వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దేవాదాయకుంభకోణ వైశాల్యం

By Staff
|
Google Oneindia TeluguNews

హోంపేజి టాక్‌ ఆఫ్‌ టుడే;/SPAN> జనరల్‌ 24-06-2005

హైదరాబాద్‌:గుడినీ గుడిలో లింగాన్ని మింగేవారుంటారనిదేవాదాయ భూముల కుంభకోణం ధృవీకరించింది.ఈ కుంభకోణంలో రోజుకొక కోణం వెలుగులోకివస్తోంది. దేవాదాయ శాఖ మాజీ కమిషనర్‌ఐ వెంకటేశ్వర్లు ఇంటిపై ఎసిబిఅధికారులు చేసిన దాడిలో అనేకవిలువైన పత్రాలు బయటపడ్డాయి. ఈ కుంభకోణంలో మరికొందరు ఐఎఎస్‌అధికారుల ప్రమేయం ఉన్నట్టు ఆ పత్రాలను బట్టి తెలుస్తోంది. ఈ వ్యవహారంలో గతకమిషనర్‌ల హస్తం ఉన్నప్పటికీ నేరాన్నంతా తన మీదికేనెట్టివేస్తున్నారని వెంకటేశ్వర్లుచీఫ్‌ సెక్రటరీకి రాసిన లేఖలో ఆవేదనవ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడుహయాంలో దేవాదాయ కమిషనర్‌గా పనిచేసిన కెవిరమణాచారి పన్నెండులక్షల రూపాయల విలువచేసే దేవాదాయ భూములనుమూడు లక్షలకే అమ్మేశారని,ఆయన మీద చర్యలు తీసుకోకుండాతనను ఒక్కడినే బలి చేయడంఅన్యాయమని వెంకటేశ్వర్లు వాదన.

రమణాచారిమొదటి నుంచి వివాదాస్పదుడైనఅధికారే. ఆయన గ్రూప్‌ వన్‌ సర్వీసు నుంచి వచ్చిసీనియారిటీ మీద ఐఎఎస్‌ అధికారి అయ్యారు. గతంలో కులీకుతుబ్‌షాఅర్బన్‌ డెవలప్‌మెంట్‌ అధారిటీ (కుడా)ఉపాధ్యక్షుడుగా పనిచేసినప్పుడుఆయన ఒక అధికారిలా కాకుండా పొలిటీషియన్‌గా వ్యవహరించినట్టుఆరోపణలు ఉన్నాయి. 1999 ఎన్నికల సమయంలోసమాచార కమిషనర్‌గా ఉన్న ఆయనఒక సర్వే చేయించి కాంగ్రెస్‌అధికారంలోకి వచ్చేస్తోందంటూ ఆ సర్వేవివరాలను పత్రికలకు లీక్‌ చేయించారు.దానితో ఆగ్రహించిన చంద్రబాబు నాయుడుఆయనను ఆ పోస్టు నుంచి తప్పించారు. నిజానికి ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌విజయం సాధించలేదు. తెలుగుదేశం పార్టీవిజయం సాధించి చంద్రబాబు నాయుడురెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు.కాంగ్రెస్‌ నాయకుల మెప్పు పొందడానికిరమణాచారి అలా చేసినట్టు విమర్శలు వచ్చాయి.

