వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలుగు భాష దుస్ధితి

By Staff
|
Google Oneindia TeluguNews

హోంపేజి టాక్‌ ఆఫ్‌ టుడే జనరల్‌ Friday, August 06 2004

ఇప్పుడున్న పరిస్ధితులు ఇలాగేకొనసాగితే మరో వందేళ్ళకే తెలుగు లిపి లేని భాషగా మారిపోయేప్రమాదముందని ఐక్యరాజ్యసమితే కాకుండా తెలుగు భాషాశాస్త్ర వేత్తలు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోకూడా ఇంగ్లీషు మీడియంను క్రమంగా ప్రవేశపెడతామనిరాష్ట్ర ప్రాధమిక విద్యా శాఖ మంత్రి నేదురుమల్లి రాజ్యలక్ష్మిప్రకటించారు. ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఇంగ్లీషు మీడియంప్రవేశపెడితే తెలుగు భాష అంతరించిపోడానికి మరో యాభై ఏళ్ళుచాలు.

దేశభాషలందు తెలుగు లెస్స అనికృష్ణదేవరాయల ప్రశంస పొందిన తెలుగు భాషకు ఇంతటిదుస్ధితి కలగడానికి కారణం ఆయా ప్రభుత్వాల నిర్లక్ష్యమేకాకుండా ప్రజలకు మాతృభాషాభిమానం లేకపోవడం కూడా.చెన్నై, బెంగుళూరు హైదరాబాద్‌ వంటి నగరాల్లోతెలుగు రాయడం, చదవడం రాని యువజనుల సంఖ్య చాలావేగంగా పెరుగుతోంది. తమిళులు, కన్నడిగులతో పోల్చితేతెలుగు వారికి భాషాభిమానం బాగా తక్కువ. ఇద్దరు తమిళులుకలిస్తే తమిళంలో మాట్లాడుకుంటారు. ఇద్దరు తెలుగు వాళ్ళుఎదురైతే ఇంగ్లీషులో మాట్లాడుకుంటారని ఒక ఛలోక్తి ఉంది.

ఉద్యోగ, వృత్తి అవసరాల కోసంఇంగ్లీషు తదితర భాషలు నేర్చుకొని జీవితంలో రాణించడంఅవసరమే. అయితే తల్లితో సమానమైన మాతృభాషనునిర్లక్ష్యం చేస్తే ఒక జాతి సంస్కృతి వైభవాలు మట్టికలిసిపోతాయి.

తెలుగుభాష నిర్లక్ష్యానికిగురవుతోందనడానికి ప్రబల నిదర్శనం వార్తా పత్రికలు,మేగజైన్ల సర్క్యులేషన్‌ పెరగకపోవడమే.కొత్తతరం వారు ఇంగ్లీషు పత్రికలు చదవడం, వార్తల కోసంటీవీలను ఆశ్రయించడం వల్ల తెలుగుపత్రికలు మనుగడసాగించలేకపోతున్నాయి.

నిరక్షరాస్యులకారణంగానే నిజమైన తెలుగుభాష ఇప్పటికీ మిగిలి ఉందనిప్రముఖ భాషాశాస్త్రవేత్త డాక్టర్‌ బూదరాజు రాధాకృష్ణఅభిప్రాయపడ్డారు. మరో వందేళ్ళతర్వాత తెలుగు కుటుంబాలు ఎలా ఉంటాయని వూహిస్తే విచిత్రంగాఉంటుంది. ఇప్పటికే బిచ్చగాళ్ళు ఇంటికి వస్తే మమ్మీ ఎవరోఅంకుల్‌ వచ్చారు అని ఇంగ్లీషు మీడియం చిన్నారులు చెబుతున్నారు.

వందేళ్ళ తర్వాత పెళ్ళిళ్లలోసంస్కృత మంత్రాలను, తెలుగు వ్యాఖ్యానాలను పురోహితుడుఇంగ్లీషులో రాసుకొస్తాడు. సంక్రాంతి పండుగ షంక్‌ రాన్టిఅయిపోతుంది. హరిదాసులు హారీ డాష్‌లు అయిపోతారు. గారెలు, బూరెలస్ధానంలో కర్రీపఫ్‌లు పిజాలు వస్తాయి.

మన సంస్కృతీ సంప్రదాయాలతో పెనవేసుకునిఉన్న తెలుగుభాషను కాపాడుకోడానికి భాషా పునరుద్ధరణఉద్యమం రావాలి. బయట ఏ భాష మాట్లాడినా ఇంట్లోకి వచ్చేసరికిఅందరూ తెలుగులోనే మాట్లాడాలి. ఏ భాషకైనా నుడికారాలు,జాతీయాలు, సామెతలు ఆత్మలాంటివి. వ్యవహారంలో అవి ఇప్పటికే బాగాక్షీణించిపోయాయి. కొత్తతరంలో తెలుగు భాష మీద అభిమానంకలిగించడానికి సరళంగా ఉంటూనే ఆలోచింపజేసే సాహిత్యంరావలసి ఉంది.

Recent Stories
పాపం వైఎస్‌!
ఇద్దరు
చైతన్య కిడ్నాప్‌ వెనుక...
ఆరుదేశాల్లో ఎన్నారై శాఖ ఆఫీసులు
తెలంగాణకు ఎర్ర జెండా
ఆరుదేశాల్లో ఎన్నారై శాఖ ఆఫీసులు
మొగిలిచెర్లలోవార్‌
సిద్దిపేట సీను
ఆంధ్రపైజయ చిందులు
మణికుమారికిసవతిపోరు!
కొడుకు రాజకీయంపై వైయస్‌
సైకిల్‌దిగిన బాబూఖాన్‌
సమైక్యనినాదం ఊపు
తిరగబడినరాత
బాబుపైబాలయ్య అసంతృప్తి!
సచిన్‌టెండూల్కర్‌ - ఇంటర్వ్యూ హోంపేజి

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X