Home
హోంపేజి
టాక్ ఆఫ్ టుడే
జనరల్ Tuesday, May 04 2004
హైదరాబాద్: ముఖ్యమంత్రి పదవి కోసంఆశపడడం లేదని, ఆ రేసులో లేనని రాజ్యసభ సభ్యుడు,దర్శకుడు దాసరి నారాయణ రావుస్పష్టం చేశారు. ఒకవేళ అధిష్టానం తనకు ఆ పదవినికట్టబెట్టినా తీసుకోనని చెప్పారు. మంగళవారం తన 59వజన్మదినోత్సవాన్ని హైదరాబాద్‌లో కొత్తగా కొన్న స్వగృహంలోవిలేకరులతో మాట్లాడారు. పెద్ద ఎత్తున కాంగ్రెస్ నేతలు,సినిమా ప్రముఖులు ఆయన ఇంటికి విచ్చేసి జన్మదిన శుభాకాంక్షలుతెలియచేశారు. బర్త్‌డే సందర్భంగా దాసరి డిన్నర్‌రాజకీయాలతో సీఎం పదవికి మద్దతుకూడగట్టుకోనున్నారని కొన్ని పత్రికల్లో వచ్చిన వార్తలుఅర్ధరహితమన్నారు. "ముఖ్యమంత్రి కావాలనుకుంటేఅసెంబ్లీకి పోటీ చేసేవాడిని కదా! నాకు పార్టీ అప్పగించిన బాధ్యతలు(ప్రచారం) పూర్తి చేశాను. అంతే, మిగతా బాధ్యతలు స్వీకరించేఉద్దేశం లేదు, అని ఆయన అన్నారు.
చిరుతో మీటింగ్ మామూలే..
సోమవారం నటుడు చిరంజీవితో ప్రత్యేకంగాసమావేశం కావడంలో ఆంతర్యమేమిటని ఒక విలేకరిప్రశ్నించగా, "చిరంజీవి రేపటినుంచి (మంగళవారం)షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. అందుకని ముందుగానే వచ్చి బర్త్‌డేవిషెష్ చెప్పి వెళ్ళాడు. ప్రతి ఏటా నా బర్త్‌డే నాడు చిరంజీవి మా ఇంటికివచ్చి శుభాకాంక్షలు తెలపడం ఆనవాయితీ. పాపం, ఆయన్ని ఎందుకురాజకీయాల్లోకి లాగుతారు? అని దాసరి సమాధానమిచ్చారు.కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండాఅధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మూడింటరెండొంతుల మెజార్టీని రాష్ట్ర కాంగ్రెస్ సాధిస్తుందన్నారు.
సోనియాకు చెప్పేశా..
ఎన్నికలకు ముందు మనస్తాపానికిగురైన దాసరి .. ఎన్నికలు పూర్తయ్యాక కొంతమంది కాంగ్రెస్‌పెద్దల భండారం బయటపెడుతానని ప్రకటించారు. ఈ విషయమైప్రశ్నించగా.."అవును నా అభిప్రాయాన్నిఏప్రిల్ 24న సోనియాగాంధీకితెలియచేశాను. అరగంటసేపు ఆమెతో మాట్లాడి నా అభిప్రాయాన్ని చెప్పాను. అంతేకానీ,మీడియాకు చెపుతానని చెప్పలేదు. అని ఆయనసమాధానమిచ్చారు.
ఈ ఏడాది మూడు సినిమాలు
కొంతకాలం గ్యాప్ తీసుకున్నప్పటికీ, ఈఏడాది మూడు సినిమాలకు దర్శకత్వం వహించనున్నాననిఆయన చెప్పారు. నిర్మాతలు దేవీవరప్రసాద్, వడ్డే రమేష్,మోహన్‌బాబులకు ఈ ఏడాది చిత్రాలు చేస్తానని ఆయన ప్రకటించారు.మోహన్‌బాబు చిత్రానికి మినహా మిగతా రెండింటికీ కథ రెడీఅయిందని చెప్పారు.Recent Stories
ఆఖరిపోరాటం
కులమే సామాజికసత్యం
పార్టీ టికెట్ల మార్కెటింగు హోంపేజి












Click it and Unblock the Notifications