వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాటలమరాఠీ!

By Staff
|
Google Oneindia TeluguNews

(అంబటిజయేంద్ర రాజు)

హైదరాబాద్‌:కేంద్ర కార్మిక మంత్రి, టిఆర్‌ఎస్‌అధ్యక్షుడు కల్వకుంట్లచంద్రశేఖరరావు పత్రికల మీదఅవాకులు, చవాకులు పేలి మళ్ళీ వార్తల్లోకివచ్చారు. ఆయన మాటల మరాఠీ.మార్కెటింగ్‌ నిపుణుడు. అంతేగానీనోటికి హద్దు లేని ఆయన ఎన్నటికీరాజనీతి అలవడే అవకాశం లేదు.నేను మంచి వ్యూహకర్తను. నావ్యూహం ఎప్పుడూ బెడిసికొట్టదు.తెలంగాణ రాష్ట్రం ఎలా సాధించుకోవాలోనాకు తెలుసు అని చంద్రశేఖరరావువ్యాఖ్యానించారు. ఆయన తెలివితేటలకుజోహార్లు. తెలుగుదేశం పార్టీలో ఉండగాచంద్రబాబు నాయుడికి వినయంగాఆలోచనాస్త్రాలను ఇచ్చిన ఘన చరిత్ర కూడాఆయనది.

ప్రత్యేకతెలంగాణను వ్యతిరేకించేవారుహైదరాబాద్‌లో ఉన్నా మరెక్కడ ఉన్నాజాగ్రత్తగా మసలుకోక తప్పదు అనిచంద్రశేఖరరావు హెచ్చరించారు.ఆయన ఏ ప్రయోజనాన్ని ఆశించి ఈ బెదిరింపులుచేస్తున్నారో అర్ధం కాదు. కొన్ని పత్రికలుతనకు అనుకూలమట. కొన్ని పత్రికలువ్యతిరేకమట. పరిణతి చెందినరాజకీయ నాయకుడెవరూ ఇలామాట్లాడరు. ప్రత్యేక తెలంగాణరాష్ట్రాన్ని సాధించుకునే పవిత్రకర్తవ్యం పెట్టుకున్న నాయకుడుమౌనంగా కార్య సాధనకు దిగాలేకానీ ఇలా వివాదాల్లో చిక్కుకోడు. తెలంగాణ ప్రజలుప్రత్యేక రాష్ట్రం కోసం సీరియస్‌గాఉంటే దానిని హరిహర బ్రహ్మాదులు కూడాఆపలేరు. తెలంగాణ ప్రజల్లో ఉన్నభావాలను అడ్డం పెట్టుకుని పదవులుపొందిన వారు ఆ సెంటిమెంటునుగౌరవించాలి. ఉద్యమాల నుంచి నాయకులుపుడతారు కానీ నాయకుల నుంచిఉద్యమాలు పుట్టవన్న విషయాన్నిచంద్రశేఖరరావు గ్రహించాలి.వెనుకబడిన తెలంగాణ ప్రత్యేకరాష్ట్రంగా ఏర్పడితే ఎవరికీఅభ్యంతరం ఉండవలసిన అవసరంలేదు. తెలంగాణ సెంటిమెంట్‌ బలంగాఉంటే కొత్త రాష్ట్రం ఏర్పడడానికిచంద్రశేఖరరావే అవసరం లేదు, ఆస్ధానంలో ఏ నాయకుడున్నా ఫర్వాలేదు.

ఎన్నికల్లోఇతర బూర్జువా పార్టీల కంటే హీనంగావ్యవహరించినట్టు ఆరోపణలు గల టిఆర్‌ఎస్‌అధినేత చంద్రశేఖరరావు మాటలుమార్చడంలో దిట్ట. గత ఎన్నికల్లో బిసి, ఎస్‌సి,ఎస్‌టి వంటి బలహీన వర్గాలకుసముచితంగా టికెట్లు ఇస్తామని చెప్పి,చివరికి ధనికులకు అధికంగా టికెట్లుకేటాయించి విమర్శల పాలు కాలేదా?తెలంగాణ బలహీన వర్గాల్లో ఆయనవిశ్వాసం కోల్పోయిన విషయం దొరగారికితెలియదా? తాని నిజంగా తెలంగాణసెంటిమెంట్‌ను ప్రజల్లో పెంపొందించి ఉంటేగత ఎన్నికల్లో అన్ని స్ధానాల్లో టిఆర్‌ఎస్‌అభ్యర్ధులకు అంత తక్కువ ఓట్లు ఎలావస్తాయి? తెలంగాణ నాయకుడిగాతన వైఫల్యాలను ఒప్పుకునేసంస్కారం ఆయనకు ఉండాలి.

