వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాములమ్మఅలయెన్స్‌లు

By Staff
|
Google Oneindia TeluguNews

హోంపేజి టాక్‌ ఆఫ్‌ టుడే రాజకీయాలు 08-06-2005

హైదరాబాద్‌:తెలంగాణరాష్ట్ర సాధన ఉద్యమానికి కాలుదువ్విన సినీనటి విజయశాంతి అలయన్స్‌లురూపుదిద్దుకుంటున్నాయి. ఈ అలయన్స్‌సమావేశం ఈ నెల 12వ తేదీనహైదరాబాద్‌లో జరుగుతోంది. పదహారుతెలంగాణ సంస్థలతో కలిసి తెలంగాణయునైటెడ్‌ ఫ్రంట్‌ (టఫ్‌) ఏర్పడింది. ఈఫ్రంట్‌ తొలి ప్రతినిధుల సమావేశం 12వతేదీ మధ్యాహ్నం రెండు గంటలకుబాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞానకేంద్రంలో జరుగుతుంది. ఈసమావేశానికి విజయశాంతి ముఖ్య అతిథిగాహాజరవుతున్నారు.

తెలంగాణప్రజలు, నిస్వార్థ ప్రజా ఉద్యమ శక్తులునిరంతరాయంగా నిర్మిస్తున్నతెలంగాణ ప్రజా ఉద్యమాలు మలిదశకుచేరుకున్నాయని, ఈ మలిదశలోఅవకాశవాద రాజకీయ శక్తులురంగప్రవేశం చేసి తెలంగాణఉద్యమాన్ని హైజాక్‌ చేసే ప్రయత్నంచేస్తున్నాయని టఫ్‌ ప్రధాన అభియోగం.అవకాశవాద రాజకీయ శక్తులుశల్యసారథ్యం వహించి రాజీన పడటంవల్లనే తెలంగాణ సమస్య తిరిగిమొదటికి వస్తోందనేది దీని ప్రధానఅవగాహన.

తెలంగాణవాదులతోపొత్తు పెట్టుకుని ఎన్నికల్లో గెలిచినతర్వాత మరోసారి తెలంగాణకుమొండిచేయి చూపడానికిసిద్ధపడిందని, తెలంగాణ రాష్ట్ర సమితి(టి ఆర్‌యస్‌) నాయకులు పదవులచూరు పట్టుకొని వేళాడుతూ తెలంగాణఆత్మ గౌరవాన్ని మంటగలుపుతున్నారనిటఫ్‌ విమర్శిస్తోంది. తెలుగుదేశంసమైక్యాంధ్రకు కలిసిరావాలనిపిలుపునివ్వడం, వామపక్షాలసమైక్యాంధ్ర వాదాన్ని పట్టుకునివేళ్లాడటం వంటి విషయాలనువిమర్శిస్తూనే టఫ్‌ కాంగ్రెస్‌, తెలంగాణరాష్ట్ర సమితి (టి ఆర్‌యస్‌)లపై తీవ్రవిమర్శలు చేస్తోంది. వాటి తప్పులను ఎత్తిచూపుతోంది.

ఐదుకీలకాంశాలతో ఉద్యమాన్ని ముందుకుతీసుకుపోవాలని టఫ్‌ భావిస్తోంది. అవి: 1. విశాల ప్రజాఉద్యమం ద్వారా తెలంగాణ రాష్ట్రాన్నిసాధించుకోవాలి. 2. కేవలం భౌగోళికతెలంగాణకే పరిమితం కాకుండాసామాజిక న్యాయ ప్రాతిపదికపై ప్రాంతీయ -సామాజిక ప్రజాస్వామ్య ఉద్యమ నిర్మాణంచేపట్టాలి. 3. ఆంధ్ర రాష్ట్ర సాధనకుఉద్యమిస్తున్న శక్తులతో తెలంగాణరాష్ట్ర ఉద్యమ శక్తులు పరస్పరంసమన్వయం చేసుకోవాలి. 4. తెలంగాణరాష్ట్ర ఏర్పాటు వల్ల ఆంధ్రలోని సామాన్యప్రజలకు ఎటువంటి నష్టం జరగదు,అక్కడివారు తెలంగాణకు శత్రువులుకాదనే అవగాహనతో తెలంగాణ -ఆంధ్ర ప్రజలు తమ సంస్కృతులనుపరస్పరం గౌరవించుకోవాలి. 5.తెలంగాణ - ఆంధ్ర రాష్ట్రాలసాధనకు ఉద్యమించే రెండు వేదికలుతెలంగాణ - ఆంధ్ర రాస్ట్రాలసమన్వయ ఉద్యమ కమిటీగాఏర్పడాలి.

