ఎవరిదీ పత్రిక?

హోంపేజి టాక్‌ ఆఫ్‌ టుడే కాంగ్రెస్‌ Wednesday, August 25 2004

;?

న్యూఢిల్లీ:తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు,కేంద్రమంత్రి కె.చంద్రశేఖరరావు ఇప్పుడు ఢిల్లీలో ఏంచేస్తున్నట్టు?వన్‌డే మ్యాచ్‌లో లాగా ప్రతిరోజు తెలంగాణ మీద వ్యాఖ్యానాలుచేయబోనని ఆయన ప్రకటించిన విషయంతెలిసిందే.

చంద్రశేఖరరావు ఒక మంత్రిత్వ శాఖలేదు. ఆఫీసు లేదు. ఆయన తన అధికారభవనం నుంచే అన్నీఆపరే ట్‌ చేస్తున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంసాధించుకోడానికి ఆయనకున్న ఏకైక ఆశసోనియా గాంధీయే.ఎఐసిసితో, సిడబ్ల్యుసితో సంబంధం లేకుండా ఆయననేరుగా సోనియాగాంధీ అనుగ్రహంతోతెలంగాణ రాష్ట్రం సాధించుకునే దిశగాపావులు కదుపుతున్నారు.

డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు డాట్‌ ఐడియాస్‌డాట్‌కాంగా పేరున్న కెసిఆర్‌ చిన్న రాష్ట్రాలు ఏర్పాటు చేయడంవల్ల కాంగ్రెస్‌ దీర్ఘకాలంలో వచ్చే లాభాలను స్వయంగాసోనియాగాంధీకి వివరించడానికి అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ విషయంలో ఆయన కాంగ్రెస్‌సీనియర్‌ నాయకుడు జి.వెంకటస్వామి సహాయంతీసుకుంటున్నారు.

ఉత్తరప్రదేశ్‌, బీహార్‌ వంటి పెద్దరాష్ట్రాలను రెండు మూడు రాష్ట్రాలుగా విభజించడంద్వారా ఆరెండు రాష్ట్రాల్లో పాతుకుపోయిన ములాయంసింగ్‌ యాదవ్‌,లాలూప్రసాద్‌ యాదవ్‌లను రాజకీయంగా దెబ్బతీసి కాంగ్రెస్‌బలాన్ని అక్కడ పెంచుకోవచ్చన్నది ఆయనసోనియాగాంధీఇవ్వనున్న సలహా సారాంశం. పనిలో పనిగాతెలంగాణ ను కూడాఅందులో చేర్చినా ఈ విషయంలో ప్రత్యేక హామీని ఆయనసోనియాగాంధీ నుంచిఆశిస్తున్నారు. రాష్ట్రాల పునర్విభజన కమిషన్‌ వేసినాతెలంగాణవిషయంలో మధ్యంతర ఉత్తర్వులు పొందాలని ఆయనప్రయత్నిస్తున్నారు. రెండోరాష్ట్రాల పునర్విభజన కమీషన్‌ వేసితెలంగాణ, విదర్భలపైమధ్యంతర ఉత్తర్వులు కోరవచ్చునని వినిపిస్తోంది.తద్వారా ముందస్తుగా తెలంగాణ, విదర్భ రాష్ట్రాలు ఏర్పడవచ్చుననివార్తలువెలువడుతున్నాయి.

ఇదంతా మహారాష్ట్రశాసనసభ ఎన్నికలు ముగిసిన తర్వాత జరుగుతుందని ఒకతెలుగుదిన పత్రిక సుదీర్ఘ వార్తా కథనాన్ని ప్రచురించింది.మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలు ముగిసినతర్వాత తెలంగాణపై కాంగ్రెస్‌ అధిష్ఠానవర్గం స్పష్టమైన ప్రకటనచేస్తుందని చంద్రశేఖర్‌ రావు చెప్పుతున్న మాటకు ఆ పత్రికప్రచురించిన వార్తాకథనానికి మధ్య పొంతన కుదురుతోంది.

తెలంగాణ రాష్ట్ర సమితిపై ఫిర్యాదు చేయడానికి ఢిల్లీవెళ్లిన రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకులకుపార్టీ రాష్ట్ర వ్యవహారాలఇన్‌చార్జి నుంచి స్పష్టమైన ఆదేశాలే వచ్చాయి.తెలంగాణ విషయం తాము చూసుకుంటామని, ఈ విషయంపై రాష్ట్రనాయకులెవరూమాట్లాడవద్దని ఆయన కచ్చితంగానే చెప్పారు.తెలంగాణపైవివాదానికి దిగవద్దని కాంగ్రెస్‌ ఢిల్లీ పెద్దలుతెలంగాణ రాష్ట్రసమితి నాయకులకు కూడా సూచించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోతెలంగాణపైనే కాకుండా మరిన్ని చిన్న రాష్ట్రాల ఏర్పాటుకుసోనియా గాంధీ ఒక పకడ్బందీ ప్లాన్‌తో వున్నట్లు చెబుతున్నారు.మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల తేదీలు కూడా వెలువడ్డాయి.అక్టోబర్‌ నెల మొదటి పక్షం అంతానికి అవి ముగుస్తున్నాయి.తెలంగాణపై నిర్ణయానికి అప్పటి దాకా ఆగడమే ఇక మిగిలివుండవచ్చు.

Recent Stories
రాజకీయరంగులు

చంద్రబాబుశైలి బాట
పరిటాలకథ
సోనియా: మూడోపవర్‌ఫుల్‌ లేడీ
టికెట్‌-క్యాన్సిల్‌-ఒకతెలుగమ్మాయి


బాలకృష్ణ ఇంటిదొంగలేనా?
మంద భాగ్యనగరం
తెలంగాణకు ఎర్ర జెండా
ఛానళ్ళా? చేపల చెరువులా?
టిఆర్‌ఎస్‌లో ముసలం?
వార్‌ బహుముఖ విస్తరణ హోంపేజి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+