నందమూరి కేసు కాకర్లకు చేటు?

హోంపేజి టాక్‌ ఆఫ్‌ టుడే జనరల్‌ Monday, June 21 2004

;?

హైదరాబాద్‌: బాలకృష్ణ ఇంట్లో జరిగినకాల్పుల కేసు ప్రకంపనలు నిమ్స్‌ను చుట్టుముడుతున్నాయి.నిమ్స్‌ డైరెక్టర్‌ కాకర్ల సుబ్బారావు బాలకృష్ణనుజైలుకు తరలించకుండా తన శక్తి మేరకు ఆక్సిజన్‌ఇస్తున్నారని అధికార కాంగ్రెస్‌ పార్టీ వందిమాగధులు రాష్ట్రప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళారు. కాకర్ల సుబ్బారావు కొన్నిరోజులు సెలవు మీద వెళ్ళినప్పటికీ బాలకృష్ణ ఆరోగ్య స్ధితి మీదతరచుగా బులెటిన్‌లు విడుదల చేస్తున్నారు.

నిమ్స్‌ డైరెక్టరు పదవిలోకి రాష్ట్రంలో ఏపార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీకి అనుకూలమైన వ్యక్తిరావడం గత పదహారేళ్ళుగా ఆనవాయితీగా వస్తోంది.డాక్టర్‌ కాకర్ల సుబ్బారావును అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీరామారావు అమెరికా నుంచి రప్పించి నిమ్స్‌ వ్యవస్ధాపకడైరెక్టర్‌ పదవిని కట్టబెట్టారు. ఆయన హయాంలో నిమ్స్‌బ్రహ్మాండంగా అభివృద్ధి చెందిందని ఒక వాదన. అదంతా బూటకం, నిమ్స్‌ పచ్చివ్యాపార సంస్ధగా మారిందని, ఒక కులం వారికి లాభంచేకూరుస్తోందని మరో వాదన.

అందువల్లనే ఎనభై తొమ్మిదోసంవత్సరంలో ఎన్టీఆర్‌ ప్రభుత్వం ఓడిపోయి, చెన్నారెడ్డినాయకత్వంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన కొన్ని రోజుల్లోనేకాకర్ల సుబ్బారావును ఇంటికి పంపి ఒక రెడ్డిని నిమ్స్‌డైరెక్టర్‌గా నియమించారు. తొంభై నాలుగులో మళ్ళీ ఎన్టీఆర్‌అధికారంలోకి రాగానే కాకర్ల నిమ్స్‌ డైరెక్టర్‌ గానియమితులయ్యారు. ఆయన పదవీకాలం గత ఏడాది ముగియడంతోఅప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పొడిగించారు. డెబ్బైఏళ్ళు దాటిన కాకర్ల సేవలు నిమ్స్‌కు అవసరమని చంద్రబాబునాయుడు భావించారు.

తాజాగా బాలకృష్ణ కేసులోవయోవృద్ధుడైన కాకర్ల వివాదాస్పదుడయ్యారు. ఎన్టీఆర్‌రుణం తీర్చుకోడానికి ఆయన బాలకృష్ణను రక్షించడానికిప్రయత్నిస్తున్నారన్న విమర్శలున్నాయి. నిమ్స్‌ డైరెక్టర్‌యుక్తిగా వ్యవహరించడం వల్లనే బాలకృష్ణకు జైలుతప్పిందని కాంగ్రెస్‌ లాబీ వాదిస్తోంది. నిమ్స్‌ డైరెక్టరుగాకాకర్ల కాకుండా మరొకరు ఉంటే బాలకృష్ణ పరిస్ధితి మరోలాఉండేదని వీరు అంటున్నారు. నిమ్స్‌ డైరెక్టర్‌ కాకర్లసుబ్బారావును ఆ పదవి నుంచి తప్పించాలని రెడ్డి వర్గానికిచెందిన డాక్టర్ల లాబీ ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి మీద వత్తిడితెస్తోంది.

ఈ విషయంలో రాజశేఖరరెడ్డి ఎంతసంయమనంతో వ్యవహరిస్తారో చూడవలసి ఉంది.

ఇటీవలికథనాలు

  • చంద్రబాబుఅస్త్రాలు
  • ఎవరీ సిసి రెడ్డి?
  • అక్రమాల ల్యాండ్‌మార్క్‌
  • రియల్‌(ఎస్టేట్‌) రిపోర్ట్‌
  • వెలుగు వెనుక చీకటి
  • ఈ సినిమా పేరు ఎత్తుకు పైఎత్తు
  • చుట్టాలు-చట్టాలు
  • ఈయన సినిమా పోలీసు కాదు
  • ప్రత్యూష కేసు మరో మలుపు
  • ప్రజల దేవుడు
  • విశ్లేషణ..సగటు ఓటరు విజయం
  • రేపటి సంగతి
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+