గతఏడాదికాంగ్రెస్‌ గెలిచి, వైఎస్‌ రాజశేఖరరెడ్డిముఖ్యమంత్రి కాగానే బదిలీ అయిన తొలి ఐఎఎస్‌అధికారి రమణాచారే. ఆయనను సమాచార శాఖ కమిషనర్‌గానియమించారు. ఆయన ఈ పోస్టులో ఉంటేప్రభుత్వ కార్యక్రమాలకు సరైనప్రచారం లభిస్తుందని వైఎస్‌ భావించారు.కానీ ఆయన ఈ పోస్టులోకి వచ్చినప్పటి నుంచిపొలిటీషియన్‌లావ్యవహరించడం ముఖ్యమంత్రి సన్నిహితులకునచ్చడం లేదు. చంద్రబాబు నాయుడుప్రచారానికి ఏటా ఐదువందల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టారని, ఆ దుబారావ్యయాన్ని అరికట్టి ఆ డబ్బుతోరైతులకు ఉచిత విద్యుత్‌ ఇస్తామనిఎన్నికల ముందు వైఎస్‌ చెప్పారు. కానీరమణాచారి సమాచార కమిషనర్‌గాప్రభుత్వ కార్యక్రమాల ప్రచారానికికోట్లాదిరూపాయలు ఖర్చుచేస్తున్నారనివిమర్శలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి,ఇతర మంత్రుల ఉపన్యాసాల పూర్తి పాఠాన్నిపత్రికా ప్రకటనలుగా విడుదల చేయించడం అనవసరవ్యయంకిందికి వస్తుందని చెబుతున్నారు.పైగా ఇది ప్రభుత్వ విధానానికివ్యతిరేకమని విమర్శలు వస్తున్నాయి.అయినా ముఖ్యమంత్రి మెప్పు పొందడానికిరమణాచారి ఓవరాక్షన్‌ చేస్తున్నారనిఆరోపణలు వచ్చాయి. కొన్ని నామినేటెడ్‌ పోస్టులభర్తీలో కూడా రమణాచారివేలుపెడుతున్నారని మీడియావాచ్‌పత్రిక రాసింది. ఈ విమర్శల నేపధ్యంలోరమణాచారి సుదీర్ఘ సెలవుపై అమెరికావెళ్ళారు.

దేవాదాయకమిషనర్‌గా ఉన్నప్పుడు రమణాచారి,ఇతర ఐఎఎస్‌ అధికారులు చేసినట్టు చెబుతున్నఅక్రమాలు వెలుగు చూడాలంటే దేవాదాయ భూముల అమ్మకంవ్యవహారంపై సిబిఐ దర్యాప్తు జరిపించాలి. ఆమాత్రం భయం లేకపోతే ఐఎఎస్‌అధికారులందరూ పొలిటీషయన్లుగావ్యవహరిస్తారు.

Recent Stories

నష్టాల తెర
సింధూర దేశభక్తి
షూటింగ్‌ కేసు రివైండ్‌
రాంగోపాల్‌ వర్మ హత్యకు కుట్ర?
ఏకాకి లాలూ, ఏమవుతుందో ఏమో!
ఆటా అధ్యక్షులుగా గవ్వా చంద్రారెడ్డి
తిరగదోడినా ఫలితం శూన్యం?
నేతాజీ మరణ రహస్యం?
రవి అస్తమించిన అనంతపురం
కథల్లేక కదలలేకపోతున్న ఎన్టీఆర్‌ కెరియర్‌
వేడుకలో వితరణ
సీమ వేరుకుంపటి
దొందూ దొందే
కొత్త అధికార నివాసం
ఆరు నెలలకే వారు వీరు
ఐటీ ఉద్యోగుల ఉదారత
2004 వెలుగునీడలు
ఫ్లాష్‌న్యూస్‌
మనసు పాట వినదు
పాపం! బాజీ బజాజ్‌!
తల్లీకొడుకుల అపూర్వ గాధ

ఆ చెట్టు వేళ్ళు పుట్టిన గడ్డలోనే
మాటల మరాఠీ!
ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌గా అమర్‌
కంచిపై ఇంటిలిజెన్స్‌ కన్ను
బాలకృష్ణపై చార్జిషీట్‌
చిరుకథలో పెను మార్పులు!
సినిమా వాళ్ళెక్కడ? మీడియా ఎక్కడ?
జయేంద్ర విశేషాలు
ఒక టిడిపి నేత విజయ గాధ
రాంగోపాల్‌వర్మ నాచ్‌ వివాదం
హెల్మెట్‌లో దాగిన అవినీతి పురుగు
మన్మోహన్‌హంగ్‌!
రాజేంద్రప్రసాద్‌కు రఘుపతి వెంకయ్య అవార్డు
షిండే సక్సెస్‌ స్టోరీ
ఆది మానవుడికీ హనుమంతుడికీ లింకు!
ఉదయభాను విషాద గాధ
ఉత్తమ కంపెనీల్లో సత్యం
హిందీలో వీరప్పన్‌ సినిమా
త్వరలో దాసరి ఛానల్‌!
చిన్న స్వామి స్వర్ణాభిషేకం హోంపేజి

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X