వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మొదలైనచోటికే.....

By Staff
|
Google Oneindia TeluguNews

హోంపేజి టాక్‌ ఆఫ్‌ టుడే;/SPAN> జనరల్‌ Thursday, December 23, 2004

హైదరాబాద్‌:మాజీ ప్రధాని పి.వి. నర్సింహారావును గొప్పఆలోచనాపరుడిగా ప్రముఖ సాహితీవేత్త,సమకాలికుడు దాశరథి రంగాచార్యఅభివర్ణించారు. రాజకీయాల్లో ఆయన పాత్రవివాదాస్పదంగా మారినా ఆయనవ్యక్తిత్వానికి తెలుగు ప్రాంతంలో ఏవిధమైన విఘాతం కలగలేదు.రాజకీయాల్లో అపరచాణుక్యుడిగాఅభివర్ణించడం సహజమే. రాజకీయాల్లోఆయన కరణీకం చేశారనే మాటకూడా ఉంది. మైనారిటీ ప్రభుత్వాన్ని ఐదేళ్లపాటు నడిపించడంలో ఆయనకృతకృత్యుడు కావడానికి చేసినప్రయత్నాలు ఆయనకు పేర్లు తెచ్చిపెట్టాయి.

వివిధకేసుల్లో ఇరుక్కుని క్రియాశీలకరాజకీయాలకు దూరమయ్యారు.ఎప్పుడైతే ఆయన క్రియాశీలకరాజకీయాలకు దూరమయ్యారో అప్పటినుంచి ఆయన పాత జీవితం తిరిగిమొదలైంది. ఆయన ఎక్కడబయలుదేరాడో అక్కడికి వచ్చాడు.సాహిత్యం పట్ల ఆయనకు ఉన్న అభిరుచి,ఆయన స్నేహాలు పునరుద్ధరణపొందుతూ వచ్చాయి. సాహిత్యం పట్లఆయనకున్న మక్కువ బయటపడుతూవచ్చింది. ఆ సమయంలో పాత మిత్రులుఆయనకు మళ్లీ చేరువయ్యారు.

తనసమకాలికుడు, అత్యంతసన్నిహితుడు కాళోజీ నారాయణరావుసభలో ఆయన మాట్లాడిన తీరు ఆయనవ్యక్తిత్వాన్ని పట్టించింది. అనేకవిషయాలను ఆయన అలవోకగా చెబుతూపోయారు. ఆయన రాసిన కథల గురించిఎవరైనా తెలియజేసినప్పుడు గొప్పఆనందానికి గురవుతూ వచ్చాడు.మీరు రాసిన కథ కథానిలయంలో ఉందిఅని ప్రముఖ కథా రచయిత కాళీపట్నంరామారావు చెప్పినప్పుడు పివి పొందినఆనందం అంతా ఇంతా కాదు. కాళీపట్నంరామారావు విశాఖపట్నంలో కథానిలయంఏర్పాటు చేసి కథలను సేకరించిభద్రపరుస్తున్నారు.

ప్రముఖరచయిత్రి డాక్టర్‌ ముదిగంటిసుజాతారెడ్డి తెలంగాణ తొలి తరంకథలు అనే పుస్తకం సంకలనం చేసిఅచ్చేశారు. అందులో పివి కథగొల్లరామవ్వ ఉంది. ముదిగంటిసుజాతారెడ్డి, మరికొంత మందిసాహిత్యకారులు పివిని కలిసి ఆ పుస్తకంఅందజేశారు. ఆ సమయంలో ఆయన ఎంతోగొప్పగా ఫీలయ్యారు. ఆ విధంగా తెలుగుసాహిత్యం తీరుతెన్నుల గురించిఅడిగేవారు. తన పాత స్నేహితులనుగుర్తు చేసుకునేవారు.

