వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాహుల్‌ గాంధీపుట్టిన దేశం

By Staff
|
Google Oneindia TeluguNews

హోంపేజి టాక్‌ ఆఫ్‌ టుడే;/SPAN> జనరల్‌ 22-10-2005

హైదరాబాద్‌:ముగ్గురు ప్రధాన మంత్రులముద్దుల వారసుడు రాహుల్‌గాంధీరాష్ట్రంలో రహస్యంగా (బహిరంగరహస్యమే) పర్యటించడం పెద్దసంచలనమైంది. నిన్న మధ్యాహ్నం మూడు గంటలకు హైదరాబాద్‌లోఅడుగుపెట్టిన రాహుల్‌ గాంధీకి ఎస్పీజీ పోలీసులు కంటికి రెప్పలా కాపాడారు.శుక్రవారం రాత్రి ఇంత గొప్ప అతిధిసాదాసీదా ప్యారడైజ్‌ హోటల్‌లో ఒక్కడేడిన్నర్‌ చేయడం రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకులకు ఎంతగానోబాధ కలిగించింది.త్వరలో ప్రధాన మంత్రి కావలసినయువకుడు రాష్ట్రంలో ఎవరూ లేనట్టుఒంటరిగా ఒక చిన్న హోటల్‌లో బిర్యానీ తినిసంతృప్తి పడిపోవడం మనముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డినిఎంతగానో కలవరపరిచింది.

జాతీయ స్ధాయిలోనేకాంగ్రెస్‌ పార్టీకి అదృష్ట చిహ్నంఆంధ్రప్రదేశ్‌. బీహార్‌ ఎన్నికలకు కూడాఇక్కడి నుంచే కోట్లాది రూపాయల పార్టీఫండ్‌ మన రాష్ట్రం నుంచేతరలిపోతోంది. అధికార పార్టీకి చెందినచిన్న నాయకులు కూడా గ్రాండ్‌ కాకతీయస్ధాయి నుంచి కిందకు దిగని పరిస్ధితిలోరాహుల్‌ గాంధీ వంటి వ్యక్తి అతి సామాన్యమైనప్యారడైజ్‌ హోటల్‌లో భోజనం చేయడం కాంగ్రెస్‌నాయకులకు బాధ కలిగించడంసహజమే. పార్లమెంటు సభ్యులకే అందుబాటులో ఉండనిరాహుల్‌ గాంధీ ఆటో డ్రైవర్లు కూడాతినే చోట డిన్నర్‌ చేయడంఏమిటి?రాహుల్‌ గాంధీది పూర్తిగా ప్రైవేటుపర్యటనకు వచ్చారని పిసిసిప్రకటించింది. అందువల్ల మీడియాకు సమాచారంలేదు. అయినా రాష్ట్రఇంటిలిజెన్స్‌ అధికారులు ఎప్పటికప్పుడురాహుల్‌ కదలికల గురించి ముఖ్యమంత్రిరాజశేఖరరెడ్డికి తెలియజేస్తూనేఉన్నారు.

రాష్ట్రానికి వచ్చినరాహుల్‌ గాంధీని అనాధగావదిలేయడం రాజశేఖరరెడ్డికి నచ్చలేదు. ఆయనశనివారం ఉదయం ఢిల్లీలో నెట్‌వర్కింగ్‌చేసిరాహుల్‌గాంధీని లంచ్‌కి ఆహ్వానించి, ప్యారడైజ్‌ కంటేమంచి బిర్యానీతిన్పించారు. చంద్రబాబు నాయుడు దిగిపోయివైఎస్‌ ముఖ్యమంత్రి అయిన కొత్తలోరాహుల్‌ గాంధీ ఒక న్యూస్‌ ఏజెన్సీకి ఇచ్చినఇంటర్వ్యూలో చంద్రబాబు నాయుడు మంచినాయకుడు. ఆయన రాష్ట్రానికి చేసినసేవలు అపురూపమైనవి. ఆయనను వేధించకూడదు అనిచెప్పారు. ఇంత విశాల హృదయం గల నాయకుడు కాంగ్రెస్‌ వారికి లభించడంవిశేషమే.

-సిహెచ్‌ శ్రీనివాసరావు

ఇటీవలి కథనాలు హోంపేజి

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X