మంత్రి వర్గ విస్తరణ!
హోంపేజి
టాక్ ఆఫ్ టుడే;/SPAN>
కాంగ్రెస్ 31-01-2006
హైదరాబాద్: కేంద్రమంత్రి వర్గ విస్తరణ రాష్ట్రానికి సంబంధించినంత వరకు అస్తవ్యస్ధంగా ఉంది. సీనియారిటీకి, ప్రతిభకు విలువలేకుండా సోనియా కుటుంబానికి వంది మాగధులుగా ఉన్నవారికే రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రులుగా అవకాశం దొరికినట్టు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విస్తరణ రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీల్లో పెను దుమారమే రేపింది. ఇటు వైఎస్‌కు, అటు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఎన్ జనార్ధనరెడ్డికి ప్రాధాన్యం ఇవ్వకుండా అధిష్టానవర్గం బ్యాలెన్స్ చేసినప్పటికీ సామాజిక వర్గాలను బ్యాలెన్స్ చేయలేకపోయింది. రాష్ట్రం నుంచి కేంద్రంలో మంత్రి పదవులు దక్కిన వారిలో ఒక్కరు కూడా వెనుకబడిన వర్గాలకు చెందిన వారు లేకపోవడం పట్ల ఆ వర్గాల్లో నిరసన వ్యక్తమవుతోంది.
జైపాల్‌రెడ్డి, రేణుకాచౌదరి ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్‌లోకి వలస వచ్చి మంత్రి పదవులు పొందారు. దగ్గుబాటి పురంధరేశ్వరి కూడా నూరుశాతం కాంగ్రెస్ వాదిగా కన్పించడం లేదు. మంత్రివర్గ విస్తరణపై ఏలూరు కాంగ్రెస్ ఎంపీ కావూరి సాంబశివరావు అధిష్టానంపై విరుచుకుపడడం కాంగ్రెస్‌లో చర్చనీయాంశమైంది. కమ్మ వర్గానికి చెందిన వారైనప్పటికీ కావూరి సాంబశివరావు, రాయపాటి సాంబశివరావు చిత్తశుద్ధితో టిడిపికి వ్యతిరేకంగా, కాంగ్రెస్ పక్షాన గట్టిగా నిలబడిన మాట వాస్తవం. ఇప్పుడు పార్టీలో వారికి ప్రాధాన్యం ఇవ్వకపోవడం వారికి బాధ కలిగించే అంశమే. సుబ్బరామిరెడ్డి వంటి పవర్ బ్రోకర్లకు మంత్రివర్గంలో అవకాశం లభించింది. తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఉన్న దాసరి నారాయణరావును, రేణుకా చౌదరిని మంత్రివర్గంలో కొనసాగించడం కూడా విమర్శలకు తావు ఇచ్చింది. రాష్ట్రానికి ముఖ్యమైన శాఖలు దక్కకపోవడం మరో ముఖ్యమైన అంశం.
మంత్రిపదవిని ఆశించి భంగపడిన వారంతా త్వరలో ఢిల్లీలో సమావేశం కానున్నారు. కేంద్ర కేబినెట్‌లో బెర్త్ ఆశించిన మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధనరెడ్డి వ్యూహాత్మకంగా పావులు కదపనున్నారు. పార్టీ పదవి అప్పగిస్తే నిరాకరించకుండా తీసుకుని, ఇక్కడ వైఎస్ రాజశేఖరరెడ్డి పునాదులను కదపడానికి ఆయన ప్రయత్నించవచ్చు. వెన్నెముక లేని వి. హనుమంతరావు పార్టీ పదవితో సరిపెట్టుకుని, సోనియా భజన కొనసాగిస్తారు. రాష్ట్ర కాంగ్రెస్‌లో కలకలాన్ని అధిష్టానవర్గం జాగ్రత్తగా పరిశీలిస్తోంది.
ఇటీవలి కథనాలు హోంపేజి












Click it and Unblock the Notifications
