వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మూడో ఫ్రంట్‌కుబాబు చొరవ?

By Staff
|
Google Oneindia TeluguNews
Chandrababu Naiduహైదరాబాద్‌:చంద్రబాబు నాయుడు బిజెపితో తెగతెంపులుచేసుకోడానికి ఎంతో కాలం పట్టదని రాజకీయపరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. అద్వానీసారధ్యంలోని బిజెపి పక్కా హిందుత్వమార్గంలో పయనించాలని నిర్ణయించడంతోబిజెపితో తెగతెంపులు చేసుకోవాలనిఆయనపై వత్తిళ్ళు పెరుగుతున్నాయి.ఒకప్పుడు సెక్యులర్‌ పార్టీగా పేరున్న తెలుగుదేశంకుబిజెపితో పొత్తు కారణంగా ఇప్పుడు అప్రతిష్టవస్తుందని టిడిపి నాయకులుభయపడుతున్నారు.

బిజెపి కేంద్రంలోఅధికారంలో ఉన్నప్పుడు కూడా ఎన్నిసార్లు ఆహ్వానించినా టిడిపిఎన్డీయే ప్రభుత్వంలో చేరలేదు. వెలుపలనుంచి మద్దతుఇవ్వడం ద్వారా టిడిపి తన సెక్యులర్‌ఇమేజిని కొంతవరకు కాపాడుకుంది. సంఘ్‌పరివార్‌ హిందుత్వ ప్రకటలను టిడిపి ఖండిస్తూవచ్చింది. గత ఎన్నికల్లో టిడిపి-బిజెపి పొత్తులాభించలేదు. ఇసుక తక్కెడ, పేడ తక్కెడలాగారెండు పార్టీలు మారిపోయాయి. చాలా నియోజకవర్గాల్లోఉభయ పార్టీల నాయకులుపరస్పరం సహకరించుకోలేదు. వెంకయ్యనాయుడి కారణంగా టిడిపి-బిజెపిమైత్రి కేంద్ర స్ధాయిలో పటిష్టంగా ఉండేది.ఇప్పుడు వెంకయ్య నాయుడు బిజెపి అధ్యక్షస్ధానం నుంచి తప్పుకోవడంతో ఆయనమాటకు అటు బిజెపిలో గానీ ఇటు టిడిపిలో గానీపెద్ద విలువ ఉండదు.

త్వరలోమున్సిపల్‌ ఎన్నికలు జరగనున్నందునబిజెపితో పొత్తు విషయంలో త్వరలో ఒక నిర్ణయంతీసుకోవాలని చంద్రబాబు ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.అయితే ఆయనబిజెపిని విడిచి పెట్టినంత మాత్రానఆయనతో జత కట్టడానికి కమ్యూనిస్టులుసిద్ధంగా లేరు. చంద్రబాబు నాయుడుప్రపంచ బ్యాంకు ఏజెంటని, ఆయన కంటేకాంగ్రెస్‌ నయమని కమ్యూనిస్టులఅభిప్రాయం.

రాష్ట్రంలోమరో నాలుగున్నర ఏళ్ళ వరకు చేయడానికిఏమీ ఉండ దు కాబట్టి కేంద్రరాజకీయాల్లో పావులు కదపాలని చంద్రబాబునాయుడు యోచిస్తున్నారు. కేంద్రంలోమన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వం ఎప్పుడైనాపడిపోయే అవకాశాలు కన్పిస్తున్నందునఅక్కడ మూడో ఫ్రంట్‌ ఏర్పాటుకు అంకురార్పణచేయాలని, భావసారూప్యత గల పార్టీలనుకూడ గట్టాలని చంద్రబాబు నాయుడు ఆలోచిస్తున్నారు.

చింత చచ్చినా పులుపు చావలేదు..
చంద్రబాబు యూరప్‌ యాత్ర
తెలంగాణకు ఎర్ర జెండా
ఆరుదేశాల్లో ఎన్నారై శాఖ ఆఫీసులు
మొగిలిచెర్లలో వార్‌
సిద్దిపేట సీను
ఆంధ్రపై జయ చిందులు
మణికుమారికి సవతిపోరు!
కొడుకు రాజకీయంపై వైయస్‌
సైకిల్‌ దిగిన బాబూఖాన్‌
సమైక్య నినాదం ఊపు
తిరగబడిన రాత
బాబుపై బాలయ్య అసంతృప్తి!
సచిన్‌ టెండూల్కర్‌ - ఇంటర్వ్యూ

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X