రాజశేఖరచరిత్రలో చిరు!!
విజయవాడ లోక్‌సభస్ధానం టిడిపి అభ్యర్ధి సి. అశ్వనీదత్‌కుచిరంజీవి పరోక్షంగా మద్దతు ఇచ్చినాఆయన కాంగ్రెస్ గాలిలో ఓడిపోక తప్పలేదు.తెలుగుదేశం పార్టీ ఓడిపోయినప్పటి నుంచిచంద్రబాబు, చిరంజీవిలది ఎవరి దారివారిదే అయింది. ఆ తర్వాత సినిమా రంగానికిసంబంధించిన ముఖ్యమైన అంశాల మీదవినతి పత్రం సమర్పించడానికి రెండుసార్లు చిరంజీవి ఇతర సినిమా ప్రముఖులతోపాటు ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డినికలిశారు. అంతే తప్ప ఆయన చంద్రబాబుతోసన్నిహితంగా ఉన్నంత వైఎస్‌తో ఎప్పుడూలేరు. ఇప్పుడు వైఎస్‌తో ఏకంగా కడపపర్యటనకు బయలుదేరడం వెనుకచిదంబర రహస్యమేదైనా ఉందా?పద్మవిభూషణ్ జాబితాలో చిరంజీవి పేరు ఉందనిఒక ప్రముఖ పత్రిక ప్రచురిస్తే చిరంజీవి అభిమానులు సంబరపడిపోయారు. తీరాఅధికారికంగా ప్రకటించిన జాబితాలో ఆయనపేరు లేదు. సాధారణంగా ఇటువంటి పురస్కారాల వెనుక రాజకీయపలుకుబడులు పనిచేస్తాయన్న విషయంలోకవిదితమే. ఆనాడు చంద్రబాబుతో సన్నిహితంగా ఉన్నందువల్లనే ఢిల్లీనాయకులు చిరంజీవి పేరు తొలగించారని, నటుడిగానే గాకసామాజిక సేవ చేస్తున్న ఆయన ఆ పురస్కారానికిఅర్హుడని అభిమానులు వాదిస్తున్నారు. చిరంజీవిగతంలో తనపై పడిన చంద్రబాబుముద్రను తొలగించుకోడానికి వైఎస్‌తోకలిసి వెళ్తున్నారా? సమాజహితం కోసంఎవరితో కలిసి పనిచేసినా తప్పులేదనుకుంటున్నారా? గతంలో ఆయన చంద్రబాబుతోసన్నిహితంగా ఉండడంఆయన అభిమానులో అధిక శాతానికి నచ్చలేదు.కొన్ని అభిమాన సంఘాలు ఆయనకు ఈ విషయంలోబహిరంగ లేఖలురాశాయి. సమాజహితం కోసం చిరంజీవి ఏం చేసినా ఆయన లక్షలాదిఅభిమానులకు అభ్యంతరంఉండదని నిరభ్యంతరంగా చెప్పవచ్చు. కానీ ఆయన రాజకీయాల్లోపరోక్షంగా అయినా పాల్గొన్నప్పుడే వారికిమనస్తాపం కలుగుతుంది. కడపఉత్సవాలలో సమాజహితం కోసం చిరంజీవిఎటువంటి సందేశం ఇవ్వనున్నారో వేచి చూడాలి.












Click it and Unblock the Notifications