• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

జగన్‌బాబుపుట్టినరోజు

By Staff
|

హోంపేజి టాక్‌ ఆఫ్‌ టుడే రాజకీయాలు 21-12-2005

హైదరాబాద్‌:నేడు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి పుట్టినరోజని పత్రికల్లో ఆయన శ్రేయోభిలాషులు, అనుచరులు ఇచ్చినభారీప్రకటనలను బట్టి తెలిసింది. ముఖ్యమంత్రి ముద్దులకుమారుడుకావడం, త్వరలో ఆయనరాజకీయాల్లోకి రానుండడంతో వందిమాగధులు ఆయన చుట్టూ పెద్దసంఖ్యలోనే చేరారు. దినపత్రికల్లోలక్షలాది రూపాయల విలువైన ప్రకటనలుఇచ్చిన వారు వ్యాపారులు, కాంగ్రెస్‌ పార్టీలోపైకి వద్దామనుకునే వారే. బెంగుళూరులో బిజినెస్‌చేసుకుంటున్నఒక యువకుడి బర్త్‌డేకి ఇంతహంగామా అవసరమా అన్పించక మానదు.పుట్టినరోజును ఎవరి తగ్గట్టు వారుజరుపుకోవడంలో తప్పులేదు. అదివారి వ్యక్తిగత వ్యవహారం.

తనకు అరవైఏళ్ళు వచ్చేనాటికి రాజకీయాల నుంచిరిటైర్‌ అవుతానని వైఎస్‌రాజశేఖరరెడ్డి అధికారంలోకిరావడానికి కొన్ని నెలల ముందుప్రకటించారు. ఆయన ప్రకటనప్రకారం 2009 ఎన్నికల్లో ఆయన పోటీ చేయకూడదు. ఈలోపుకుమారుడుజగన్మోహన్‌ రెడ్డిని రాజకీయాల్లోప్రవేశపెట్టాలన్నది వైఎస్‌ ఆలోచనగా కన్పిస్తోంది. 1999 అసెంబ్లీ ఎన్నికల్లోనేరాజకీయాల్లోకి రావడానికి జగన్‌ఉత్సాహపడినా వైఎస్‌ప్రోత్సహించలేదు. అప్పుడు అధికారంలోలేని వైఎస్‌కు రాజకీయాలంటే మనసులోఒక వైపు ఏవగింపు ఉండేది.రాజకీయాల్లో, అధికార స్ధానాల్లో నల్లటిడబ్బు, ఎర్రటి రక్తం ప్రవహిస్తుంటాయి.నువ్వు రాజకీయాల్లోకి రావడం నాకిష్టంలేదు. నీకు నచ్చిన బిజినెస్‌ చేసుకో అనిఆనాడు వైఎస్‌ తన కుమారుడికి హితవచనాలు చెప్పారు.

అధికారంలోకివచ్చాక అన్నీ మారిపోతాయి. ఎండిపోయిన చెట్లుకూడా కళ్ళకు ఆకుపచ్చని రంగులోఅందంగా కన్పిస్తాయి. వైఎస్‌అధికారంలోకి వచ్చాక జగన్‌ అనేకసార్లు వార్తల్లోకి వచ్చాడు. పరిటాల రవిబతికున్నప్పుడు జగన్‌ మీద ఆరోపణలు చేశారు. ఆయన హత్య జరిగినదరిమిలా జగన్‌ పేరు వార్తల్లోకి వచ్చింది. పరిటాలహత్య ఉదంతం ఎఫ్‌ఐఆర్‌లో జగన్‌ పేరుఉంది. సిబిఐ ఆయనను సిఎం ఇంట్లో ఎంతో వినయంగా ఇంటరాగేట్‌చేసింది. వైఎస్‌తండ్రి రాజారెడ్డి ఫ్యాక్షనిస్టు అన్నసంగతి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు.వైఎస్‌ ఆ విషయంలో సాఫ్ట్‌. తాతగారి పోలికలుమనవడు జగన్‌కు వచ్చాయనికడప జిల్లాలో అందరూ చెప్పుకుంటారు.యువకుడైన జగన్‌ రాజకీయాల్లోకిరావడాన్ని ఎవరూ తప్పు పట్టరు.రాజకీయాలు హింసకు, అవినీతికి, అక్రమాలకుదూరంగా ఉండాలని ప్రజాస్వామ్యప్రియులు కోరుకోవడం అసమంజసంకాదు. పుట్టిన రోజు నాడు జగన్‌ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి ఉంటాననిమనసులో ప్రతిన చేసుకోవాలని ఆశిస్తూఅతనికి జన్మదిన శుభాకాంక్షలనుతెలియజేస్తున్నాం.

ఇటీవలికథనాలు హోంపేజి

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X