వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దొందూదొందే

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: పెనుకొండఉపఎన్నిక ఫలితం తెలుగుదేశం పార్టీలోఉత్సాహాన్ని నింపినా అంతర్గత విభేదాలు ఆ పార్టీని పట్టిపీడిస్తున్నాయి. హైదరాబాద్‌నగరంలో విజయరామారావు, శ్రీనివాసయాదవ్‌ వర్గాల మధ్య పోరునడుస్తోంది. రంగారెడ్డి జిల్లాలో ఆజిల్లా పరిషత్‌ చైర్మన్‌ కాసానికి, మాజీహోంమంత్రి దేవేందర్‌గౌడ్‌కుమధ్య కోల్డ్‌వార్‌ తీవ్రంగా ఉంది.సాధారణంగా ప్రతిపక్షంలో ఉన్న పార్టీలోఇటువంటి విభేదాలు కనిష్ట స్ధాయిలో ఉండాలి.కానీ ఇంకా అధికారంలో ఉన్నట్టు ఫీల్‌ అవుతున్న టిడిపిలో విభేదాలస్ధాయి తీవ్రంగా ఉంది.

టిడిపిసీనియర్‌ నాయకుడు ఉమ్మారెడ్డివెంకటేశ్వర్లు తెలుగుదేశంమేధావిగా చలామణి కావడం,అధినేత చంద్రబాబు నాయుడిపై ఆయనప్రభావం ఎక్కువగా ఉండడం యనమలరామకృష్ణుడు వంటి సీనియర్‌ నాయకులకునచ్చడం లేదు.సంఖ్యాధిక్యత గల ఒక కులానికిప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మారెడ్డికినిజానికి ఆ కులంపై పట్టులేనప్పటికీఆయన కాగితం పువ్వులా చలామణిఅవుతున్నారు. అదేవిధంగా దేవేందర్‌గౌడ్‌కు, యనమలరామకృష్ణుడికి కూడా వారి వారి కులాలపైపట్టులేదు. అయినా వారు ఆయా కులాలప్రతినిధులుగా చంద్రబాబు నాయుడుకొలువులో కొనసాగుతున్నారు.

ఉత్తరభారతదేశంలో లాగానే మన రాష్ట్రరాజకీయాల్లో కులాల ప్రభావం ఉంది. అక్కడఉన్నంత ఓపెన్‌గా లేనప్పటికీ ఇక్కడపరోక్ష ప్రభావం ఎక్కువ. ఇదిహర్షణీయ పరిణామం కానప్పటికీకమర్షియల్‌గా మారిన రాజకీయరంగంలో ఈ దుష్టప్రభావం ఉండి తీరుతుంది. తెలుగుదేశంపార్టీకిమొదటి నుంచి బిసిలకు ప్రాధాన్యం ఇచ్చే పార్టీగా పేరుంది. కాంగ్రెస్‌పార్టీకి ఆ ఇమేజ్‌ లేదు. కాంగ్రెస్‌ ప్రధానం గా రెడ్లపార్టీగా మిగిలిపోయింది. 1989 నుంచి 94 వరకుచెన్నారెడ్డి, జనార్ధనరెడ్డి,విజయభాస్కరరెడ్డి ముఖ్యమంత్రులుగాఉండడంతో కాంగ్రెస్‌పై రెడ్డి పార్టీగా చెరగనిముద్రపడింది. పదేళ్ళతర్వాత అధికారంలోకి వచ్చినకాంగ్రెస్‌ ముఖ్యమంత్రిగారాజశేఖరరెడ్డి ఎంపిక కావడంతో ఆముద్ర ఇంకా బలపడింది.

ప్రజాఉద్యమాలను అణిచివేయడం,పెత్తందారులను ప్రోత్సహించడంలోటిడిపికి, కాంగ్రెస్‌కు తేడా లేదు.కాకపోతే ఒక పార్టీతో విసిగిపోయినతర్వాత మరో పార్టీకి అధికారంకట్టబెట్టడం ఆనవాయితీగా వస్తోంది.ఎప్పటికప్పుడు ప్రభుత్వ వ్యతిరేకకీలపాత్ర వహిస్తున్నదే కానీ నిజమైనమెరిట్స్‌కు ప్రాధాన్యం ఉండడం లేదు.ఫలితంగా ఎనభై శాతం ఉన్న కిందివర్గాల జనాభాకు అధికారంలో తగిన రీతిలోభాగం రావడం లేదు. ఉభయ కమ్యూనిస్టుపార్టీలు కూడా బలహీనవర్గాలకు ప్రాధాన్యం ఇవ్వడంలోవిఫలమయ్యాయి.

ఇటీవలికథనాలు

  • మహా విమర్శలు
  • ఎన్టీఆర్‌ స్మృతిలో...
  • మాస్టర్‌ ప్లాన్‌!
  • చక్రబంధంలో చంద్రబాబు
  • చంద్రబాబుకుకేంద్ర రక్షణ!
  • పరిటాల రాజకీయ వైరాగ్యం
  • మా తెలుగు బాబుకు చాడీల దండ!
  • ఇక బాబు రోడ్‌షోలు
  • టిడిపి గుండెల్లో ఏలేరురైళ్ళు
  • చంద్రబాబుతురుపుముక్క
  • ఎన్టీఆర్‌ గుర్తున్నాడా?
  • సైకిల్‌కుఅసమ్మతి బ్రేక్‌లు
  • చిరంజీవిరహస్య ఎజెండా?

  • అస్పష్ట రాజకీయ చిత్రం
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X