వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్‌సర్కారా? కాంట్రాక్టర్ల సర్కారా?

By Staff
|
Google Oneindia TeluguNews
YSRహైదరాబాద్‌:వైఎస్‌ రాజశేఖరరెడ్డి నాయకత్వంలోనికాంగ్రెస్‌ ప్రభుత్వం పైకి ప్రజాప్రభుత్వంగా కన్పిస్తున్నా కాంట్రాక్టర్లప్రభుత్వంగా మారిందన్న వాస్తవాన్నిఒక ప్రముఖ టీవీ ఛానల్‌ శనివారంఉదయం బట్టబయలు చేసింది. సిండికేట్‌గాఏర్పడిన ఇరిగేషన్‌ కాంట్రాక్టర్లుశుక్రవారం రాత్రి నగరశివారులోని ఒకఫాంహౌస్‌లో సమావేశం కావడాన్ని ఈ ఛానల్‌చిత్రీకరించింది. కాంట్రాక్టర్లతో ముడుపులకోసం వైఎస్‌ కుమ్మక్కు అయ్యారనితెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఢిల్లీలో ప్రకటించిన కొన్ని గంటలసమయంలోనే కాంట్రాక్టర్ల సిండికేట్‌టీవీ ఛానల్‌ కెమెరాలకు చిక్కింది.

నవగ్రహాలవంటి తొమ్మిది మంది పెద్దకాంట్రాక్టర్లు అధికారులు తయారు చేయాల్సినఎస్టిమేట్లను తామేతయారు చేస్తున్నారన్న విమర్శలుఉన్నాయి. ఈ నవగ్రహాలు రాజశేఖరరెడ్డిప్రతిష్టను దెబ్బతీస్తాయని అంటున్నారు. ప్రాజెక్టులు అన్న తర్వాతనిధులు,ఉంటాయని, కాంట్రాక్టర్లూ ఉంటారని వీటిపైఅక్రమాలు జరగకపోయినా ఆరోపణలురావడం సహజమని కాంగ్రెస్‌ నాయకులు అంటున్నారు.

భారీగాముడుపులు తీసుకుని పవర్‌ ప్లాంట్లతో విద్యుత్‌కొనుగోలు ఒప్పందాలు చేసుకున్న చంద్రబాబునాయుడికి తమనువిమర్శించే నైతిక అర్హత లేదని వీరివాదన. చంద్రబాబు హయాంలో ఇరిగేషన్‌ప్రాజెక్టులకు ప్రాధాన్యతలేనందువల్ల నవగ్రహకాంట్రాక్టర్లు అప్పుడు తెరమీదికిరాలేదని, టిడిపి హయాంలో ఈ టెండర్లవచ్చినా ఈ నవగ్రహాలదే పైచేయిగాఉండేదని, ఏ ప్రభుత్వాలనైనా తమగుప్పిట్లో ఉంచుకోగల శక్తి ఈ కాంట్రాక్టర్లరింగ్‌కు ఉందని నీటిపారుదల శాఖలోని ఒక సీనియర్‌ అధికారివ్యాఖ్యానించారు.

ఇప్పుడుసచివాలయంలోను, వివిధ హోటళ్ళలోనూకడప జిల్లాకు చెందిన పైరవీకారులుపెద్ద ఎత్తున దందాలు చేస్తున్నట్టుస్పష్టంగా కన్పిస్తున్నది. వీరి వల్లతనకు చెడ్డ పేరు వస్తుందన్నవిషయం తెలిసినా ముఖ్యమంత్రి రాజకీయమొహమాటాల కారణంగా ఏమీఅనలేకపోతున్నారని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి.

ఒకఅడుగు ముందుకు, రెండు వెనక్కి!
పవర్‌ ప్లస్‌పవర్‌
సమాంతరశక్తులు!
ఇందిరమ్మభూమి
ఇదొకరాజ్యకీయం.
అవినీతి వికేంద్రీకరణ
కాంగ్రెస్‌-టిఆర్‌ఎస్‌ కటీఫ్‌?
సోదరహాసం
ఐటీమీద వైఎస్‌ దృష్టి
త్తెకాలపు సత్తెన్న
కప్పల తక్కెడ
మూడోపవర్‌ఫుల్‌ లేడీ
టికెట్‌-క్యాన్సిల్‌-ఒకతెలుగమ్మాయి


బాలకృష్ణ ఇంటిదొంగలేనా?
మంద భాగ్యనగరం
తెలంగాణకు ఎర్ర జెండా
ఛానళ్ళా? చేపల చెరువులా?
టిఆర్‌ఎస్‌లో ముసలం?
వార్‌ బహుముఖ విస్తరణ
ఎమ్యెల్యేకుకోటి!
ప్రత్యేక వ్యూహం!
వైఎస్‌ అసహనం

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X