వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎస్‌ పిలోజయప్రద

By Staff
|
Google Oneindia TeluguNews

హోంపేజి టాక్‌ ఆఫ్‌ టుడే కాంగ్రెస్‌ Tuesday, July 06 2004

హైదరాబాద్‌:ఇప్పుడిప్పుడే వేళ్ళూనుకుంటున్న ప్రత్యేకరాయలసీమ ఉద్యమాన్ని మొగ్గలోనేతుంచివేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి.ప్రత్యేక తెలంగాణపై సోనియా గాంధీ హామీఇవ్వలేదని ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డిప్రకటించడం ఇందులో భాగమే. ఆరునెలల్లోతెలంగాణ రాష్ట్రం ఏర్పడుతోందని చంద్రశేఖరరావుప్రకటించడంతో రాయలసీమ వేర్పాటువాదుల్లో ఉత్సాహం పెరిగింది. తెలంగాణ కంటేవెనుకబడినరాయలసీమ కూడా ప్రత్యేకరాష్ట్రంగా ఏర్పడాలన్నది వీరి ఆకాంక్ష. రాయలసీమఐక్యవేదిక పేరిట కొందరు మేధావులు ప్రారంభించినఉద్యమం కర్నూలు మాజీ ఎమ్మెల్యే, పారిశ్రామికవేత్త టిజి వెంకటేష్‌ గొంతు కలపడంతోఒక రూపు దిద్దుకుంది.

తెలంగాణరాష్ట్రం ఏర్పాటు ప్రక్రియను వేగవంతంచేస్తే రాయలసీమ ఉద్యమం వూపందుకుంటుందనిరాజశేఖరరెడ్డి కాంగ్రె స్‌ పెద్దలకువివరించినట్టు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రంఏర్పాటును సాధ్యమైనంత ఆలస్యం చేయడానికేకాంగ్రె స్‌ అధిష్టానవర్గం ప్రయత్నించవచ్చు.

పిసిసిఅధ్యక్షుడు డి.శ్రీనివాస్‌ మంగళవారంవైఎస్‌ ప్రకటనకు భిన్నంగా మాట్లాడారు.తెలంగాణ విషయంలో ఎన్నికల ముందుకాంగ్రెస్‌ అధిష్టానవర్గం తన ద్వారానేహామీని తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులకుతెలియజేసిందని ఆయన అన్నారు. ఆ హామీకితమ హైకమాండ్‌ కట్టుబడి ఉంటుందన్నఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.తెలంగాణ రాష్ట్రానికి అడ్డుపడేందుకేరాజశేఖరరెడ్డి ప్రత్యేక రాయలసీమఉద్యమానికి పరోక్ష మద్దతు ఇస్తున్నారన్నవిమర్శలూ విన్పిస్తున్నాయి.

  • మన్మోహనం

  • మీనాఎందుకు?
  • రాష్ట్రం నుంచి మూడో ప్రధాని
  • గులాబీపోరు!
  • నెలరాజు వైఎస్‌
  • మారువేషంలోవెళ్ళొచ్చు కదా?
  • ఎవరు గొప్ప?
  • ఆచితూచి అడుగులు
  • సవాళ్ళు ఎన్నో...
  • హోంపేజి
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X