తెలంగాణరాష్ట్రం ఏర్పాటు విషయాన్నిపరిశీలించేందుకు యుపిఎ ప్రభుత్వం ఒకఉపసంఘం వేసినంత మాత్రానతెలంగాణ ప్రజలు మురిసిపోవలసినఅవసరం లేదు. జరగాల్సింది ఇంకా ఎంతోఉంది. అనేక సార్లు తెలంగాణఉద్యమాలను దెబ్బతీసిన చరిత్ర గలకాంగ్రెస్‌తో వ్యవహరించేటప్పుడు చాలాజాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాల్సినఅవసరం టిఆర్‌ఎస్‌కు ఉంది. మూడునెలల్లో తెలంగాణ, ఆరు నెలల్లో తెలంగాణడిసెంబర్‌లోగా తెలంగాణ అంటూ బహిరంగప్రకటనలు చేసిన చంద్రశేఖరరావుఇప్పుడేంటున్నారు? తెలంగాణ ఏర్పాటుకుడెడ్‌లైన్‌ లేదంటున్నారు. ఇది మాటమార్చడం కాదా?

తెలంగాణరాష్ట్రం ఏర్పడిన తర్వాతదళితుడిని ముఖ్యమంత్రిని చేసి తానురాజకీయ నుంచి తప్పుకుంటాననిచంద్రశేఖరరావు అనేక సార్లుచెప్పారు. ఆ మాట మీదైనా ఆయననిలబడతారా? తెలంగాణ రాష్ట్రం అంటేతెలంగాణ దేశం అన్న రీతిలోమాట్లాడుతున్నచంద్రశేఖరరావుకు బెంగుళూరు,చెన్నై నగరాల్లో ఎన్ని రాష్ట్రాలకుచెందిన ప్రజలు ఎంత పెద్ద సంఖ్యలో ఉన్నారోతెలియదా? పరాయి రాష్ట్రంలో ఉన్నట్టువారు ఫీల్‌ కావడం లేదన్న విషయంచంద్రశేఖరరావుకు తెలుసా? ఆయనరాష్ట్ర కాంగ్రెస్‌ నాయకులనుబెదిరిస్తాడు. పత్రికలను బెదిరిస్తాడు.టిఆర్‌ఎస్‌ నుంచి వెళ్ళిపోయిన వారినిబెదిరిస్తాడు. ఏమిటిది? ప్రజాస్వామ్యమేనా?ప్రజలకు, పత్రికలకు భావప్రకటనస్వేచ్ఛఉండదా?

ప్రెస్‌అకాడమీ చైర్మన్‌గా అమర్‌
కంచిపైఇంటిలిజెన్స్‌ కన్ను
బాలకృష్ణపైచార్జిషీట్‌
చిరుకథలోపెను మార్పులు!
సినిమా వాళ్ళెక్కడ? మీడియా ఎక్కడ?
జయేంద్ర విశేషాలు
ఒక టిడిపి నేత విజయ గాధ
రాంగోపాల్‌వర్మ నాచ్‌ వివాదం
హెల్మెట్‌లో దాగిన అవినీతి పురుగు
మన్మోహన్‌హంగ్‌!
రాజేంద్రప్రసాద్‌కు రఘుపతి వెంకయ్య అవార్డు
షిండే సక్సెస్‌ స్టోరీ
ఆది మానవుడికీ హనుమంతుడికీ లింకు!
ఉదయభాను విషాద గాధ
ఉత్తమ కంపెనీల్లో సత్యం
హిందీలో వీరప్పన్‌ సినిమా
అడవుల విస్తరణలో రాష్ట్రం టాప్‌
దసరా మూవీస్‌
రెండో రౌండు సాధ్యమే!
కెసిఆర్‌ మీమాంస
లంచగొండితనం సమస్య కాదా?
నానితో ఎన్టీఆర్‌ కటీఫ్‌
ఇకనైనా నిదానం నాగేందర్‌

హోంపేజి
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X