వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైఎస్‌పాలపై పూలూ, రాళ్ళు

By Staff
|
Google Oneindia TeluguNews

హోంపేజి టాక్‌ ఆఫ్‌ టుడే కాంగ్రెస్‌ 17-10-2005

హైదరాబాద్‌:రాష్ట్రంలో అంతా సవ్యంగా లేదంటూ మాజీముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడునాదెండ్ల భాస్కరరావుఇటీవల బయటపడ్డారు. రాష్ట్రంలో వైఎస్‌రాజశేఖరరెడ్డి ప్రభుత్వ పాలనతీరుపై కాంగ్రెస్‌ సీనియర్లు సమీక్షించవలసి ఉందన్నఅర్ధం వచ్చేలా ఆయన మాట్లాడారు.పోతిరెడ్డిపాలెం జీవోను ఆయన తీవ్రంగావిమర్శించారు. దీనిపై సోనియాగాంధీని కలిసివివరించనున్నట్టు ఆయన చెప్పారు. నాదెండ్ల తదితర పెద్దమనుషులుఇప్పట్లో క్యాంపులు నిర్వహించే అవకాశాలులేవు. మంత్రివర్గ విస్తరణఅనంతరమే అసమ్మతి ఒక రూపం దాల్చవచ్చు. బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలు ముగిసినతర్వాతే రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ఉంటుంది.

అధిష్టానవర్గంవద్ద వైఎస్‌ హవా బాగా నడుస్తున్న ఈసమయంలో అసమ్మతి అంటూ ఎవరూ ముందుకువచ్చే సాహసం చేయడం లేదు. మరి నాదెండ్ల ఎందుకుసాహసించినట్టు? నాదెండ్ల భాస్కరరావు ఈసమయంలో ఏం మాట్లాడినా జరిగే నష్టంలేదు కాబట్టి. నేదురుమల్లిజనార్ధనరెడ్డి, పి.జనార్ధనరెడ్డి కూడావైఎస్‌కు వ్యతిరేకంగా ఉన్నప్పటికీవారు బయటికి వచ్చి మాట్లాడడం లేదు. అధిష్టానవర్గంవద్దవైఎస్‌కు అనీ ప్లస్‌ పాయింట్స్‌ ఉన్నా నక్సలైట్లతోచర్చలు విఫలం కావడం సోనియాగాంధీకినచ్చలేదు. ఈవిషయమై ఆమె రాజశేఖరరెడ్డిని ఇటీవలగట్టిగా నిలదీశారు. చర్చలకు ఆయుధమే అడ్డంకి అనుకున్నప్పుడు ఆవిషయం గురించి ముందే ఆలోచించి ఉండాల్సిందనిఆమె అభిప్రాయపడ్డారు. మిగితా క్రిస్టియన్లలాగానే ఆమె శాంతిని కోరుకుంటున్నారు. అయితే సంక్లిష్టమైననక్సలైట్‌ సమస్యకు అంత తేలికగాపరిష్కారమార్గం కన్పిస్తుందని ఆమెఆశించకూడదు.

రేపటినుంచి జరుగనున్న ఆర్టీసీ సమ్మె కూడావైఎస్‌ ప్రభుత్వానికి పెద్ద సవాలుకానుంది. ఈ సంవత్సరం వర్షాలు బాగాపడడంతో పల్లె పట్టులు పచ్చగా ఉండడంవైఎస్‌కు కలిసొచ్చిన అంశం. ప్రతిపక్షతెలుగుదేశం నిస్తేజంగా ఉండడం కూడాఆయన కు సంతోషం కలిగిస్తున్న అంశం.నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణమేపెద్ద ఎజెండాగా సాగుతున్న కాంగ్రెస్‌ప్రభుత్వాన్ని ఈ విషయంలో విమర్శించేసాహసాన్ని ప్రతిపక్షం చేయలేకపోతోంది.ప్రాజెక్టులను వ్యతిరేకిస్తే ప్రజావ్యతిరేకులమన్న అప్రతిష్ట వస్తుందేమోనని భయపడుతోంది.

ఇటీవలి కథనాలు హోంపేజి

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X