లోక్‌ సత్తాయింపు?

హోంపేజి టాక్‌ ఆఫ్‌ టుడే చంద్రబాబు Wednesday, June 23 2004

హైదరాబాద్‌: అధికారంలో ఉన్నప్పుడురోజుకి పద్దెనిమిది గంటలు పనిచేసిన చంద్రబాబు నాయుడు ఇప్పుడేంచేస్తున్నారన్న ఆసక్తి అందరికీ ఉంటుంది. ఇప్పుడాయన దినచర్యకొంచెం భిన్నంగా ఉంది. తెల్లవారుజామున యోగా, ప్రాణాయామంమామూలుగానే చేస్తున్నారు. ఉదయం ఇంటివద్ద పార్టీ ముఖ్యనాయకులను, వివిధ రంగాల శ్రేయోభిలాషులను ఆయనకలుసుకుంటున్నారు. అసెంబ్లీ సమావేశాలు లేనప్పుడు పార్టీఆఫీసులోనే కాలక్షేపం చేస్తున్నారు.

అధికారంలో ఉన్నప్పుడు తమ మాటలువినలేదన్న కడుపుమంట ఉన్న తెలుగుదేశం నాయకులుఓటమికి గల కారణాలను వివరిస్తుంటే ఆయన మౌనంగావింటున్నారు. వాళ్ళు ఏ మాత్రం దెప్పిపొడుపు ధోరణిలో మాట్లాడినావెంటనే ఆయన వాళ్ళని అక్కడి నుంచి పంపేస్తున్నారు. తనచుట్టూఏర్పడిన కోటరీయే తనకు వాస్తవాలు తెలియకుండా చేసిందనిఆయన రాజకీయేతర శ్రేయోభిలాషుల వద్ద వాపోతున్నారు.తనకు అందిన సర్వే నివేదికలన్నీ తప్పుల తడకలన్న విషయంఎన్నికల ఫలితాలరోజున కానీ తనకు తెలియలేదని ఆయనఅంటున్నారు. ఐఎఎస్‌ అధికారుల మీద అధికంగా ఆధారపడడంకూడా నష్టం కలిగించిందని ఆయన గ్రహించారు.

పార్టీ కార్యాలయంలో పెద్ద గ్రంధాలయంఏర్పాటు చేసిన ఆయన ఇప్పుడు దాని మీద శ్రద్ధ చూపిస్తున్నారు.పార్టీ కార్యాలయంలో ఉన్నప్పుడు ఏదో ఒక పుస్తకం తెప్పించుకునిపేజీలు తిరగేస్తున్నారు. సిఎంగా ఉన్నప్పుడు లంచ్‌కుతప్పనిసరిగా ఇంటికి వెళ్ళిన చంద్రబాబు ఇప్పుడు లంచ్‌ బాక్సుతెచ్చుకుంటున్నారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వ నిర్ణయాల మీదచంద్రబాబు నాయుడు తన పార్టీ మేధావులతో ఎప్పటికప్పుడుచర్చిస్తున్నారు. ప్రతిపక్షనాయకుడిగా కాంగ్రెస్‌ప్రభుత్వానికి కాళ్ళు చేతులు ఆడని పరిస్ధితిని ఎలాకల్పించాలన్నదేఇప్పుడాయన ఆలోచన.

  • నెలరాజు వైఎస్‌
  • మారువేషంలోవెళ్ళొచ్చు కదా?
  • ఎవరు గొప్ప?
  • ఆచితూచి అడుగులు
  • సవాళ్ళు ఎన్నో...
హోంపేజి
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+