మిత్రబేరం
హోంపేజి
టాక్ ఆఫ్ టుడే
జనరల్ Monday, April 12 2004
భారత్-పాకిస్థాన్‌లమధ్య ఆసక్తికరంగా సాగుతోన్న టెస్ట్‌సిరీస్ ఆఖరి పోరాటం మంగళవారం రావల్పిండిలోప్రారంభం అవుతుంది. మదర్ ఆఫ్‌ఆల్ కాంటెస్ట్సగా పేరొందిన ఈ సిరీస్‌లోభార త్-పాక్‌లు చెరో టెస్ట్ గెలుచుకున్నాయి.వన్డే సిరీస్ భారత్ గెలుచుకోగా, టెస్ట్‌సిరీస్ కూడా గెలుచుకుంటామని మూడో టెస్ట్‌తోతిరిగి కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించినసౌరవ్ గంగూలీ ధీమా వ్యక్తం చేస్తున్నాడు.
ఆరంభశూరత్వం, ఆఖర్లో కోల్పోతోన్న పటుత్వంగాభారత్ జట్టు విమర్శలను ఎదుర్కొంటోంది. ఆఅపప్రథను ఈ సిరీస్‌లో తొలగించి చరిత్రనుసృష్టిస్తామని సోమవారం గంగూలీవిలేకరులతో అన్నాడు. ఈ టెస్ట్ గెలిస్తే, పాక్‌లోటెస్ట్ సిరీస్ గెలిచిన భారత్ జట్టు ఇదే అవుతుంది.ఇంతవరకు పాక్ గడ్డపై భారత్ ఏనాడూటెస్ట్ సిరీస్ గెలుచుకోలేదు.
మరోవైపు,పాక్ జట్టు కూడా తిరిగి ఫాంలోకి వచ్చింది. గట్టి పోటీఇచ్చేందుకు సన్నద్ధంగా ఉంది. వన్డేల్లోఓడినా, టెస్ట్ సిరీస్‌ను గెల్చుకుంటామని ఆ జట్టుకోచ్ మియాందాద్ అంటున్నాడు.
తమబౌలర్లు మరోసారి విజృంభించి భారత్ బలీయమైనబ్యాటింగ్ ఆర్డర్‌ను కుప్పకూల్చుతారనిఆయన ధీమాగా ఉన్నాడు. ఇరుపక్షాల విశ్వాసాలుఎలా ఉన్నా, ఈ ఆఖరి మ్యాచ్ మంచి ఆసక్తిని కలిగిస్తోంది.ఈ ఐదు రోజుల మ్యాచ్ క్రికెట్ అభిమానులకుకనువిందే.
Recent Stories
కులమే సామాజికసత్యం
పార్టీ టికెట్ల మార్కెటింగు












Click it and Unblock the Notifications
