హరికృష్ణస్వగృహ ప్రవేశం?
హోంపేజి
టాక్ ఆఫ్ టుడే;/SPAN>
జనరల్ 29-07-2005
;?
హైదరాబాద్:ఎన్టీఆర్ కుమారుడు, సినీనటుడుహరికృష్ణ త్వరలో తెలుగుదేశం పార్టీలోచేరే అవకాశముంది. అధికారంలోఉన్నప్పుడు హరికృష్ణను దూరంచేసుకున్న చంద్రబాబు నాయుడుతెలుగుదేశం పార్టీకి నందమూరికలర్ ఇవ్వాలనుకుంటున్నట్టు తెలిసింది. ఎన్టీఆర్‌నుగద్దె దింపడానికి చంద్రబాబు నాయుడితోచేతులు కలిపిన హరికృష్ణరవాణా మంత్రిగా అధికారంఅనుభవించారు. చంద్రబాబు నాయుడుతోవచ్చిన విభేదాల కారణంగాతెలుగుదేశం పార్టీకి గుడ్‌బై చెప్పిఅన్న తెలుగుదేశం పార్టీ పెట్టారు. ఆ పార్టీ ఫ్లాప్ కావడంతో రాజకీయాలకుదూరంగా ఉంటున్నారు.
గత ఎన్నికలముందు ఎన్టీఆర్ పెద్దల్లుడు దగ్గుబాటివెంకటేశ్వరరావు, ఆయన భార్యపురందరేశ్వరి కాంగ్రెస్ పార్టీలో చేరారు.పురందరేశ్వరి ఎంపీగా, దగ్గుబాటి ఎమ్మెల్యేగాగెలుపొందారు.దీనితో ఎన్టీఆర్ కుటుంబంలో ఒక భాగంకాంగ్రెస్‌కు అంకితమైనట్టయింది.త్వరలో జరుగనున్న కేంద్రమంత్రివర్గ విస్తరణలో పురందరేశ్వరికిమంత్రి పదవి వచ్చే అవకాశాలున్నాయి.అదే జరిగితే ఒక వర్గం ప్రజలు ఆమె చుట్టూర్యాలీ అయ్యే అవకాశముంది. దానిని బ్యాలెన్స్‌చేయడానికి హరికృష్ణనుటిడిపిలోకి చేర్చుకుని, పార్టీలో ఎన్టీఆర్‌స్ఫూర్తిని నింపాలని చంద్రబాబు నాయుడు యోచిస్తున్నారు. ఇటీవల గండిపేటలోఎన్టీఆర్ మోడల్ స్కూల్ ప్రారంభోత్సవంలోబావా బావ మరుదులు మాట్లాడుకున్నారు.హరికృష్ణ తన ఉపన్యాసంలో చంద్రబాబునాయుడి నాయకత్వాన్ని ప్రశంసించారు.
హరికృష్ణతెలుగుదేశం పార్టీలో చేరినా జూనియర్ ఎన్టీఆర్ ఆపార్టీకి మద్దతు ఇచ్చే అవకాశం లేదు. తండ్రి హరికృష్ణతో ఆయనసంబంధాలు ఇటీవల అంతంత మాత్రంగా ఉన్నాయి. హరికృష్ణనందమూరి కళ్యాణ్‌రామ్‌ను ప్రమోట్‌చేయడం జూనియర్ ఎన్టీఆర్‌కు రుచించడంలేదు. బాలకృష్ణ మాత్రంటిడిపికి బహిరంగంగా మద్దతు ఇచ్చే అవకాశాలున్నాయి.
-సిహెచ్ శ్రీనివాసరావు
ఇటీవలి కథనాలు హోంపేజి












Click it and Unblock the Notifications