వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మరింత సంఘసేవకు చిరు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:ఎన్టీఆర్‌ 83వ జయంతిని రాష్ట్ర ప్రజలు జరుపుకుని,ఆ మహనీయుడికి ఘనంగా నివాళి ఘటించారు.పేదవాడికి కూడు, గూడు నినాదంతో 22ఏళ్ళ క్రితం ఆయన వ్యవస్ధాపించిన తెలుగుదేశంపార్టీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంది. ఎన్టఆర్‌ఉన్నప్పటి తెలుగుదేశం విధానాలు ఇప్పుడుమారిపోయాయి. చంద్రబాబు నాయుడు తొమ్మిదేళ్ళకాలంలో ఆర్ధిక సంస్కరణలను వేగంగాఅమలు చేయడంతో గ్రామీణ ఆర్ధికవ్యవస్ధ దెబ్బతింది. తెలుగుదేశం పార్టీకిఅండగా నిలిచిన వెనుకబడిన వర్గాలప్రజలు గత ఎన్నికల్లో టిడిపికి దూరమయ్యారు.టిడిపి ప్రభుత్వం ప్రాధాన్యతలవిషయంలో తప్పటడుగు వేసి, కొన్ని రంగాల్లోఅభివృద్ధి మీద అదేపనిగా ప్రచారం చేసింది.ఆ ప్రచారం ఫలితంగా సామాన్యులు ఇదిమనది కాని ప్రభుత్వం అనుకున్నారు.

ఎక్కడతప్పు చేశామో, తమకు ఏ ఏ వర్గాలు దూరమయ్యారోతెలుగుదేశం అధినాయకుడు గ్రహించారు.సడన్‌గా హైటెక్‌ నుంచి అగ్రిటెక్‌కు మారడంబాగుండదని ఆయన ఏడాది వేచి ఉన్నారు. ఇకమీదట ఆయన మళ్ళీ ఎన్టీఆర్‌ విధానాలను తుచ తప్పకుండా అనుసరించే అవకాశముంది.నేటి మహానాడులో కూడా వ్యవసాయ రంగంమీద దృష్టి పెట్టారు. తెలుగుదేశం క్రమంగాబిజెపికి దూరమై లెఫ్ట్‌కు చేరువకావాలని ప్రయత్నిస్తోంది. అయితే చంద్రబాబునాయుడు గ్రామీణ, శ్రామిక వ్యతిరేకవైఖరిని ఇంకా మర్చిపోలేకపోతున్న లెఫ్ట్‌పార్టీలు టిడిపితో జత కట్టడానికి జంకుతున్నాయి.

ఎన్టీఆర్‌స్ఫూర్తితో ప్రజలకు దగ్గరవుదామనిమహానాడులో చంద్రబాబు నాయుడు పిలుపు ఇచ్చారు.పార్టీకి కాయకల్ప చికిత్స జరిగితే కానీప్రజలకు దగ్గరవడం సాధ్యం కాదు.సుదీర్ఘకాలం అధికారంలో ఉండడం వల్లటిడిపి నాయకులు మినీ నవాబులుగా మారారు.వారు రానున్న కాలంలో కొన్ని త్యాగాలు చేయాలి.చంద్రబాబు నాయుడిలో కూడా కొన్ని సానుకూలమార్పులు రావాలి. నేల విడిచి సాము చేసే ధోరణినిఆయన మానుకోవాలి. వంది మాగధులనుదూరం పెట్టాలి. మేధావులుఇచ్చే డేటా మీద ,విశ్లేషణ మీద ఆయనకున్న పిచ్చివదలాలి. సామాన్యుడితో కలిసి శ్వాసించి,ఆలోచించినప్పుడే ఎన్టీఆర్‌కు ఘనమైన నివాళి.ఆనాడు చంద్రబాబు నాయుడు విధానాలు కానీ,ఈనాటి వైఎస్‌ విధానాలు కానీ ఏవీ నూటికి నూరుశాతం దోష రహితం కావు. ఎవరి లోపాలువారికున్నాయి. కానీ రాజకీయ పార్టీలన్నీ ప్రజా శ్రేయస్సుకోసం పాటుపడితే ప్రజాస్వామ్యం బలపడుతుంది.ఒకరి మీద ఒకరు బురద జల్లుకోవడంవల్ల రాజకీయాలై సామాన్యులకు ఏవగింపుకలుగుతుంది.

ఇటీవలికథనాలు

  • మాస్టర్‌ ప్లాన్‌!
  • చక్రబంధంలో చంద్రబాబు
  • చంద్రబాబుకుకేంద్ర రక్షణ!
  • పరిటాల రాజకీయ వైరాగ్యం
  • మా తెలుగు బాబుకు చాడీల దండ!
  • ఇక బాబు రోడ్‌షోలు
  • టిడిపి గుండెల్లో ఏలేరురైళ్ళు
  • చంద్రబాబుతురుపుముక్క
  • ఎన్టీఆర్‌ గుర్తున్నాడా?
  • సైకిల్‌కుఅసమ్మతి బ్రేక్‌లు
  • చిరంజీవిరహస్య ఎజెండా?

  • అస్పష్ట రాజకీయ చిత్రం
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X