డిజిపిసేన్‌సేషన్‌

హైదరాబాద్‌:రాష్ట్ర పోలీసు డైరెక్టర్‌ జనరల్‌స్వరణ్‌జిత్‌సేన్‌ చాలా డైనమిక్‌గా కన్పిస్తున్నారు. హోంమంత్రి జానారెడ్డిమొద్దు మొద్దుగా మాట్లాడుతూ, నిర్ణయాలు తీసుకునేటప్పుడుకూడా అదేవిధంగా వ్యవహరిస్తున్నారన్నవిమర్శలు ఉన్నాయి. హోంమంత్రికి విషయస్పష్టత లేకపోవడంతో అదేఅదనుగా డిజిపి విజృంభిస్తున్నారు. ప్రజలుసహకరిస్తే నక్సలైట్లను రాష్ట్రం నుంచి తరిమికొడతానని డిజిపి తాజాప్రకటన చేశారు. కూంబింగ్‌ (నక్సలైట్‌ల కోసం గాలింపు) అంటేదువ్వెనతో దువ్వుకోవడమనిఆయన గతంలో ఒక ఛమత్కారప్రకటన చేశారు.

నక్సలైట్లకు,ప్రభుత్వానికి ఇప్పుడు ప్రత్యక్షపోరుజరుగుతోంది. రాజశేఖరరెడ్డివ్యవసాయక్షేత్రం వద్ద నక్సలైట్లు సంచరిస్తున్నారనితెలియడంతో పోలీసులు అలర్ట్‌ అయ్యారు.రాజశేఖరరెడ్డి నక్సలైట్లకు చంద్రబాబునాయుడి కంటే పెద్ద శత్రువైపోయారు. ఎన్నికలముందు నక్సలైట్లకు అనుకూలంగా ప్రకటనలుఇచ్చిన కాంగ్రెస్‌ నాయకులు గత ఎన్నికల్లోఅన్నల వల్ల లబ్ది పొందిన మాట వాస్తవం.ఇచ్చిన మాట ప్రకారం నక్సలైట్లతోమొదటి విడత చర్చలు జరిపారు. ఈ చర్చలు విజయవంతం కావనిఉభయపక్షాలకు బాగా తెలుసు. ఆయుధం ధరించి తిరిగితేచర్చలు ఉండవనిప్రభుత్వం స్పష్టం చేయగా,ఆయుధమే తమ సిద్ధాంతానికి మూలాధారమనిమావోయిస్టులు తెగేసి చెప్పారు.

మావోయిస్టులతోముప్పు పొంచి ఉందని గ్రహించినరాజశేఖరరెడ్డి వారి మీద దుందుడుకుప్రకటనలు చేయకుండా జాగ్రత్తపడుతున్నారు. ఇక హోంమంత్రిమొదటి నుంచి మావోయిస్టుల పట్ల మెతకగావ్యవహరిస్తున్నారు. అయినాఆయన ఏం మాట్లాడుతున్నారో ఆయనకేఅర్ధం కాదు. దీనితో డిజిపిరెచ్చిపోతున్నారు. తాము చెప్పాల్సిందిడిజిపితో చెప్పిస్తే, అవసరమనుకుంటేఆయన ప్రకటనలను ఖండిస్తేసరిపోతుందన్న రాజనీతిని కాంగ్రెస్‌ప్రభుత్వం అనుసరిస్తోంది. రానున్న మునిసిపల్‌ ఎన్నికల్లోనక్సలైట్లప్రభావం ఉండదు. ఎందుకంటే పట్టణప్రాంతాల్లో వారికి ప్రాబల్యం లేదు. పంచాయితీఎన్నికల్లో అయితే అనేక జిల్లాల్లో కాంగ్రెస్‌,టిఆర్‌ఎస్‌లను మావోయిస్టులుఖంగుతినిపించేవారు. డిజిపి ధోరణి ఇదేవిధంగా ఉంటే మావోయిస్టులు సమీప భవిష్యత్తులోవిరుచుకుపడేఅవకాశముంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+