Home
దీనిపైహైకోర్టును ఆశ్రయించాలని,అవసరమైతే దర్యాప్తు బాధ్యతను సిబిఐకి అప్పగించాలనిదినేష్‌రెడ్డి యోచిస్తున్నారు. ఈ కేసునుఅప్పటి కమిషనర్ నాయకత్వంలో నగరపోలీసులు సరిగా దర్యాప్తుచేయలేదన్న అభిప్రాయాన్ని దినేష్‌రెడ్డిపరోక్షంగా వ్యక్తం చేశారు. అయితే ఈకేసును తిరగదోడడమంటే చేతులుకాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టే.ఎందుకంటే ఫోరెన్సిక్ నిపుణులకు పోలీసులుఅప్పగించిన వస్తువులేమిటో తెలియదుకానీ ఆ నివేదిక బాలకృష్ణకు అనుకూలంగావచ్చినట్టు తెలిసింది.
దినేష్‌రెడ్డికేసును తిరగదోడడం వల్ల మళ్ళీమధ్యవర్తులు లాభపడేఅవకాశముంది. బాలకృష్ణకు సమయంఎంతో విలువైనది కాబట్టి ఆయనకు మళ్ళీహైకోర్టు చుట్టూ తిరిగే ఓపిక ఉండదు.కోర్టును తప్పుదోవ పట్టించారంటూ బెల్లంకొండ, చౌదరిలపైపోలీసులు పెట్టిన కేసులు కూడా నిలబడే అవకాశంలేదు. బాలకృష్ణ ఇంట్లో కాల్పుల కేసునే కాకఆయన ఇంటి ఆవరణలో సెక్యూరిటీ గార్డులోక్‌నాథ్ సాహిల్ హత్య కేసులో కూడాసాక్ష్యాధారాలను నగర పోలీసులుసరిగా సేకరించలేదు. గార్డుకుఅంత్యక్రియలు జరిగిన నాడే ఆ కేసు సమాధిఅయిపోయింది. దానాదీనా తేలిందేమిటంటేప్రముఖులు ఇన్‌వాల్వ్ అయిన కేసులు టీవీఛానళ్ళకు వినోదం, సంబంధితులకు ధనయోగంకలిగిస్తాయని.












Click it and Unblock the Notifications