తెలంగాణటిడిపి నేతల పగటి కలలు
తెలుగుదేశంపార్టీ చంద్రబాబు నాయుడు చేతులు దాటిపోతోందా? మిగితా ప్రాంతాలమాట ఎలా ఉన్నాతెలంగాణ లో అదే పరిస్ధితి తలెత్తేలాఉంది. నీటిపారుదల ప్రాజెక్టుల విషయంలోతెలంగాణకు అన్యాయం జరుగుతోందని,ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డితెలంగాణకు బద్ధ విరోధిగా ఉన్నారనితెలంగాణ రాష్ట్ర సమితి నాయకులతో పాటుతెలుగుదేశం నాయకులుఏకాభిప్రాయంతో ఉన్నారు. కాంగ్రెస్‌అనుసరిస్తున్న ఈ ధోరణికి నిరసనగాటిఆర్‌ఎస్ నాయకులతో లోపాయికారీగా పనిచేయడానికి కొందరు తెలంగాణటిడిపి నాయకులు సంసిద్ధంగా ఉన్నట్టుతెలుస్తోంది. సమైక్యాంధ్ర టిడిపినినాదమైనప్పటికీ, అధినేత చంద్రబాబునాయుడి కి ఆగ్రహంకలిగినప్పటికీ తెలంగాణ ప్రయోజనాలకోసం కృషి చేయాలని వీరు భావిస్తున్నారు.
మొన్నటిమునిసిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఎక్కువగా సీట్లు వచ్చి ఉంటేచంద్రబాబును కలలో కూడా ఎదిరించడానికివీరు సాహసించి ఉండేవారు కాదు. చంద్రబాబుహయాంలో టిడిపికి మళ్ళీస్వర్ణయుగం వచ్చే అవకాశంలేదన్న నిరాశలో కొట్టుమిట్టాడుతున్నవారంతా సొంత బాటలోపయనించాలనుకుంటున్నారు. తెలంగాణతెలుగుదేశం నాయకులకు భావసారూప్యత గలపార్టీగా టిఆర్‌ఎస్‌ఒక్కటే కన్పిస్తోంది. అయితే టిఆర్‌ఎస్ కూడాగత మునిసిపల్ ఎన్నికల్లో అవమానకరమైన ఫలితాలుచవి చూడడంతో ఆ పార్టీని పూర్తిగా నమ్ముకునేపరిస్ధితి లేదు. తెలంగాణ రాష్ట్రం వచ్చితీరుతుందని, అందుకే కేంద్ర మంత్రివర్గంలోపాగా వేసి ఉన్నామనిటిఆర్‌ఎస్ అధినేత చంద్రశేఖరరావుతెలంగాణ తెలుగుదేశం నాయకులకురహస్య సంకేతాలు పంపిస్తున్నారు.తెలంగాణ టిడిపి నాయకులకుముఖ్యంగా దేవేందర్ గౌడ్ వంటివారికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలనేమనసులో ఉంది. తెలంగాణ రాష్ట్రంఏర్పడితే, టిడిపి తెలంగాణ దేశం గామార్చుకోవచ్చని, చంద్రబాబు నాయుడు పెత్తనంలేకుండా చూసుకోవచ్చని వీరి ఆలోచన.
తెలంగాణఅభివృద్ధి, నిరుద్యోగ సమస్య నిర్మూలన, నీటిపారుదలప్రాజెక్టుల నిర్మాణంతెలంగాణ తెలుగుదేశం ఎజెండాలోనిప్రధానాంశాలుగా ఉంటాయి. తెలంగాణప్రజలకు ఎన్టీఆర్ అంటే అభిమానం కాబట్టిఆయనను ప్రచారంలో ప్రధానంగావాడుకోవాలని ఆలోచన. అయితే చంద్రశేఖరరావుకలలు గంటున్నప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనతర్వాతే ఈ సినిమా అంతా. తెలంగాణరాష్ట్రం ఏర్పడకపోతే తెలంగాణతెలుగుదేశం నాయకులంతా చంద్రబాబుచుట్టూ చేతులు కట్టుకుని నిలబడాల్సిందే.












Click it and Unblock the Notifications
