వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్టీఆర్‌ పార్టీయేనా ఇది?

By Staff
|
Google Oneindia TeluguNews

హోంపేజి టాక్‌ ఆఫ్‌ టుడే తెలుగుదేశం 03-11-2005

;?

హైదరాబాద్‌:తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంగా కూడాపెద్ద ప్రభావం చూపలేకపోతోంది. కొన్నిటీవీ ఛానళ్ళు చంద్రబాబు ప్రెస్‌మీట్లనువిస్తృతంగా కవర్‌ చేస్తున్నప్పటికీ పెద్దగా ఫలితంకన్పించడం లేదు. ఈ సిద్ధాంతాలకుకట్టుబడి తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిందోఅవి ఇప్పుడు మొక్కుబడిగా మారడం, పార్టీలోధనస్వామ్యం పెరగడం,అధినాయకుడు సద్విమర్శలనుసహించలేకపోవడం వంటి కారణాలవల్ల తెలుగుదేశం పార్టీ నిస్తేజంగా మారింది. ఎన్ని దెబ్బలు తగిలినాచంద్రబాబు నాయుడిలో మార్పు రాలేదనడానికి ఒకచిన్న ఉదాహరణ ఇది. రాష్ట్ర సమాచారకమిషన్‌లో కమిషనర్ల పదవులకు చంద్రబాబునాయుడు ఒక జాబితా సమర్పించారు. ఆ జాబితాలో ఉన్న పేర్లుచూసిఅందరూ నవ్వుకున్నారు. చంద్రబాబు నాయుడుముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకు పిచ్చిసలహాలు ఇచ్చి నజరానాలు పొందినకొందరు అవినీతిపరులు ఆ జాబితాలో ఉన్నారు.చంద్రబాబు నాయుడు ఆ పేర్లను సమర్పించినవ్వుల పాలయ్యారనితెలుగుదేశం సీనియర్‌ నాయకులేజనాంతికంగా వ్యాఖ్యానిస్తున్నారు. చంద్రబాబులోమంచి మార్పు వచ్చేఅవకాశమే లేదా అని వారుప్రశ్నిస్తున్నారు.

బలహీనవర్గాలపార్టీగా పేరు తెచ్చుకున్నతెలుగుదేశం పార్టీలో బలహీనవర్గాల నుంచి వచ్చిబలిసిపోయిన నాయకులుఉన్నారు. వారిని ప్రజలకు చూపించి మీ వర్గానికిచెందిన వారిని ఇంత మంచి స్ధితిలోకితెచ్చాం అంటే జనం వంద ప్రశ్నలు వేస్తున్నారు.ఉదాహరణకువెనుకబడిన యాదవ కులానికి చెందిన యనమల రామకృష్ణుడుఇరవై ఏళ్ళుగా తెలుగుదేశం పార్టీలోప్రభుత్వంలో కీలక పదవులు నిర్వహిస్తున్నారు. ఆయనఒక్కడిని చూపించి, యాదవ కులానికి న్యాయంచేశామని చెప్పడం ఎంతవరకు సమంజసం? అలాగేదేవేందర్‌ గౌడ్‌ విషయం కూడా. ఈ వర్గాలకుచెందినయువ నాయకులను చంద్రబాబు నాయుడు ప్రోత్సహించాలి. మళ్ళీపేదలకు తిండీ నీడా అనే నినాదంఅందుకుని, కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో కాంట్రాక్టర్లు ఎంతగాలాభపడుతున్నారో బయటపెట్టగలిగితే నిస్తేజంగా ఉన్న తెలుగుదేశంపార్టీలో ఒకఊపు వచ్చే అవకాశముంది.

చంద్రబాబునాయుడిలో ఒక బలహీనత ఉంది. ఎన్టీఆర్‌కుతాను వెన్నుపోటు పొడిచినప్పుడుతనకు వెన్నుదన్నుగా ఉన్న మీడియా ప్రతినిధులను, కుహనామేధావులను ఆయన తలమీద పెట్టుకునిపీకల వరకు తెచ్చుకున్నారు. వారిలోకొందరు గాంధీభవన్‌ మెట్లు ఎక్కినా,కొందరు ఇంతకాలంగా చంద్రబాబువద్ద చొంగలు కార్చుకుంటూ బతికారు.అటువంటి వారిని కూడా చంద్రబాబు నాయుడుఇన్‌ఫర్మేషన్‌ కమిషనర్‌ పదవులకుసిఫార్సు చేయడం సర్వత్రావిమర్శలకు గురైంది. పల్లెలనువిడిచిపెట్టి ఆకాశంలో సాము చేసినందుకుచంద్రబాబు నాయుడుతగిన మూల్యం చెల్లించుకున్నారు. అవేతప్పులను ఆయన చేసుకుంటూ పోతేతెలుగుదేశం పార్టీ భవిష్యత్తుప్రశ్నార్ధకంగా మారుతుంది.

ఇటీవలి కథనాలు హోంపేజి

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X