పులిరాజాఏమయ్యాడు?

కోట్ల రూపాయలు ఖర్చు చేసిఆంధ్రప్రదేశ్‌ ఎయిడ్స్‌ కంట్రోల్‌ సొసైటీఅధ్వర్యంలో చేపట్టిన పులిరాజాప్రచారం అర్థాంతరంగాముగియడానికి కారణం ఫలితాలులేకపోవడమే. దీంతో తాజాగా రాష్ట్రప్రభుత్వం ఎచ్‌.ఐ.వి లేదా ఎయిడ్స్‌పైరాష్ట్రవ్యాప్త సర్వే ప్రారంభించింది. జూలైఒకటిన ప్రారంభమైన ఈ సర్వేమరో పది రోజుల్లో ముగుస్తుంది. అన్నిప్రాంతాల్లోనూ బ్లడ్‌శాంపుల్స్‌సేకరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోఎయిడ్స్‌ మహమ్మరి విపరీతంగాపెరిగిపోయిందని తాజా పరిశోధనలువెల్లడించడంతో ప్రభుత్వంఆలస్యంగా నిద్రలేచింది.

మనదేశంలోఎయిడ్స్‌ లేదా ఎచ్‌.ఐ.వి పరివ్యాప్తి అధికంగాఉన్న రెండో రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌.మొత్తం దేశంలో 47ప్రాంతాలను అత్యధికంగా ఎయిడ్స్‌ప్రబలిన జిల్లాలను గుర్తించారు. అందులోమనరాష్ట్రంలోనే ఏడు జిల్లాలు ఉన్నాయి.కోస్తాబెల్ట్‌లోనూ, మనరాష్ట్రం గుండావెళ్ళే కోల్‌కోతా - చెన్నై జాతీయరహదారి, కరీంనగర్‌, నిజమాబాద్‌ప్రాంతాల్లో ఎయిడ్స్‌ అధికంగా ఉంది.కారణం ఇక్కడ లారీ డ్రైవర్లు, సెక్స్‌వర్కర్లతో రక్షణ లేకుండాసెక్స్‌లో పాల్గొనడం అని గుర్తించారు.

ఎయిడ్స్‌గురించి ఓ లారీ డ్రైవర్‌ తనఅనుభవాలను ..సినిమా పాటలతోవినోదాత్మకంగా తెలియచేసే ఓ ఆడియోక్యాసెట్‌ను ఇటీవల ఈ ప్రాంతాల్లోఆరోగ్యకార్యకర్తలు పంపిణీచేశారు. అయితే, లారీ డ్రైవర్లు ఆక్యాసెట్‌లో ఉన్న లే ..లే..నా రాజా..,ఆరేసుకోబేయి పారేసుకున్నానుహరి.., వంటి మసాలా పాటలను వినడంమినహా అందులో ఉన్న సందేశాన్నిగ్రహించడం లేదు.

ఎయిడ్స్‌వంటి సీరియస్‌ అంశాలపైవినోదాత్మక పద్దతిలో ప్రచారంచేపట్టాలనే క మ్యూనికేషన్‌ స్ట్రాటజీదక్షిణభారతదేశంలో సక్సెస్‌కాదని యాడ్‌ ఏజెన్సీలు, కమ్యూనికేషన్‌స్ట్రాటజిస్ట్‌లు గుర్తించడం లేదు.

ఎయిడ్స్‌మన రాష్ట్రంలో ఎందుకు అంతగావ్యాప్తి చెందుతుంది? దీనికి ప్రధానంగాఅనేక సామాజిక కారణాలున్నాయి.మల్టిపుల్‌ పార్టనర్స్‌ (భార్యకాకుండా ఇతరులతో సంబంధాలుపెట్టుకోవడం) అనే కాన్సెప్ట్‌ గ్రామీణప్రాంతాల్లో వెనుకటి నుంచి ఉంది.ముఖ్యంగా ఇక్కడ వివాహేతరసంబంధాలు గుట్టుగా జరుగుతూ ఉంటాయి.చాలామంది మగవాళ్ళు దీన్నిగర్వంగా భావిస్తుంటారు.

ఈసామాజిక కోణాన్ని దృష్టిలో పెట్టుకొనే సెక్స్‌బెల్ట్‌లుగా పేరొందిన పెద్దాపురం,అమలాపురం (తూర్పుగోదావరి),దువ్వ, వేల్పూరు, తాడేపల్లిగూడెం(పశ్చిమగోదావరి), చీరాల (ప్రకాశం),కావలి (నెల్లూరు), కామారెడ్డి,నిజామాబాద్‌(నిజమాబాద్‌) వంటిప్రాంతాల్లో ఎనీటైమ్‌ కండోమ్‌మెషిన్స్‌ ఏర్పాటు చేశారు.అయినప్పటికీ, పెద్దగా ఫలితాలుకనిపిస్తున్నట్లు లేదు.

Recent Stories
చిత్ర హింస
కెసిఆర్‌ఏం చేస్తున్నట్లు?
రాజకీయరంగులు

చంద్రబాబుశైలి బాట
పరిటాలకథ
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+