వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలుగులెస్సా?

By Staff
|
Google Oneindia TeluguNews

హోంపేజి టాక్‌ ఆఫ్‌ టుడే;/SPAN> జనరల్‌ 15-11-2005

;?

హైదరాబాద్‌:తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతోఆనాడు ఎన్టీ రామారావు తెలుగుదేశంపార్టీ పెట్టి దానిని సూపర్‌హిట్‌ చేశారు.మరి ఇప్పుడు తమిళులకు భావ దాస్యంచేస్తున్న మన తెలుగు సినిమాప్రముఖులకు ఎవరు విముక్తి కలిగించాలి? తమిళడబ్బింగ్‌ సినిమాలు చంద్రముఖిఅపరిచితుడు ప్రేమిస్తే గజినిసినిమాలు తెలుగు నేలపై దాదాపు ముప్పైకోట్ల రూపాయలు వసూలు చేశాయి. ఆ సినిమాలుబాగున్నాయి కాబట్టి చూశారు- ఇందులో ప్రేక్షకులతప్పేమీ లేదు. వాళ్ళ సినిమాలు ఆడుతున్నందుకుబాధ లేదు, మన ఒరిజినల్‌ తెలుగుసినిమాలు ఎందుకు ఆడడం లేదన్నదేప్రశ్న.

ఈ డబ్బింగ్‌దండయాత్ర చాలదన్నట్టు ఇప్పుడు చిరంజీవిభారీ చిత్రానికి దర్శకుడు తమిళమురుగదాస్‌. బాలకృష్ణ, పవన్‌కళ్యాణ్‌ల భారీ చిత్రాలకు కూడా దర్శకులు తమిళతంబిలే. మన సినిమా సంగీతం కూడాఎక్కువగా తమిళ విధ్వాంసుల నుంచేవస్తున్నది. తమిళ మహాకవి సుబ్రమణ్యభారతి తెలుగు భాష తియ్యదనాన్నికొనియాడారు. అనీ ఉన్నా అల్లుడినోట్లో శని అన్న చందంగాఎందుకు మారిపోయాం? చివరికి జూనియర్‌ఎన్టీఆర్‌ కూడా తమిళ శివకాశి తెలుగురీమేక్‌లో నటిస్తున్నట్టు వార్తలువచ్చాయి. వెంకటేష్‌ ఎటూ తమిళరీమేక్‌లకు, ఫ్రీమేక్‌లకే అంకితమయ్యాడు.

దేశంలోహిందీ తర్వాత పెద్ద సినిమామార్కెట్‌ తెలుగే. తమిళ మార్కెట్‌కంటే మనది చాలా పెద్దది.చంద్రముఖి అపరిచితుడుతమిళంలో కంటే తెలుగులోనే పెద్దహిట్స్‌ అయ్యాయి. ప్రతిభ ఎక్కడున్నామెచ్చుకోవలసిందే. పొరుగు రాష్ట్రంవారి ప్రతిభకు, సృజనాత్మకతకునీరాజనాలు పట్టడంలో తప్పు లేదు. కానీతెలుగులో ఆ స్ధాయి ప్రతిభే లేదా? లేకుండాఎలా ఉంటుంది? కానీ మన నిర్మాతలకుధైర్యం, టేస్టు తక్కువ.అపరిచితుడు వంటి కథనునేరుగా ఎవరైనా తెలుగు రచయితమన నిర్మాతలకు చెబితే ఇక చాల్లే,వెళ్ళు అంటారు. మన భావ దాస్యానికిఇదొక కారణం. మన హీరోలు ఇమేజి చట్రంనుంచి బయటపడలేక పోవడం మరోకారణం. ఏది ఏమైనా కొత్తసంవత్సరంలో నైనా ఈ పరిస్ధితులుకొద్దిగా అయినా మారుతాయని ఆశిద్దాం.

ఇటీవలి కథనాలు హోంపేజి

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X