• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పరిటాలరాజకీయ వైరాగ్యం

By Staff
|

హైదరాబాద్‌:రాజకీయాలపై నాకున్నఅందమైన కలలన్నీ చెదిరిపోయాయి. మావూళ్ళో పొలం దున్నుకుంటూ బతకడమేహాయిగా ఉంది అని టిడిపి ఎమ్మెల్యే పరిటాలరవి ఒక ఆంగ్ల పత్రికకు ఇచ్చినఇంటర్వ్యూలో వెల్లడించారు. కాంగ్రెస్‌ప్రభుత్వ హయాంలో ఇప్పుడు అత్యంతప్రాణభయం ఉన్న రాజకీయ నాయకుడు పరిటాల.

ఆయనభద్రతకు ప్రభుత్వం పది మంది పోలీసు గార్డులను ఇచ్చింది. ఇందులోనలుగురు ఎప్పుడూ ఆయనతో ఉంటారు. ఇదికాకుండా బాహ్యవలయంగా ముప్పై మంది ప్రైవేటుసైనికులు ఆయనకురక్షణగా ఉంటారు. అనంతపురంపట్టణానికి డెబ్బై కిలోమీటర్ల దూరంలోఉన్న స్వగ్రామం వెంకటాపురంలోనేఆయన ఎక్కువ కాలం గడుపుతున్నారు.

ముఖ్యమంత్రివైఎస్‌ రాజశేఖరరెడ్డి నుంచి, ఆయనకుమారుడు జగన్మోహన్‌ రెడ్డి నుంచితనకు ప్రాణహాని ఉందని పరిటాల రవి పదేపదే చెబుతున్నారు. తన మీద బనాయించినకేసులు న్యాయస్ధానాల్లో నిలబడవని ఆయన అన్నారు.తెలుగుదేశం ప్రభుత్వంఅధికారంలో ఉన్న తొమ్మిదిన్నరేళ్ళకాలంలో తానే గనుక అనంతపురంజిల్లాలో కాంగ్రెస్‌ పార్టీని రూపు రేఖలు లేకుండాచేయాలనికుంటే సులభంగా చేసి ఉండేవాడినని తనకు ఆ ఉద్దేశంఉండేది కాదని ఆయన చెప్పారు. పదేళ్ళక్రితం ఎన్టీఆర్‌, లక్ష్మీపార్వతిలప్రోత్సాహంతో క్రియాశీల రాజకీయాల్లోకివచ్చిన పరిటాల కొంతకాలం కార్మిక శాఖ మంత్రిగాపనిచేశారు.

ఆయనరాజకీయంగా అవినీతి పరుడు కాదనికార్మిక శాఖ ఉన్నతాధికారులు ఇప్పటికీగుర్తు చేసుకుంటూ ఉంటారు. ఎన్టీఆర్‌ కు చంద్రబాబునాయుడు వెన్నుపోటుపొడిచినప్పుడు పరిటాల ఎన్టీఆర్‌ పక్షంవహించి చంద్రబాబు నాయుడిని తీవ్రంగావిమర్శించారు.

ఆ తర్వాతగత్యంతరం లేక చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశంపార్టీలోకొనసాగారు. ఆయనకూ చంద్రబాబు నాయుడికీ ఇప్పటికీ అంతమంచిసంబంధాలు లేవు. పార్టీ పరంగా సన్నిహితంగా ఉండడమే కానీ ఇద్దరిఆలోచనా విధానం భిన్నంగా ఉంటుంది.

వెంకటాపురంలోనిపరిటాల రెండతస్తుల ఇల్లు సినిమాల్లో చూపించే రాయలసీమ డాన్‌ల డెన్‌మాదిరిగా ఉంటుంది. చీకటి పడితే చాలుఆవరణలో ఫ్లడ్‌లైట్లు వెలుగుతాయి. నూటయాభైమంది పరిటాల మనుషులుఅక్కడ ఉంటారు. పరిటాల బయటకు వెళ్ళేసందర్భాలు చాలా తక్కువ. ఒకవేళవెళ్ళవలసి వస్తే ఒకే విధమైనఇరవై కార్లు బయలుదేరుతాయి.ఆయన ఏ కారులో ఉంటారో ఒకరిద్దరు సన్నిహితసహచరులకు తప్పఇతరులెవరికీ తెలియదు.

రాజకీయాల్లోఉండి ఎన్నో మంచి పనులు చేయాలనుకున్నాను. ఆకలలు కరిగిపోయాయి. బతికున్నంతవరకుఆదర్శ రైతుగాఉండాలనుకుంటున్నాను అంటున్నారు పరిటాలరవీంద్ర.

ఇటీవలికథనాలు

  • మా తెలుగు బాబుకు చాడీల దండ!
  • ఇక బాబు రోడ్‌షోలు
  • టిడిపి గుండెల్లో ఏలేరురైళ్ళు
  • చంద్రబాబుతురుపుముక్క
  • ఎన్టీఆర్‌ గుర్తున్నాడా?
  • సైకిల్‌కుఅసమ్మతి బ్రేక్‌లు
  • చిరంజీవిరహస్య ఎజెండా?
  • అస్పష్ట రాజకీయ చిత్రం

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X