వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్లీనరీతర్వాత మారిన సీనరీ

By Staff
|
Google Oneindia TeluguNews

హోంపేజి టాక్‌ ఆఫ్‌ టుడే కాంగ్రెస్‌ 25-01-2006

హైదరాబాద్‌:ఎఐసిసి ప్లీనరీ తర్వాత ముఖ్యమంత్రివైఎస్‌ రాజశేఖరరెడ్డి హవా బాగాపెరిగింది. ఆయనకు వ్యతిరేకంగాఅసమ్మతిని కూడగట్టే ధైర్యం ఇప్పుడుఎవరికీ ఉండదు. కేంద్రంలో కాంగ్రెస్‌అధికారంలోకి రావడానికి తెలుగు ప్రజలేకారణమని స్వయంగా ప్రధానిమన్మోహన్‌ సింగ్‌, కాంగ్రెస్‌అధ్యక్షురాలు సోనియా గాంధీఅంగీకరించడం విశేషం. అధికారంలోకివచ్చి20 నెలలు గడుస్తున్నా ఆయనమంత్రివర్గాన్ని విస్తరించలేదు. మంత్రిపదవులను ఆశిస్తున్మవారిలో అసహనంపెరుగుతున్నా వారు ఏమీ చేయలేనిపరిస్ధితి. కాంగ్రెస్‌ మారిన సంస్కృతికి ఇదినిదర్శనం.

నీటిపారుదలప్రాజెక్టులు, వ్యవసాయ రంగ అభివృద్ధిమీద ఫోకస్‌ పెట్టుకున్న రాష్ట్ర కాంగ్రెస్‌ప్రభుత్వానికి నిధులుసమకూర్చుకోవడంలో కొన్ని ఇబ్బందులుఉన్నాయి. ఎన్నారైలు ఇరిగేషన్‌ ప్రాజెక్టులకుకొంతవరకు పెట్టుబడులు పెడతారన్నవిశ్వాసం ప్రభుత్వంలో కనిపిస్తోంది. వచ్చేఎన్నికల లోపు కొన్ని ఇరిగేషన్‌ ప్రాజెక్టులనైనాపూర్తి చేయలేకపోతే ప్రజల్లో నెగిటివ్‌సంకేతాలు వెళ్ళే అవకాశముంది.రైతులకు ఉచిత విద్యుత్‌ ప్రభుత్వానికిగ్రామీణ ప్రాంతాలో మంచి పేరు తెచ్చిపెట్టింది.

వైఎస్‌నాయకత్వంలో కాంగ్రెస్‌ ప్రభుత్వంసజావుగా సాగిపోతుండడంతెలుగుదేశం పార్టీకి ఇబ్బందికరంగాపరిణమించింది. కాంగ్రెస్‌ ప్రభుత్వానికివ్యతిరేకంగా పెద్ద ఎత్తునఉద్యమం చేయదగిన సమస్యలుతెలుగుదేశం నాయకులకుకన్పించడం లేదు. ప్రతిపక్షంగా సరిగాపనిచేయలేకపోతున్నామని చంద్రబాబునాయుడు పార్టీ సమావేశంలోఅంగీకరించడం విశేషం. చంద్రబాబునాయుడికి కుడి భుజంగా ఉన్న కొన్నిమీడియా సంస్ధలు కూడా ఆయనకుసరైన ఇన్‌పుట్స్‌ఇవ్వలేకపోతున్నాయి. వచ్చే ఎన్నికలనాటికి టిడిపి బలపడజాలదని చెప్పలేం.కానీ చంద్రబాబు నాయుడు తనవ్యూహంలో విప్లవాత్మక మార్పులుచేసుకోవలసిన అవసరముంది.

ఇటీవలి కథనాలు హోంపేజి

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X