ఈటఫ్‌లోని సంస్థలు: తెలంగాణ రాష్ట్రసాధన ఫ్రంట్‌, మహాజన ఫ్రంట్‌,తెలంగాణ జనతా పార్టీ, తెలంగాణకమ్యూనిస్టు పార్టీ, నేషనల్‌ లేబర్‌ పార్టీ,తెలంగాణ ప్రజా సమితి, సామాజిక న్యాయఉద్యమ వేదిక, తెలంగాణ రాష్ట్రవిద్యావంతుల వేదిక, తెలంగాణమునిసిపల్‌ పంచాయతీల పారిశుధ్యకార్మిక సంఘం, ఆంధ్రప్రదేశ్‌ దళితసంఘాల పరిషత్‌, తెలంగాణ రీజనల్‌స్టాఫ్‌ అసోసియేషన్‌, ఎరుకల హక్కులపోరాట సమితి, దళిత క్రైస్తవ ఫ్రంట్‌,దళిత సంఘర్షణ సమితి, తెలంగాణరాష్ట్ర విద్యార్థి సమితి, తెలంగాణ ప్రజాఉద్యమ సమితి.

ఉద్యమం మలిదశలో కొన్ని శక్తులుతెలంగాణకు ద్రోహంతలపెడుతున్నాయనే ఈ సంస్థలు మళ్లీమొదటి నుంచి తెలంగాణ ఉద్యమాన్నినిర్మించే కృషిలో ఉన్నట్లు తెలుస్తోంది.తెలంగాణ ఐక్య వేదిక, తెలంగాణమేధావుల వేదిక వంటి పలు సంస్థలుఇప్పటికే తెలంగాణలో పని చేస్తున్నాయి. ఈటఫ్‌ వాటికి ప్రత్యామ్నాయం కాదని,వాటికి పోటీ కూడా కాదనే భావనతెలంగాణ ప్రజలకు మలి ఉత్సాహాన్నిఇవ్వవచ్చు. దీని కార్యకలాపాల ఉధృతి,మనుగడ గత నాలుగేళ్లుగానాయకత్వ స్థాయిలో పని చేస్తున్నవర్గాల పనితీరుపైనే ఆధారపడిఉంటుందనడంలో సందేహం లేదు.

Recent Stories
  • కెసిఆర్‌ ఢిల్లీమంత్రాంగం
  • మామూలై పోయిన మామూళ్ళు!
  • తెలంగాణపై మళ్ళీ దోబూచులాట!
  • తెలంగాణ వచ్చుడో, కెసిఆర్‌ చచ్చుడో
  • తారల ప్రభావం నిల్‌!
  • ఉద్వేగ అంశాలు
  • తారల ప్రభావం నిల్‌!
  • ఇప్పటికిప్పుడు చెరిసగం

  • పార్టీ టికెట్ల మార్కెటింగు
  • చిరంజీవి రహస్య ఎజెండా?

  • అస్పష్ట రాజకీయ చిత్రం
  • కెసిఆరే పెద్ద ఫ్యాక్టర్‌
  • పార్టీ టికెట్ల మార్కెటింగు
  • చిరంజీవి రహస్య ఎజెండా?

  • అస్పష్ట రాజకీయ చిత్రం
  • హోంపేజి
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X