క్రియాశీలకరాజకీయాల నుంచి తప్పుకున్నతర్వాత ఆయన రాజకీయాలపై ఏవిధమైన వ్యాఖ్యానాలు చేయలేదు. ఎవరిగురించి తప్పుగానో, ఒప్పుగానోమాట్లాడలేదు. తనకు కావాల్సిందేదోలభించిందని, తాను ఎక్కడికి చేరుకోవాలోఅక్కడికి చేరుకున్నాననే భావనఆయనను ముందుకు నడిపించిఉంటుంది.

అయితేఆర్థిక సంస్కరణల అమలు విషయంలోఆయన ఒకటి రెండు సార్లుఅసంతృప్తి వ్యక్తం చేశారు. ఆర్థికసంస్కరణల అమలు సరైన దిశలోసాగడం లేదని ఆయన అసంతృప్తివ్యక్తం చేశారు. ప్రస్తుత ప్రధానిడాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ను తీసుకొచ్చిఆర్థిక శాఖను అప్పగించి ఆర్థిక సంస్కరణలకుఆయన వూపునిచ్చారు. ఆర్థికసంస్కరణలకు పేదలకు ఉపయోగపడేలాఅమలు కావాలని ఆయన అంటూ వచ్చారు.అయితే ఆయన వాటిని పేదలకు మేలుచేసే విధంగా ఎలా అమలు చేసేవారోతెలియదు.

భూసంస్కరణలకుశ్రీకారం చుట్టిన పివి నర్సింహారావుగురుకుల పాఠశాలల స్థాపనకు కూడాఆద్యుడే. మొదట్లో ఆయన ప్రారంభించినమూడు గురు కుల పాఠశాలల నుంచి విశేషప్రతిభ గల గ్రామీణ విద్యార్థులువెలుగులోకి వచ్చారు.తర్వాత్తర్వాత వాటి స్ఫూర్తితగ్గుతూ రావడానికి పివి బాధ్యుడుకారు.

ఇన్‌సైడర్‌రాసిన పివి దాని రెండో భాగాన్ని కూడారాస్తానని చెప్పారు. అది రాయకుండానేఆయన అస్తమించారు. చివరి రోజుల్లో పివినర్సింహారావు ఎక్కడి నుంచిమొదలయ్యారో అక్కడికే వచ్చారు. చాలామందిలో ఇది జరగదు. పివి లాంటి వ్యక్తివల్లనే సాధ్యమవుతుంది.

ఈ పేజీని మీ మిత్రులకు పంపండి

పాపం! బాజీ బజాజ్‌!
తల్లీకొడుకులఅపూర్వ గాధ
శత్రువుశత్రువు మిత్రుడవుతాడా?
ఆచెట్టు వేళ్ళు పుట్టిన గడ్డలోనే
అన్నీ మంచిశకునములే
చిన్నస్వామిస్వర్ణాభిషేకం
త్వరలోదాసరి ఛానల్‌!
మాటలమరాఠీ!
ప్రెస్‌అకాడమీ చైర్మన్‌గా అమర్‌
కంచిపైఇంటిలిజెన్స్‌ కన్ను
బాలకృష్ణపైచార్జిషీట్‌
చిరుకథలోపెను మార్పులు!
సినిమా వాళ్ళెక్కడ? మీడియా ఎక్కడ?
జయేంద్ర విశేషాలు
ఒక టిడిపి నేత విజయ గాధ
రాంగోపాల్‌వర్మ నాచ్‌ వివాదం
హెల్మెట్‌లో దాగిన అవినీతి పురుగు
మన్మోహన్‌హంగ్‌!
రాజేంద్రప్రసాద్‌కు రఘుపతి వెంకయ్య అవార్డు
షిండే సక్సెస్‌ స్టోరీ
ఆది మానవుడికీ హనుమంతుడికీ లింకు!
ఉదయభాను విషాద గాధ
ఉత్తమ కంపెనీల్లో సత్యం
హిందీలో వీరప్పన్‌ సినిమా

హోంపేజి
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X