గులాబీ పోరు
హోంపేజి
టాక్ ఆఫ్ టుడే
కాంగ్రెస్ Tuesday, June 22 2004
హైదరాబాద్:తెలంగాణ రాష్ట్రసమితి (టిఆర్‌యస్) తీరుపై కాంగ్రెస్‌నాయకులు గుర్రుగా వున్నారు. టిఆర్‌యస్‌పై వారు నిప్పులుకురిపిస్తున్నారు. కాంగ్రెస్ కోస్తానాయకులే కాకుండా తెలంగాణనాయకులు కూడా టి ఆర్‌యస్‌వ్యవహారశైలిపై బహిరంగంగానేవిమర్శలకు దిగుతున్నారు. అయితేటి ఆర్‌యస్‌పై కాంగ్రెస్ నాయకులమాటలు గాలికే కొట్టుకుపోతున్నాయి.కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీవద్ద టి ఆర్‌యస్ అధినేత కె.చంద్రశేఖర్ రావు సంపాదించినపలుకుబడి కూడా వారికి మింగుడుపడడం లేదు.
తాజాగా టిఆర్‌యస్‌కు ఇచ్చే మంత్రి పదవులపైకాంగ్రెస్ నాయకులు విమర్శలుచేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రఏర్పాటుకు తొంబై శాతం సానుకూలఅభిప్రాయం తమ వల్లనే వచ్చిందనిచంద్రశేఖర్ రావు చేసినప్రకటనపై కాంగ్రెస్ తెలంగాణప్రాంతీయ సమన్వయ కమిటీ (టిఆర్‌సిసిసి) నాయకుడు కోదండరెడ్డిమంగళవారం విలేకరులసమావేశంలో విమర్శించారు. ఈవిషయంలో తమ పాత్ర చాలావున్నదని ఆయన చెప్పుకున్నారు.బహుశా ఈ మాటలను టి ఆర్‌యస్‌నాయకులు ఖాతరు చేస్తారనిఅనుకోలేం.
ఇకపోతే, టి ఆర్‌యస్ రాష్ట్రంలో ఆరుమంత్రిపదవులు, ప్రభుత్వ విప్‌పదవి ఇవ్వడం సమంజసం కాదని కోస్తాకాంగ్రెస్ శాసనసభ్యులు ద్రోణంరాజుసత్యనారాయణ, గాదెవెంకటరెడ్డి, దేవినేని రాజశేఖర్‌సోమవారం విలేకరులతో అన్నారు.పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారంకోస్తా, రాయలసీమ ప్రాంతాలకు కలిపిఅరవై శాతం, తెలంగాణకు నలబైశాతం మంత్రి పదవులు దక్కాలని, ఈప్రకారం తెలంగాణకు పద్దెనిమిదిమంత్రి పదవులే వస్తాయని,ఇప్పటికే తెలంగాణ నుంచి కాంగ్రెస్‌కుచెందిన పది మంది మంత్రులున్నారని,టి ఆర్‌యస్‌కు ఆరు మంత్రి పదవులుఇస్తే కాంగ్రెస్‌కు చెందిన మరోఇద్దరికి మాత్రమే అవకాశంలభిస్తుందని, దీని వల్ల తెలంగాణకుచెందిన కాంగ్రెస్ శాసనసభ్యులకునష్టం జరుగుతుందనివారన్నారు.
మరోసంశయాన్ని కూ డా వారు వ్యక్తంచేశారు. మంత్రులుగా చేరినతర్వాత టిఆర్‌యస్‌వారుమొత్తం రాష్ట్రానికి ప్రాతినిధ్యంవహిస్తారా, తెలంగాణకేపరిమితమవుతారా అనేది వారిసంశయం. యావత్తు రాష్ట్రానికివారు ప్రాతినిధ్యం వహించాలని వారుకోరారు. వీరి ప్రకటనకు ముందేకాంగ్రెస్ తెలంగాణ ప్రాంతీయసమన్వయ కమిటీ నాయకుడు కె.కేశవరావు టి ఆర్‌యస్ తీరుతీవ్రంగా ధ్వజమెత్తారు. శాఖలపై కూడాటి ఆర్‌యస్ మొండిపట్టు పట్టడం వారికిసుతారామూ నచ్చడం లేదు.
వీరికిజవాబుగా టి ఆర్‌యస్ శాసనసభాపక్షం నాయకుడు విజయరామారావుమంగళవారం విలేకరులసమావేశం ఏర్పాటు చేసి తమ వైఖరినిసమర్థించుకున్నారు. తాముమొత్తం రాష్ట్రానికి ప్రాతినిధ్యంవహిస్తామని ఆయన స్పష్టం చేశారు.రాష్ట్ర విభజన సమయంలో ఆస్తులపంపకంపై కాపలాదార్లుగావ్యవహరించడానికే తాము మంత్రివర్గంలో చేరుతున్నామని ఆయనమరోసారి స్పష్టం చేశారు. దీన్ని కూడాకాంగ్రెస్‌వారు తప్పుపడుతున్నారు.
తెలంగాణవ్యవహారంలో మొత్తంగాలాభపడింది టి ఆర్‌యస్ అనేఅభిప్రాయం తెలంగాణ కాంగ్రెస్‌నాయకుల్లో బలంగా నాటుకుపోయింది. టిఆర్‌యస్‌తో పొత్తు కోసం పట్టుబట్టినకాంగ్రెస్ తెలంగాణ ప్రాంతీయ కమిటీనాయకులకు పదవులకుదూరంగానే ఉండిపోవాల్సిన పరిస్థితిఏర్పడింది. జి. చిన్నారెడ్డి, ఎ. ఇంద్రకరణ్‌రెడ్డి లాంటివారికి మంత్రి పదవులుదక్కకపోవడంపై చాలా మందికక్కలేక మింగలేకసతమవుతున్నారు. దీనికి తోడు,చాలా మంది సీనియర్‌శాసనసభ్యులకు కూడా మంత్రిపదవులు దక్కే పరిస్థితి లేదు. పైగాఅసమ్మతి ఎత్తులు మునుపటిలా పారేఅవకాశాలు కూడాకనుమరుగయ్యాయి.
మొత్తంను రాష్ట్ర కాంగ్రెస్‌కునాయకుల పాలిటి శాపంగా మారింది.క్ష!్ర్ఛnఛీజీజ్ఙా
- నెలరాజు వైఎస్
- మారువేషంలోవెళ్ళొచ్చు కదా?
- ఎవరు గొప్ప?
- ఆచితూచి అడుగులు
- సవాళ్ళు ఎన్నో...












Click it and Unblock the Notifications
