి.వెంకటస్వామిలకుకేంద్రమంత్రి పదవులు రాకుండా రాజశేఖరరెడ్డి వర్గంవ్యూహాత్మకంగా వ్యవహరించింది.

ఎమ్మెల్యేగా గెలిచిననేదురుమల్లి భార్య రాజ్యలక్ష్మికి రాష్ట్ర మంత్రి పదవి ఇవ్వడంద్వారా ఢిల్లీలో నేదురుమల్లికి అవకాశం లేకపోయింది. ఒకేకుటుంబంలోమి వారు కేంద్రంలో రాష్ట్రంలో మంత్రులుగాఉండరాదన్న రాజ్యాంగనిబంధన లేదు. కాంగ్రెస్‌నియమావళిలో కూడా ఈ విషయం లేదు. వెంకటస్వామి కుమారుడువినోద్‌కు రాష్ట్ర మంత్రి పదవి ఇచ్చి కేంద్రంలో వెంకటస్వామికిమొండి చెయ్యి చూపారు.

నేదురుమల్లి, వెంకటస్వామి వంటివారుకేంద్ర మంత్రులైతే వారు అధిష్టానవర్గానికిసన్నిహితంగా ఉంటారు కాబట్టి ఇక్కడ రాజశేఖరరెడ్డికిదీర్ఘకాలంలో ఇబ్బందులు వస్తాయని ఆయన వర్గం భావిస్తోంది.అందువల్ల రాజ్యలక్ష్మి, వినోద్‌లకు రాష్ట్ర మంత్రి పదవులివ్వడంద్వారా నేదురుమల్లి, వెంకటస్వామిలకు చెక్‌ పెట్టాలని వీరుపథకం వేశారు.

ప్రాధాన్యం లేని శాఖలు ఇచ్చారని పిసిసి అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌,పిసిసి మాజీ అధ్యక్షుడు ఎం.సత్యనారాయణ రావు, మంత్రిపదవి ఆశించి భంగపడిన పి.జనార్ధనరెడ్డి ఒకఫోర్సుగా ఏర్పడితే వీరి చుట్టూ మరికొందరు అసమ్మతిజీవులు చేరే అవకాశం ఉంది. అయితే అసమ్మతి వాదులనుప్రోత్సహించరాదని సోనియా గాంధీ స్ధూలంగా ఒక నిర్ణయానికివచ్చినందున రాజశేఖరరెడ్డికి ఇప్పట్లో ఎటువంటి ప్రమాదంఉండదు. మంత్రివర్గాన్ని విస్తరించిన తర్వాతరాజశేఖరరెడ్డికి మరిన్ని తలనొప్పులు ఉంటాయి.

రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకుల అంతర్గతతగాదాల వల్ల ప్రజా సమస్యల పట్ల ప్రభుత్వం ఫోకస్‌తగ్గిపోతుందేమోనన్న ఆందోళన కొందరు ఆలోచనాపరుల్లోఉంది. సుపరిపాలన అందించడానికి కాంగ్రెస్‌ నాయకులు అంతర్గతతగాదాలకు సెలవు చెప్పి ప్రజలు తమకు అప్పగించిన పవిత్రబాధ్యత మీద దృష్టి సారించవలసి ఉంది.

  • వైఎస్‌కు ముందు నుయ్యి వెనుక గొయ్యి
  • ఎవరు గొప్ప?
  • ఆచితూచి అడుగులు
  • సవాళ్ళు ఎన్నో...
హోంపేజి
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X