కొత్త అధికారనివాసం

హైదరాబాద్‌:ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌రాజశేఖరరెడ్డి రేపు (బుధవారం) గ్రీన్‌లాండ్స్‌లోని కొత్త కార్యాలయభవనంలోకి మారుతున్నారు.ప్రస్తుతం ఆయన బంజారాహిల్స్‌లోతన కుమార్తె ఇంటిని నివాసంగా,లేక్‌వ్యూ గెస్ట్‌ హౌస్‌ను తనకార్యాలయంగా ఉపయోగించుకుంటున్నారు.గతంలో చాలామంది ముఖ్యమంత్రులుతమ సొంత నివాసాల్లోనే ఉండేవారు.కార్యాలయాన్ని కూడా ఇంట్లోనే ఏర్పాటు చేసుకునేవారు.

గ్రీన్‌లాండ్స్‌లోబ్లూమూన్‌ హోటల్‌ ఎదురుగా ఉన్న రెండుప్రభుత్వ బంగళాలను కలిపి ముఖ్యమంత్రినివాసం, కార్యాలయం ఒకేచోటఉండేలా మార్పులు చేర్పులు చేస్తున్నారు.దాదాపు ఐదు కోట్ల రూపాయలప్రజాధనంతో ఈ పనులు జరుగుతున్నాయి. ప్రస్తుతంముఖ్యమంత్రి కార్యాలయం సిద్ధమైంది.పక్కనే ఆయన నివాసం సిద్ధంకావడానికి మరికొంత సమయంపడుతుంది. రేపు సందర్శకులనుముఖ్యమంత్రి గ్రీన్‌లాండ్స్‌ బంగళా లోనేకలుసుకోనున్నారు.

ఎన్నోప్రభుత్వభవనాలు ఉండగా ఐదు కోట్ల రూపాయలతోఆర్భాటంగా సిఎం అధికార నివాసం నిర్మించడంపైవిమర్శలు వచ్చాయి.గతంలో చంద్రబాబు నాయుడు, ఎన్టీఆర్‌,విజయభాస్కరరెడ్డి, నేదురుమల్లిజనార్ధనరెడ్డి, చెన్నారెడ్డి సొంతబంగళాల్లోనే నివాసం, కార్యాలయం ఏర్పాటుచేసుకున్నారు. 1978 లో అప్పటి ముఖ్యమంత్రిడాక్టర్‌ మర్రి చెన్నారెడ్డి గ్రీన్‌లాండ్స్‌గెస్ట్‌ హౌస్‌ను సిఎం అధికార నివాసంగామార్చుకున్నారు. ఆయన అక్కడ నివసిస్తున్నప్పుడు బాత్‌రూమ్‌లో జారిపడడం, ఆ తర్వాత పదవి కోల్పోవడంవల్ల ఆ తర్వాత అంజయ్య మినహా మరేముఖ్యమంత్రీ గ్రీన్‌ ల్యాండ్స్‌ గెస్ట్‌ హౌస్‌లోఉండడానికి ఇష్టపడలేదు.

ఇప్పటిసిఎం అధికార నివాసం నిర్మాణకాంట్రాక్టును ముఖ్యమంత్రిరాజశేఖరరెడ్డి సమీప బంధువే దక్కించుకున్నారన్న ఆరోపణలువచ్చాయి. పాత బంగళాల గదులనుపడగొట్టే కాంట్రాక్టుకే కోటికి పైగా చెల్లించారన్నఅభియోగం కూడా వచ్చింది.ఇప్పుడు ముఖ్యమంత్రి అధికార నివాసంగామారనున్న రెండు బంగళాల్లోతెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మంత్రులు కోడెల శివప్రసాదరావు,మండవ వెంకటేశ్వరరావు నివాసం ఉండేవారు.

ఆరునెలలకే వారు వీరు
ఐటీ ఉద్యోగులఉదారత
2004వెలుగునీడలు
ఫ్లాష్‌న్యూస్‌మనసుపాట వినదు
పాపం!బాజీ బజాజ్‌!
తల్లీకొడుకులఅపూర్వ గాధ
శత్రువుశత్రువు మిత్రుడవుతాడా?
ఆచెట్టు వేళ్ళు పుట్టిన గడ్డలోనే
అన్నీ మంచిశకునములే
చిన్నస్వామిస్వర్ణాభిషేకం
త్వరలోదాసరి ఛానల్‌!
మాటలమరాఠీ!
ప్రెస్‌అకాడమీ చైర్మన్‌గా అమర్‌
కంచిపైఇంటిలిజెన్స్‌ కన్ను
బాలకృష్ణపైచార్జిషీట్‌
చిరుకథలోపెను మార్పులు!
సినిమా వాళ్ళెక్కడ? మీడియా ఎక్కడ?
జయేంద్ర విశేషాలు
ఒక టిడిపి నేత విజయ గాధ
రాంగోపాల్‌వర్మ నాచ్‌ వివాదం
హెల్మెట్‌లో దాగిన అవినీతి పురుగు
మన్మోహన్‌హంగ్‌!
రాజేంద్రప్రసాద్‌కు రఘుపతి వెంకయ్య అవార్డు
షిండే సక్సెస్‌ స్టోరీ
ఆది మానవుడికీ హనుమంతుడికీ లింకు!
ఉదయభాను విషాద గాధ
ఉత్తమ కంపెనీల్లో సత్యం
హిందీలో వీరప్పన్‌ సినిమా

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+