వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హాస్యనటులు కెసిఆర్‌,నరేంద్ర!

By Staff
|
Google Oneindia TeluguNews

హోంపేజి టాక్‌ ఆఫ్‌ టుడే రాజకీయాలు 17-01-2006

హైదరాబాద్‌:ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్నకాంగ్రెస్‌ ప్లీనరీ సమావేశాల్లోతెలంగాణ రాష్ట్ర ప్రస్తావన ఉంటుందా? ఇదిఇప్పుడు కోటి రూపాయల ప్రశ్న. రాష్ట్రంలోచాలా ఏళ్ళ తర్వాత జరుగుతున్న అఖిలభారత కాంగ్రెస్‌ కమిటీ ప్లీనరీ సమావేశాల్లో ప్రస్తుతం రాష్ట్రంలో హాట్‌టాపిక్‌గా ఉన్న తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుఅంశాన్ని విస్మరించడం సాధ్యమేనా?

తెలంగాణ రాష్ట్రంఏర్పాటుకు కాంగ్రెస్‌ ఒప్పుకోకపోతేరాష్ట్రంలో ప్రళయ బీభత్సమే జరుగుతుందని సోమవారంతెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు,కేంద్ర మంత్రి చంద్రశేఖరరావుతన సహజ శైలిలో వ్యాఖ్యానించారు. దీనిపైకాంగ్రెస్‌ అధిష్టానవర్గం తనసహజ ధోరణిలో మౌనం వహించింది.కాంగ్రెస్‌ హైకమాండ్‌ దృష్టిలో ఇప్పుడుచంద్రశేఖరరావు, నరేంద్రలుగుడిపూడి జంగాలు. ఇంకా చెప్పాలంటేహాస్యనటులు. అందుకే రాష్ట్ర కాంగ్రెస్‌వ్యవహారాల ఇంచార్జి దిగ్విజయ్‌ సింగ్‌ కర్రవిరగకుండా పాము చావకుండా మాట్లాడుతున్నారు. కెసిఆర్‌,నరేంద్రలు కేంద్ర మంత్రివర్గంలోకొనసాగాలంటూనే ఆయన తెలంగాణరాష్ట్రం విషయంలో మాత్రం గోడమీదపిల్లిలా వ్యవహరిస్తున్నారు. మరోకేంద్ర మంత్రి రఘువంశ్‌ ప్రసాద్‌మాత్రం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుదాదాపు సాధ్యం కాదనే చెబుతున్నారు. ఏది ఏమైనా ఒకటిమాత్రం వాస్తవం. సోనియాగాంధీతలచుకుంటే తెలంగాణ రాష్ట్రంఏర్పాటు ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ అంశంపైఆమె నిర్ణయం, కనీసం ఆలోచనా ధోరణిఏమిటో కెసిఆర్‌కు గానీ, వైఎస్‌కు గానీ, చివరికిదిగ్విజయ్‌ సింగ్‌కు కానీతెలియదన్నది స్పష్టం.

కాంగ్రెస్‌అవకాశవాద రాజకీయాలకు, చంద్రశేఖరరావు అధికారలాలసతకు పరాకాష్ట తెలంగాణఅంశం. కాంగ్రెస్‌ ప్లీసరీ సమావేశాల్లోతెలంగాణ అభివృద్ధి అంశాన్ని మాత్రమేప్రస్తావించే అవకాశమున్నట్టుఅత్యంత విశ్వసనీయంగా తెలిసింది.రెండో ఎస్సార్సీ ఏర్పాటు చేయనున్నట్టుప్రకటించే అవకాశం కూడాలేకపోలేదు. అదే జరిగితే కేంద్ర మంత్రిపదవులకు రాజీనామా చేసి,తెలంగాణ జాగరణ సేన ద్వారా గల్లీగల్లీలో ఉద్యమం చేస్తామని చంద్రశేఖరరావు,నరేంద్రఅంటున్నారు. ఏం జరుగనున్నదో మరి కొద్దిరోజుల్లో స్పష్టమవుతుంది.

ఇటీవలికథనాలు హోంపేజి

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X