వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికాలో తెలుగుపల్లె

By Staff
|
Google Oneindia TeluguNews

హోంపేజి టాక్‌ ఆఫ్‌ టుడే;/SPAN> జనరల్‌ 29-06-2005

హైదరాబాద్‌:ఉత్తర అమెరికా తెలుగు సంఘం 15వసమావేశాలు డిట్రాయిట్‌లో జులై ఒకటి నుంచిమూడో తేదీ వరకుజరుగనున్నాయి. అమెరికా చివర కెనడాసరిహద్దులో ఉన్న డిట్రాయెట్‌లో తానా సమావేశాలవేదికను తెలుగుపల్లెదనం ఉట్టిపడేలా తీర్చిదిద్దారు.ప్రవాసాంధ్ర సంఘాల్లో తానా అతి పెద్దది.పదివేల మందికిపైగా సభ్యులున్న ఈసంస్ధ ప్రతి రెండేళ్ళకు ఈ సీజన్‌లో సమావేశాలునిర్వహిస్తుంది. సమావేశాలుజరిగే మూడు రోజులు గోంగూర పచ్చడి,ఆవకాయ, ఉలవచారు వంటి అచ్చతెలుగువంటకాలను వండివడ్డించనున్నారు. ఆంధ్రప్రదేశ్‌పల్లెలో ఉన్నామన్న అనుభూతిని వచ్చినవారికి కలిగించడానికి నిర్వాహకులు కృషి చేశారు.

తెలుగుసమావేశాలు యువతరాన్ని, ముఖ్యంగాఐటి తరాన్నిఆకర్షించలేకపోతున్నాయన్నవిమర్శలకుసమాధానంగా యూత్‌కి ప్రత్యేకకార్యక్రమాలు ఏర్పాటు చేశారు. పైగాయువతను ఆకర్షించడానికి సినిమాతారలు ఎటూ వస్తున్నారు. ఈ సభలకు సినీనటిలయ, హీరో శ్రీకాంత్‌ హాజరవుతున్నారు. సత్యం కంప్యూటర్‌సర్వీసెస్‌ చైర్మన్‌ బి.రామలింగరాజు,ఫెమినా మిస్‌ ఇండియా వరల్డ్‌ గద్దెసిందూర ప్రత్యేక ఆకర్షణకానున్నారు.

ఇంకాకేంద్రమంత్రులు ఎస్‌ జైపాల్‌రెడ్డి,రేణుకాచౌదరి, ఎ.నరేంద్ర, రాష్ట్రమంత్రులు బొత్స సత్యనారాయణ, కన్నా లక్ష్మీనారాయణ, పార్లమెంటు సభ్యులు రాయపాటిసాంబశివరావు, మధు యాష్కి గౌడ్‌,విఠల్‌రావు, ఉండ వల్లిఅరుణ్‌కుమార్‌, రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌సురేష్‌రెడ్డి, కెసిపి గ్రూప్‌ చైర్మన్‌విఎల్‌ దత్‌ కూడా తానా సమావేశాలకుహాజరవుతున్నారు.

తానాసభల ప్రాంగణంలో మ్యారేజ్‌ బూత్‌ ఏర్పాటుచేశారు. ప్రవాసాంధ్ర మహిళలసమస్యలు, సాధక బాధకాలు చర్చించడానికి ఒకఫోరం ఏర్పాటు చేశారు.ఆదివారం నాడు చీరలు, పంచెలు ఎలా కట్టుకోవాలోనేర్పిస్తారట. శనివారం నాడు భారతదేశంలో పెట్టుబడి అవకాశాల పైబిజినెస్‌ కాన్ఫరెన్స్‌ ఉంటుంది.

ఇటీవలి కథనాలు హోంపేజి

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X